Begin typing your search above and press return to search.

నిశ్శబ్దమే ప్రస్తుతానికి ఉత్తమ ఫార్ములా... న‌మ్ర‌త ఇంట్రెస్టింగ్ కామెంట్!

అయితే తాజాగా మ‌హేష్ స‌తీమ‌ణి న‌మ‌త్ర‌ను ఈ సినిమా గు రించి ఏదైనా మాట్లాడాల్సిందిగా కోరిన‌ప్పుడు? ఆమె ఇంట్రెస్టింగ్ లీక్ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   31 March 2025 5:45 AM
Namrata About SSMB29
X

#ఎస్ ఎస్ ఎంబీ 29పై ఎలాంటి అంచ‌నాలున్నాయి? అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. మ‌హేష్ హీరోగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో భారీ కాన్వాస్ పై తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. ఇప్ప‌టికే సినిమా స్టోరీ ఏంటి? అన్నది లీకైంది. ఆప్రిక‌న్ అడ‌వుల నేప‌థ్యంలో సాగే అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ ఇది. మ‌హేష్ అడ్వెంచ‌ర్ పాత్ర‌లో అద‌ర‌గొడ‌తాడ‌ని అంతా న‌మ్ముతున్నారు. మ‌హేష్ న‌ట‌న‌....రాజ‌మౌళి మేకింగ్ తో ఈ సినిమా పాన్ ఇండియాని దాటి పాన్ వ‌ర‌ల్డ్ నే షేక్ చేస్తుంద‌ని అంచ‌నాలున్నాయి.

అందుకు త‌గ్గ‌ట్టే జ‌క్క‌న్న చిత్రాన్ని చెక్కుతున్నాడు. అయితే ఈ సినిమా గురించి రైటర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ మిన‌హా ఎవ‌రూ ఇంత‌వ‌ర‌కూ స్పందించ‌లేదు. మ‌హేష్ గానీ, రాజ‌మౌళి గానీ ఆ ఫ్యామిలీకి సంబంధించి ఇంకెవ‌రూ కూడా ఎలాంటి లీక్ ఇవ్వ లేదు. అయితే తాజాగా మ‌హేష్ స‌తీమ‌ణి న‌మ‌త్ర‌ను ఈ సినిమా గు రించి ఏదైనా మాట్లాడాల్సిందిగా కోరిన‌ప్పుడు? ఆమె ఇంట్రెస్టింగ్ లీక్ ఇచ్చారు. ఆమె సింపుల్ గా 'నిశ్శబ్దమే ప్రస్తుతానికి ఉత్తమ ఫార్ములా' అంటూ ముగించారు.

దీంతో ఈ సినిమా విషయంలో న‌మ్ర‌త ఎంత క్లారిటీగా ఉన్నారు? ఇంకెంత న‌మ్మ‌కంగా ఉన్నారు? అన్న‌ది అర్ద‌మ‌వుతుంది. మౌనం...సైలెన్స్ అన్న‌ది ఎంత ప్ర‌మాద‌క‌రంగా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. మౌనం.. సైలెన్స్ ను దాటి బ్లాస్ట్ అయితే ఆ రిజ‌ల్ట్ ఊహ‌కి కూడా అంద‌దు. హిస్ట‌రీలో నిలిచిపోతుంది. అలాంటి సినిమా మ‌హేష్ -రాజమౌళి కాంబినేష‌న్లో వ‌స్తుంది? అన్న హిట్ ను న‌మ్ర‌త అందించారంటూ ఘ‌ట్ట‌మ‌నేని అభిమానులు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

ప్ర‌స్తుతం ఎస్ ఎస్ ఎంబీ 29 షూటింగ్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఒడిశా షెడ్యూల్ పూర్తి చేసారు. ప్ర‌స్తుతం ఫారిన్ షెడ్యూల్ కి సంబంధించి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. విదేశాల్లో మ‌హేష్ స‌హా ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా జాయిన్ అవుతుందా? లేదా? అన్న దానిపై ఇంకా స‌రైన క్లారిటీ లేదు