Begin typing your search above and press return to search.

SSMB29.. లుక్కు తోనే కిక్కు ఇచ్చేలా..!

లాంగ్ హెయిర్, గుబురు గడ్డం మహేష్ ని ఇదివరకు ఎప్పుడు చూడని విధంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇవ్వనున్నాడు రాజమౌళి.

By:  Tupaki Desk   |   14 May 2024 8:08 AM GMT
SSMB29.. లుక్కు తోనే కిక్కు ఇచ్చేలా..!
X

గుంటూరు కారం తర్వాత మహేష్ చేస్తున్న రాజమౌళి సినిమా పై అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. రాజమౌళి ఈ సినిమా గురించి ఎక్కడ మాట్లాడకపోయినా సరే మహేష్ ప్రెజన్స్ మాత్రం కావాల్సినంత స్టఫ్ అందిస్తున్నాయి. ముఖ్యంగా మహేష్ మేకోవర్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ కానుందని తెలుస్తుంది. మహేష్ హీరోగా చేసిన 30 సినిమాల్లో మాక్సిమం ఒకేరకంగా కనిపించాడు. అతిది, పోకిరి లాంటి సినిమాల్లో కాస్త రఫ్ లుక్ తో కనిపించాడు. హీరోగా కెరీర్ మొదట్లో లవర్ బోయ్ గా ఉన్న మహేష్ నిజం సినిమాలో ఇన్నోసెంట్ లుక్ తో కనిపించాడు.

ఒక్కడు సినిమా మహేష్ లోని మాసిజం ని బయట పెట్టింది. ఆ సినిమా తర్వాత మహేష్ కు మాస్ ఫాలోయింగ్ పెరిగింది. ఇక పోకిరి, బిజినెస్ మ్యాన్, దూకుడు వరుస హిట్లు సూపర్ స్టార్ కి తిరిగు లేకుండా చేశాయి. మహేష్ రీసెంట్ మూవీ గుంటూరు కారం లో కూడా కాస్త రఫ్ లుక్ ట్రై చేశాడు. ఇక మహేష్ 29వ సినిమాలో సూపర్ స్టార్ లుక్ పూర్తిగా కొత్తగా ఉండబోతుందని అర్ధమవుతుంది.

లాంగ్ హెయిర్, గుబురు గడ్డం మహేష్ ని ఇదివరకు ఎప్పుడు చూడని విధంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇవ్వనున్నాడు రాజమౌళి. సోమవారం ఎలక్షన్స్ కారణంగా మహేష్ క్యాప్ తో కనిపించాడు. లాంగ్ హెయిర్ కనిపించకుండా క్యాప్ కవర్ చేసినా సరే గడ్డం మాత్రం కనిపించింది. అయితే షూటింగ్ ఇంకా 3 నెలలు ఉన్న కారణంగా మహేష్ ఇంకాస్త జుట్టు పెంచుకుంటాడని ఆ తర్వాత తన లుక్ ఫిక్స్ చేస్తారని తెలుస్తుంది.

అయితే మహేష్ రీసెంట్ లుక్ చూసిన కొందరు ఆడియన్స్ 90 దశకంలో హీరోల్లా కనిపిస్తున్నాడని అన్నారు. అవును అప్పటి హీరోలు ఇలానే లాంగ్ హెయిర్ తో అప్పట్లో ఒక ట్రెండ్ కొనసాగించారు. అయితే రాజమౌళి మళ్లీ ఆ వింటేజ్ ట్రెండ్ ని మహేష్ తో కొనసాగించే ప్లాన్ చేశాడని తెలుస్తుంది. కెరీర్ లో ఫస్ట్ టైం ప్రాంతీయ సినిమాను వదిలి భారీ సినిమాకు ప్లాన్ చేస్తున్న మహేష్ ఈ సినిమాతో నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో రికార్డులు సృష్టిస్తాడని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. మరి SSMB29 ఎలా ఉండబోతుంది అన్నది చూడాలి.