Begin typing your search above and press return to search.

'SSMB29' కోసం మరొకరా?

దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తో సినిమా చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకు నిర్మాతలు కూడా అతీతం కాదు.

By:  Tupaki Desk   |   21 Jan 2024 7:50 PM GMT
SSMB29 కోసం మరొకరా?
X

దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తో సినిమా చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకు నిర్మాతలు కూడా అతీతం కాదు. జక్కన్నతో సినిమా చేస్తే నిర్మాత పంట పండినట్లే. కానీ సినిమాకు భారీ బడ్జెట్ పెట్టాల్సి ఉంటుంది. షూటింగ్ మధ్యలో బడ్జెట్ ఎంత పెరిగినా పెట్టాలి తప్పితే వెనకడుగు వేయకూడదు. అందుకే రాజమౌళితో సినిమా అంటే నిర్మాతలు తొందర పడకుండా కాస్త ఆలోచించి అడుగులు వేస్తారు.

సరే అని రిస్క్ చేసి సినిమా ప్రొడ్యూస్ చేస్తే ఆ నిర్మాత డబ్బులు పెట్టేంత వరకే, మిగతాదంతా రాజమౌళి దగ్గరుండి చూసుకుంటారు. ప్రొడక్షన్ నుంచి మొదలు పెడితే మార్కెటింగ్ వరకు అంతా జక్కన్న అండ్ ఫ్యామిలీ చూసుకుంటారు. ఇక జక్కన్న ఓ నిర్మాతకు మాట ఇచ్చాడంటే ఎన్ని సంవత్సరాలు అయినా ఆ నిర్మాతకి సినిమా చేస్తాడు. అలా ఎప్పుడో తనకు ఇచ్చిన అడ్వాన్స్ ను తిరిగి ఇవ్వకుండా మాటకు కట్టుబడి DVV దానయ్యకి సినిమా చేశాడు.

ఇక ఇప్పుడు మహేష్ బాబుని హీరోగా పెట్టి సీనియర్ నిర్మాత కె.ఎల్ నారాయణతో సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 1000 నుంచి 1200 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టులో కే ఎల్ నారాయణతో భాగస్వామం అవడం కోసం టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు భారీ కసరత్తులు చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఒకవేళ దిల్ రాజుకి ఇందులో భాగస్వామ్యం దొరికితే ఓ రెండు మూడు సంవత్సరాలు వేరే సినిమా చేయకపోయినా పర్వాలేదు.

అంతెందుకు రాజమౌళి- మహేష్ ప్రాజెక్టులో భాగం దొరికితే నైజాం, వైజాగ్ ఏరియాల రైట్స్ కూడా తనకే వస్తాయి. అందుకే దిల్ రాజు ఇందుకోసం భారీగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు మహేష్ బాబు అంగీకరించినా, రాజమౌళి ఒప్పుకుంటారా? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. మరోవైపు ఇదే ప్రాజెక్టు కోసం రాజమౌళి ఓ ప్రముఖ హాలీవుడ్ స్టూడియోతో భాగస్వామ్యం అయ్యేందుకు ట్రై చేస్తున్నట్లు విశ్వాసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

హాలీవుడ్ సంస్థలయితే ఖర్చుతో పాటు టెక్నికల్ ఇంకా ప్రొడక్షన్ సపోర్ట్ కూడా అందిస్తాయి. కాబట్టి రాజమౌళి అలాంటి వాటి కోసం ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే నిర్మాతగా కేఎల్ నారాయణ పాత్ర అంతంతమాత్రంగానే ఉంటుంది. హాలీవుడ్ స్టూడియోతోనే భాగస్వామ్యం కోసం ట్రై చేస్తున్న రాజమౌళి మరొకరిని ఈ ప్రాజెక్టులో భాగం కానిస్తాడా లేదా అనేది చూడాలి. ఇక ఈ సినిమా కథ దాదాపు ఫినిష్ అయినట్లు తెలుస్తోంది. ఇదే ఏడాది సమ్మర్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.