Begin typing your search above and press return to search.

SSMB29.. అసలు వర్క్ స్టార్ అయ్యేది ఎప్పుడంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   19 July 2024 10:45 AM GMT
SSMB29.. అసలు వర్క్ స్టార్ అయ్యేది ఎప్పుడంటే?
X

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ మూవీ తెరకెక్కనుంది. భారీ బడ్జెట్ ఈ సినిమాని కెఎల్ నారాయణ నిర్మించబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన ప్రీప్రొడక్షన్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరో వైపు సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం ప్రత్యేకంగా రెడీ అవుతున్నాడు.

మహేష్ బాబు ఈ సినిమా కోసం చేయించుకున్న కొత్త లుక్ తో అందరిని మెస్మరైజ్ చేస్తున్నారు. హాలీవుడ్ హీరో రేంజ్ లో సూపర్ స్టార్ జక్కన్నతో చేయబోయే సినిమా కోసం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మరో వైపు ఈ మూవీ స్క్రిప్ట్ రిహార్శల్స్ కూడా అవుతున్నాయంట. అలాగే షూటింగ్ లొకేషన్స్ కి సంబందించిన సెట్ వర్క్, స్టోరీబోర్డు రెడీ చేసే పనిలో జక్కన్న బిజీగా ఉన్నారని తెలుస్తోంది.

హాలీవుడ్ యాక్టర్స్ ఈ చిత్రంలో కీలక పాత్రలలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా హాలీవుడ్ లో రాణిస్తోన్న ఇండోనేషియా బ్యూటీని ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పృథ్వీ రాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో సూపర్ స్టార్ కి ప్రతినాయకుడిగా కనిపిస్తాడని జోరుగా టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాని ఏప్రిల్ లోనే స్టార్ట్ చేస్తారని అందరూ భావించారు.

అయితే ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు. అక్టోబర్ లో చిత్ర యూనిట్ నుంచి ప్రకటన ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ దీనిపై కూడా ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ఈ ఏడాది ఆఖరులో రాజమౌళి ఈ చిత్రాన్ని స్టార్ట్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. రాజమౌళి సెట్స్ పైకి వెళ్ళడానికి ముందే ఆర్టిస్ట్స్ తో కంప్లీట్ రిహార్శల్స్ కూడా చేయిస్తాడు. అలాగే ప్రొపర్ గా స్టోరీ బోర్డు రెడీ చేసుకొని షూటింగ్ స్టార్ట్ చేస్తారు. క్యాస్టింగ్ కూడా ఈ సారి చాలా కీలకంగా ఉండబోతోంది.

వీటిని దృష్టిలో ఉంచుకొని ఈ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ కోసం ఎక్కువ టైం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు అడ్వాంచర్ ట్రావెలర్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడంట. ఈ సినిమాని కూడా ఫ్రాంచైజ్ గానే రాజమౌళి తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇండియానా జోన్స్ తరహాలో ఈ మూవీ కథాంశం ఉండబోతోందనే టాక్ నడుస్తోంది.