SSMB29 : ఎట్టకేలకు బిగ్ అప్డేట్ తో జక్కన్న టీం!
కల్కి సినిమా తర్వాత రాజమౌళి నుంచి రాబోతున్న మహేష్ బాబు మూవీ అంతకు మించి అన్నట్లుగా ఉండాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.
By: Tupaki Desk | 4 July 2024 4:24 AM GMTటాలీవుడ్ జక్కన్న రాజమౌళి బాహుబలి మరియు ఆర్‌ఆర్ఆర్ సినిమాల తర్వాత చేయబోతున్న సినిమా పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న విషయం తెల్సిందే. ఏడాది క్రితమే రాజమౌళి తదుపరి సినిమా మహేష్ బాబుతో అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది.
రాజమౌళి సినిమా అంటే హడావుడి అసలు ఉండదు. స్క్రిప్ట్ వర్క్ కి, సెట్ వర్క్ కి, నటీనటుల ఎంపిక ఇలా ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ కే ఏడాది కంటే ఎక్కువ సమయం పట్టడం మనం చూస్తూ ఉంటాం. మహేష్ బాబు సినిమా కోసం కూడా సుదీర్ఘ కాలం పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరిగింది.. ఇంకా జరుగూనే ఉంది.
జక్కన్న టీం మెంబర్స్ నుంచి అందుతున్న అనధికారిక సమాచారం ప్రకారం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ముగింపు దశకు చేరుకుంది. ఆగస్టు వరకు సెట్ వర్క్ పూర్తి అవ్వడంతో పాటు, నటీనటుల ఎంపిక పక్రియ కూడా పూర్తి అవ్వబోతుందట. దాంతో సినిమాను సెప్టెంబర్ లో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
నిన్న మొన్నటి వరకు రాజమౌళి - మహేష్ బాబు కాంబో మూవీ షూటింగ్ ప్రారంభం అవ్వాలంటే 2025 వరకు వెయిట్ చేయాల్సిందే అన్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ లోనే మొదటి షెడ్యూల్ జరిగే అవకాశాలు ఉన్నాయి.
మొదటి షెడ్యూల్ లో మహేష్ బాబు పాల్గొంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. గత కొన్నాళ్లుగా మహేష్ బాబు లుక్ విషయంలో రాజమౌళి ని మెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒక సారి గడ్డం పెంచుకుని, మరోసారి జుట్టు పెంచుకుని రాజమౌళి అనుకుంటున్న లుక్ కి మారేందుకు కృషి చేస్తున్నాడు అంటూ సమాచారం అందుతోంది.
కల్కి సినిమా తర్వాత రాజమౌళి నుంచి రాబోతున్న మహేష్ బాబు మూవీ అంతకు మించి అన్నట్లుగా ఉండాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. రాజమౌళి కూడా కచ్చితంగా ఆ దిశగానే ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. మరో వెయ్యి కోట్ల మూవీ కచ్చితంగా జక్కన్న నుంచి రావడం ఖాయం.
ఈ ఏడాదిలోనే సినిమా షూటింగ్ ప్రారంభం అయితే 2026 సమ్మర్ వరకు సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. రాజమౌళి గత చిత్రాలు బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ లకు అనుకోని కారణాల వల్ల ఎక్కువ సమయం తీసుకోవాల్సి వచ్చింది. కానీ మహేష్ బాబు సినిమా కు అలా అయ్యే అవకాశం లేదు.
ఏడాదిలో మేకింగ్, నాలుగు అయిదు నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ముగించే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. అదే జరిగితే 2026 ప్రథమార్థంలో సినిమాను రాజమౌళి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.