Begin typing your search above and press return to search.

SSMB29 అప్డేట్.. ఇది పర్ఫెక్ట్ డేట్!

ఇదిలా ఉంటే ఆగష్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే రాబోతోంది. ఆ రోజున సినిమాకి సంబందించిన కీలక అప్డేట్ ని రాజమౌళి ఇచ్చే ఆలోచనలో ఉన్నారంట.

By:  Tupaki Desk   |   7 July 2024 6:32 AM GMT
SSMB29 అప్డేట్.. ఇది పర్ఫెక్ట్ డేట్!
X

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక దిగ్గజం రాజమౌళితో మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మహేష్ బాబు రెడీ అవుతున్నారు. ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా లుక్ టెస్ట్ జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది ఆఖరులో మూవీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందంట. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ మూవీగా రాజమౌళి తెరకెక్కించబోతున్నారు. ఇండియాలో అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమాని కెఎల్ నారాయణ నిర్మించబోతున్నారు.

ఈ చిత్రంలో మహేష్ బాబు వరల్డ్ ట్రావెలర్ గా నటిస్తాడని టాక్ వినిపిస్తోంది. అలాగే అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో కథ ఉంటుందని గతంలో వినిపించిన మాట. ఇదిలా ఉంటే ఆగష్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే రాబోతోంది. ఆ రోజున సినిమాకి సంబందించిన కీలక అప్డేట్ ని రాజమౌళి ఇచ్చే ఆలోచనలో ఉన్నారంట. మూవీ కాన్సెప్ట్ వీడియోని రెడీ చేసి బర్త్ డే ట్రీట్ గా అందించాలని అనుకుంటున్నారంట.

ఈ సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడనే టాక్ కూడా వినిపిస్తోంది. మహేష్ బాబు రాజకుమారుడు సినిమాతో హీరోగా మారిన తర్వాత ఇప్పటి వరకు డ్యూయల్ రోల్ చేయలేదు. మొదటి సారి ఈ SSMB29లో రెండు భిన్నమైన పాత్రలలో కనిపిస్తాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇక ఈ సినిమాకి మహారాజ్ అనే టైటిల్ ని అనుకుంటున్నారంట. అది ఇంకా అఫీషియల్ గా అయితే ఖరారు కాలేదు.

మూవీలో ఇండోనేషియా బ్యూటీ చెల్సియాని హీరోయిన్ గా ఫిక్స్ చేశారనే ప్రచారం జరుగుతోంది. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతి నాయకుడిగా నటిస్తాడని టాక్ బలంగా వినిపిస్తోంది. వీటిలో వాస్తవం ఎంత అనేది చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు తెలియదు. అయితే మహేష్ బాబు బర్త్ డే కి మాత్రం ట్రీట్ ఉండే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలలో చెప్పుకుంటున్నారు. అదే జరిగితే సూపర్ స్టార్ అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని చెప్పొచ్చు.

మూవీ కోసం హాలీవుడ్ ఆర్టిస్ట్స్ ని కూడా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జక్కన్న ఓ హాలీవుడ్ క్యాస్టింగ్ ఏజెన్సీతో ఒప్పందం చేసుకున్నారు. అలాగే ఈ సినిమాని ఫ్రాంచైజ్ గా ప్లాన్ చేయొచ్చనే టాక్ కూడా నడుస్తోంది. రెండు భాగాలుగా అయితే వచ్చేఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. ఏదైనా జక్కన్న మూవీ చేసే ముందు కథ ఏంటనేది చెప్పేసి చేయడం అలవాటు. అలాగే ఈ సినిమాకి కూడా అసలు స్టోరీ ఏంటనేది రివీల్ చేసే ఛాన్స్ ఉంది. అది ఎప్పుడనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు.