Begin typing your search above and press return to search.

మ‌హేష్- రాజ‌మౌళి మూవీ రిలీజ్ తేదీ?

ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తాను తెర‌కెక్కించ‌నున్న‌ తాజా సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు జ‌క్క‌న్న‌.

By:  Tupaki Desk   |   7 Jun 2024 3:58 AM GMT
మ‌హేష్- రాజ‌మౌళి మూవీ రిలీజ్ తేదీ?
X

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి భారతదేశంలోనే టాప్ డైరెక్టర్. అతడు ఏం చేసినా అది ఎప్పుడూ ప్రత్యేకమే. వ‌రుస పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో సంచ‌ల‌నం సృష్టిస్తున్న రాజ‌మౌళి అప‌జ‌య‌మెరుగ‌ని ద‌ర్శ‌కుడిగా అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తాను తెర‌కెక్కించ‌నున్న‌ తాజా సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు జ‌క్క‌న్న‌.

రాజమౌళి ప్ర‌తిసారీ భారీ కాన్వాసుతో ముందుకు వ‌స్తున్నాడు. అత‌డు తన షూటింగ్‌లను పూర్తి చేయడానికి సంవత్సరాలు పడుతుంది. భారీత‌నంతో నిండిన మేకింగ్ ప్రాసెస్ కాబ‌ట్టి సినిమాలు ఆలస్యం అవుతున్నాయి. అయితే రాజమౌళి ఈసారి ప్రీ ప్రొడక్షన్ పనులకే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నాడని ప్ర‌తి విష‌యంలో పిన్ టు పిన్ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడ‌ని స‌న్నిహిత సోర్స్ చెబుతోంది. ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌ర్ఫెక్ట్ గా ఉంటే, షూటింగ్ ప‌ని ఈజీ అవుతుంది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, మహేష్ బాబు సినిమా 2027 మొదటి త్రైమాసికంలో విడుదల అవుతుంది. ఈలోపు కంగారు ప‌డ‌రు. ప్ర‌తిదీ ప్ర‌ణాళిక ప్ర‌కారం జ‌రుగుతుంది.

మహేష్ బాబు ఈ సినిమా కోసం ఇప్ప‌టికే చాలా ప్రిప‌రేష‌న్ సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫిజిక‌ల్ గా చాలా మార్పులు క‌నిపిస్తున్నాయి. లుక్ పూర్తిగా మారింది. హనుమంతుని స్ఫూర్తితో ఒక పాత్రను పోషించడానికి మహేష్ బాబు బలమైన శరీరాకృతిని నిర్మించే పనిలో ఉన్నాడు. ఈ చిత్రం జంగిల్ డ్రామా థ్రిల్లర్‌గా ఉంటుందని .. భీక‌ర‌మైన పోరాటాలు ఉంటాయ‌ని, మ‌హేష్ పాత్ర లార్జ‌ర్ దేన్ లైఫ్ త‌ర‌హాలో ఉంటుంద‌ని అందుకే ఈ పరివర్తన పాత్రకు కీలకమ‌ని తెలుస్తోంది. ఈ చిత్రం పౌరాణిక అంశాల‌ను మేళ‌విస్తూ అడ్వెంచర్ అంశాల సమ్మేళనంగా ఉంటుందని ప్రత్యేకమైన సినిమాటిక్ అనుభూతిని అందిస్తుంద‌ని చెబుతున్నారు.