Begin typing your search above and press return to search.

రాజ‌మౌళికి ముందున్న‌ S.S మీనింగ్ ఇదే!

అందుకే ఆయ‌న పేరు ముందు కూడా 'ఎస్ ఎస్' అనే ఉంటుంది. స‌క్సెస్ స‌క్సెస్ అనేది రాజ‌మౌళి ఇంటిపేరుగా మారిపోయింది.

By:  Tupaki Desk   |   10 Oct 2023 12:26 PM GMT
రాజ‌మౌళికి ముందున్న‌ S.S మీనింగ్ ఇదే!
X

భార‌తదేశం గ‌ర్వించ ద‌గ్గ ద‌ర్శ‌కుల్లో రాజ‌మౌళి ఒక‌రు. ఇంత‌వ‌ర‌కూ ఆయ‌న‌కు అప‌జ‌య‌మ‌న్న‌దే లేదు. 'బాహుబ‌లి'..'ఆర్ ఆర్ ఆర్' లాంటి సినిమాల‌తో తెలుగు సినిమా స‌త్తా ప్ర‌పంచ దేశాల్లో చాటిన ఏకైక ద‌ర్శ‌కుడు. నాటు నాటు పాట‌కు ఆస్కార్ అవార్డు రాక‌తో తెలుగు ఖ్యాతి మ‌రింత విశ్వ‌వ్యాప్తమైంది. దేశం జెండాని ఆస్కార్ పై రెప రెప‌లాండిచిన గొప్ప ద‌ర్శ‌కుడిగా చ‌రిత్ర‌కెక్కారు.

ఇలా రాజ‌మౌళి ఏం చేసినా విజ‌య‌మే త‌ప్ప‌! అప‌జ‌యం అనే మాట‌ని ఎరుగ‌ని గ్రేట్ మేక‌ర్ గా నిలిచారు. అందుకే ఆయ‌న పేరు ముందు కూడా 'ఎస్ ఎస్' అనే ఉంటుంది. స‌క్సెస్ స‌క్సెస్ అనేది రాజ‌మౌళి ఇంటిపేరుగా మారిపోయింది. స‌క్సెస్ త‌ర్వాతే రాజ‌మౌళి అన్నంత‌గా ప్ర‌పంచ వ్యాప్తంగా ఫేమ‌స్ అయిపో యారు. గొప్ప గొప్ప అంత‌ర్జాతీయ టెక్నీషియ‌న్ల తోనే ప్ర‌శంలందుకున్న మేధావిగా కీర్తింప‌బడ్డారు.

మ‌రి ఇంత‌కీ రాజ‌మౌళి పేరు ముందు ఉన్న ఎస్ ఎస్ వెనుక అస‌లైన ర‌హ‌స్యం ఏంటి? ఎప్పుడైనా దీని గురించి ఆలోచించారా? అభిమానంతో జ‌క్క‌న అని పిలుచుకుంటాం. లేదంటే! రాజ‌మౌళి సార్ అని సంభాషిస్తాం. కానీ ఏనాడు ఆ ఎస్ ఎస్ గురించి చించింది లేదు. తాజాగా ఆ గుట్టు వీడింది. ఎస్ ఎస్ అంటే! శ్రీ శైలం శ్రీ. రాజ‌మౌళి పూర్తి పేరు శ్రీ శైలం శ్రీ రాజ‌మౌళి అన్న‌మాట‌. చిన్న‌ప్పుడు త‌ల్లిదండ్రులు ఆ విధంగా నామ‌క‌ర‌ణం చెసారు.

కాల‌క్ర‌మేణా అది ఎస్ ఎస్ గా మారిపోయింది. ఇక రాజ‌మౌళిని అత్యంత‌ అభిమానించే కీర‌వాణి కూడా ఏ నాడు ఎస్ ఎస్ అంటే ఏంటి? అన్న‌ది రివీల్ చేయ‌లేదు. అది ఇంత‌వ‌ర‌కూ గోప్యంగానే ఉంది. తాజాగా ఆ ర‌హ‌స్యం వీడింది. ఇక‌పై రాజ‌మౌళిని జ‌క్క‌న్న అని కాకుండా శ్రీశైలం శ్రీ అని కూడా అభిమానులు పిలుచుకోవ‌చ్చు. అయితే ఈ విష‌యాన్ని రాజమౌళి అండ్ కో ధృవీక‌రించాల్సి ఉంది.