రాజమౌళి అదే ప్రశ్న డార్లింగ్ ని అడిగితే?
ఒకే వేదికపై ఇద్దరు అగ్ర దర్శకులు....వాళ్లలో ఏ దర్శకుడు ఇష్టం అని ఓ స్టార్ హీరోని అడిగితే ఎంత ఇబ్బంది పడతాడో తెలిసిందే
By: Tupaki Desk | 30 Dec 2023 12:30 AM GMTఒకే వేదికపై ఇద్దరు అగ్ర దర్శకులు....వాళ్లలో ఏ దర్శకుడు ఇష్టం అని ఓ స్టార్ హీరోని అడిగితే ఎంత ఇబ్బంది పడతాడో తెలిసిందే. ఎవరు ఇష్టం అని చెప్పాలో తెలియక నానా అవస్తలు పడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవరు పేరు చెప్పినా మరొకరు ఫీల్ అవుతారా? అనే సాధారణ అభిప్రాయం రావడం సహజం. కానీ ఈ విషయంల్ రాక్ స్టార్ రణబీర్ కపూర్ గట్స్ మాత్రం వేరే లెవల్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రశ్న తొలుత ఆయన ఫేస్ చేసాడు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన 'యానిమల్' ఈవెంట్ లో ఈ ప్రశ్న ఎదురైంది.
సందీప్ రెడ్డి వంగ అంటే అభిమానమా? నేను అంటే అభిమానమా? అని రాజమౌళి డైరెక్టర్ గా రణబీర్ కపూర్ ని అడిగితే అతను అరక్షణం ఆలోచించి సందీప్ పేరు చెప్పాడు. దీన్నీ రాజమౌళి అంతే పాజిటివ్ గా తీసుకుని జెన్యూన్ గా ఉన్నావ్ అంటూ మెచ్చుకున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది జక్కన్నగారు. ఇటీవలే 'సలార్' టీమ్ ని కూడా రాజమౌళి ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. అందులో ప్రభాస్.. ప్రశాంత్ నీల్..పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొన్నారు.
రాజమౌళి ఆ ముగ్గురు ఎదురుగా కూర్చుని ఎన్నో ప్రశ్నలు సంధించారు. ఎంతో సేపు సంభాషించారు. కానీ ప్రభాస్ ని మాత్రం ఆ ప్రశ్న అడగలేదు. నీకు రాజమౌళి అంటే అభిమానమా? ప్రశాంత్ నీల్ అంటే అభిమానమా? ఇద్దరి వర్క్ ఎక్స్ పీరియన్స్ ఎవరితో బాగుటుందో? అని రాజమౌళి అడుగుతారని అంతా భావించారు. కానీ ప్రభాస్ ముందుకు ఆ ప్రశ్న వెళ్లలేదు. బహుశా ఆప్రశ్న అడిగితే డార్లింగ్ ఇబ్బంది పడతాడని అడిగి ఉండకపోవచ్చు.
అడగడానికి రాజమౌళికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ప్రభాస్ సమాధానం చెప్పలేక అసౌకర్యానికి గురవ్వడం అయితే జరుగుతుంది. అందుకే ఆ ఇంటర్వ్యూలో ఆ ప్రశ్న స్కిప్ చేసారు. అది చాలదా? రాజమౌళికి డార్లింగ్ అంటే ఎంత ఇష్టమో చెప్పడానికి. సాహో బాహుబలి!