మనీ థాట్ మైండ్ లోకి రానివ్వని ఒకే ఒక్కడు!
ఎందుకంటే? జీవితం ఒక్కసారిగా మాళ్లీ జీరోకి తీసుకెళ్లింది కాబట్టి
By: Tupaki Desk | 2 Jan 2024 9:23 AM GMTటాలీవుడ్ డైరెక్టర్లలో డబ్బు గురించి అసలు పట్టించుకోని దర్శకుడు ఎవరు? అంటే డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ పేరు చెబుతారంతా. ఎందుకంటే ఓ మనిషిని నమ్మి 100 కోట్లు పోగొట్టుకోవడంతో! అతను డబ్బు అనే దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తాడు? అన్నది అర్దమైంది. అసలు డబ్బుని పట్టించుకోని ఏకైక డైరెక్టర్ గా ఇంతకాలం అందరికీ తెలిసింది అతనే. అలా నష్టపోయిన తర్వాత పూరి జాగ్రత్తపడటం మొదలు పెట్టాడు.
ఎందుకంటే? జీవితం ఒక్కసారిగా మాళ్లీ జీరోకి తీసుకెళ్లింది కాబట్టి. మళ్లీ ఆ జీవితాన్ని ఎవరూ కోరుకోరు కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తపడాలి అన్నది ఆయనకి అప్పుడు బాగా అర్దమైంది. తాజాగా పూరి లాగే పాన్ ఇండియా మేకర్ రాజమౌళి కూడా డబ్బు అనే థాట్ ఆయన మైండ్ లో అస్సలు ఉండదట. ఎంతసేపు పనిధ్యాస! అంట? ఏ పనిలో నిమగ్నమైతే ఆ పనితప్ప డబ్బు ఆలోచన రాదుట. మరి అతని అవసరాలు ఎవరు తీరుస్తారు? అంటే రాజమౌళి కారు డ్రైవర్ అట.
అవును రాజమౌళి జేబులో ఎప్పుడూ చిల్లి గవ్వ ఉండదట. బయటకు వెళ్లినా కూడా డబ్బులు పెట్టుకోరుట. బయటకు వెళ్లే సమయంలో డబ్బు అవసరం అవుతుందని భావించి రమా రాజమౌళి కారు డ్రైవర్ జేబులో డబ్బులు పెడుతారుట. అలాగే అవసరమైన డెబిట్..క్రెడిట్ కార్డులు కూడా అతని జేబులోనే ఉంటాయట. ఎక్కడ ఏం తీసుకున్నా డ్రైవర్ చెల్లించి వస్తాడుట. డబ్బు పట్ల రాజమౌళి అనాసక్తిని గ్రహించి చెక్ పవర్ ఆప్ పటా కూడా రమా తీసుకున్నారుట.
కొన్నాళ్ల పాటు రాజమౌళి మెయింటెన్ చేసారుట. కానీ రాజమౌళి చెక్ పై సంతకాలు గీకునట్లు పెడతారుట. ఆ సతకంతో బ్యాక్ లో ఇబ్బందులు ఎదురవుతున్నాయట. దీంతో ఆయనతో లాభం లేదని ఆబాధ్యత కూడా రమా తీసేసుకున్నారుట. డబ్బు విషయంలో ఆమె మాత్రం చాలా జాగ్రత్తగా అన్ని దగ్గరుండి చూసుకుంటారుట. ఎలాంటి పరిస్థితుల నుంచి ఆ స్థాయికి వచ్చామో! మళ్లీ ఆ స్థాయికి వెళ్ల కూడదు అంటే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని రమా అంటున్నారు. ఈ విషయాలన్ని ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలిపారు.