Begin typing your search above and press return to search.

రాజ‌మౌళి- ర‌మ మ‌రో పుష్ప‌-శ్రీ‌వ‌ల్లిలా

సై సై సోకుల‌కు అంటూ చంటిగాడు పాట‌కు మాస్ స్టెప్పుల‌తో ఆక‌ట్టుకున్నారు రాజ‌మౌళి. ఇది చూశాక‌.. జ‌క్క‌న్న‌లో ఇంత మంచి డ్యాన్స‌ర్ ఉన్నాడా?

By:  Tupaki Desk   |   14 Dec 2024 12:01 PM GMT
రాజ‌మౌళి- ర‌మ మ‌రో పుష్ప‌-శ్రీ‌వ‌ల్లిలా
X

ఇటీవ‌లే పుష్ప‌రాజ్ వీర‌విహారం పెద్ద తెర‌పై చూసాం. పుష్ప‌2 సినిమాలో యాక్ష‌న్ కంటెంట్ కంటే భావోద్వేగాలు, భార్యాభ‌ర్త‌ల అనుబంధం, రొమాన్స్ పాళ్లు సుకుమార్ కొంచెం ఎక్కువే క‌లిపారు. నిజానికి పుష్ప 2 విజ‌యానికి ఇవే ప్ర‌ధాన అస్సెట్ గా మారాయి. పుష్ప 2లో అల్లు అర్జున్ - ర‌ష్మిక మంద‌న్న మ‌ధ్య మ‌రోసారి అద్భుత‌మైన కెమిస్ట్రీ వ‌ర్క‌వుటైంది. పాట‌ల్లోను ఈ జంట అద్భుత‌మైన హుక్ స్టెప్పుల‌తో అల‌రించడ‌మే గాక‌, అస‌భ్య‌త‌కు తావులేని చ‌క్క‌ని రొమాన్స్ తోను ఆక‌ట్టుకున్నారు.

అయితే ఇదంతా ఇప్పుడే ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వ‌స్తోంది! అంటే....పుష్పలో పుష్ప‌రాజ్- శ్రీ‌వ‌ల్లి న‌డుమ ఉన్న అన్యోన్య‌త అనుబంధం మ‌ళ్లీ ఇదిగో ఇక్క‌డ వేదిక‌పై క‌నిపిస్తున్న జంట న‌డుమ‌ క‌నిపించింది. ఈ పాపుల‌ర్ ల‌వ్ క‌పుల్ ఎవ‌రో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌ని లేదు. భార‌త‌దేశంలో నంబ‌ర్ వ‌న్ ద‌ర్శ‌కుడిగా చ‌రిత్ర సృష్టించిన ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, అత‌డి స‌తీమ‌ణి ర‌మ.. ఈ ఇద్ద‌రూ వేదిక‌పై ఇలా డ్యాన్సులు చేస్తుంటే నిజంగానే అభిమానులు ఉద్వేగానికి లోన‌వుతున్నారు. సై సై సోకుల‌కు అంటూ చంటిగాడు పాట‌కు మాస్ స్టెప్పుల‌తో ఆక‌ట్టుకున్నారు రాజ‌మౌళి. ఇది చూశాక‌.. జ‌క్క‌న్న‌లో ఇంత మంచి డ్యాన్స‌ర్ ఉన్నాడా? అని కొంద‌రు ఆశ్చర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ముందే రిహార్స‌ల్ చేసిన త‌ర్వాత ఇలా ర‌మాతో క‌లిసి వేదిక‌పై స్టెప్పులు అద‌ర‌గొట్టార‌ని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా ఇది కేవ‌లం టీవీ షో మాత్ర‌మే అయినా కానీ, జ‌క్క‌న్న ఆయ‌న స‌తీమ‌ని మ‌ధ్య స్టెప్పుల సింక్ ని చూసి అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ముఖ్యంగా రాజ‌మౌళి ఇందులో పుష్ప‌రాజ్ రేంజులో లెగ్ మూవ్ మెంట్ కూడా చేసి చూపించారు. ఆయ‌న అభిమానుల‌కు ఇది గొప్ప విజువ‌ల్ ట్రీట్ అన‌డంలో సందేహం లేదు. తదుప‌రి మ‌హేష్ తో సినిమాని రెండేళ్ల త‌ర్వాతే విడుద‌ల చేస్తాడు కాబ‌ట్టి అప్ప‌టివ‌ర‌కూ అభిమానుల‌కు ఇది మాత్ర‌మే ట్రీట్.