Begin typing your search above and press return to search.

కొడుకు మాటలకు రాజమౌళి సెటైర్

రాజమౌళి కుమారుడు కార్తికేయ మొదట తండ్రి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. ఇక ఆ తర్వాత లైన్ ప్రొడ్యూసర్ గా కూడా కొన్ని సినిమాలకు వర్క్ చేశాడు

By:  Tupaki Desk   |   12 March 2024 6:20 PM GMT
కొడుకు మాటలకు రాజమౌళి సెటైర్
X

రాజమౌళి కుమారుడు కార్తికేయ మొదట తండ్రి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. ఇక ఆ తర్వాత లైన్ ప్రొడ్యూసర్ గా కూడా కొన్ని సినిమాలకు వర్క్ చేశాడు. ప్రస్తుతం రాజమౌళి సినిమాలకు కూడా అతను లైన్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతూ ఉన్నాడు. కార్తికేయ ఫోకస్ ఎక్కువగా ప్రొడక్షన్ పైనే ఫోకస్ ఉంది. భవిష్యత్తులో సినిమాలు కూడా నిర్మించాలి అనే ఆలోచనలో ఉన్నాడు.

ఇక ఈ క్రమంలో మొదటిసారి కార్తికేయ ఒక మలయాళం సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశాడు. ఇటీవల మలయాళం లో మంచి సక్సెస్ అందుకున్న ప్రేమలు సినిమాను తెలుగులో విడుదల చేశారు. ఇక సినిమా డీసెంట్ కలెక్షన్స్ తో మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ ను కూడా ఇటీవల నిర్వహించారు.

ఇక ఆ ఈవెంట్ కు ప్రేమలు చిత్ర యూనిట్ తో పాటు టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి జాతి రత్నాలు డైరెక్టర్ కూడా ప్రత్యేక అతిధులుగా హాజరయ్యారు. ఇక రాజమౌళి, కీరవాణి కూడా సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. అయితే కార్తికేయ మాట్లాడుతున్నప్పుడు సడన్ గా కొడుకు మాటలపై రాజమౌళి సెటైర్ వేశారు.

కార్తికేయ ఏమన్నారంటే.. సినిమాను మలయాళంలో చూసిన తరువాత తెలుగులో రిలీజ్ చేయడానికి ఎక్కువ రోజులు టైమ్ తీసుకోలేదని వారం రోజుల్లోనే డైలాగ్ రైటింగ్ డబ్బింగ్ వర్క్ సాంగ్స్ ఇలా అన్ని కూడా ఫినిష్ చేయడం జరిగిందని అందుకు మా టీమ్ లో ప్రతీ ఒక్కరు కూడా చాలా హార్డ్ వర్క్ చేసినట్లు చెప్పుకొచ్చారు. అయితే వెనకాల నుంచి వచ్చిన జక్కన్న మైక్ పట్టుకొని సెటైర్ వేశారు.

రేయ్ నన్ను వెనకాలే పెట్టుకొని ఫాస్ట్ గా చేశాం, వారం రోజుల్లో చేశాం.. పంపించాము అని చెప్పకురా అంటూ స్టేజ్ పైనే చెప్పేశారు. రాజమౌళి సినిమాల వర్క్ విషయంలో ఎంత టైమ్ తీసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏళ్ళ తరబడి వర్క్ జరుగుతూ ఉంటుంది. ఇక కొడుకు వారం రోజుల్లో స్పీడ్ గా వర్క్ చేశానని చెబుతుంటే తట్టుకోలేకపోయిన జక్కన్న సరదాగా సెటైర్ వేశారు. ఇక ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఇక రాజమౌళి ప్రేమలు సినిమాపై కూడా ప్రశంసలు కురిపించారు. అందులో నటించిన మమితా బైజు నెక్స్ట్ స్టార్ హీరోయిన్ గా మారుతుందని అన్నారు. తనకు సాధారణంగా యాక్షన్ రొమ్ కామ్ ప్రేమ కథలు నచ్చవని కానీ ప్రేమలు చూశాక బాగా నచ్చింది అని ఇది థియేటర్స్ లో చూడాల్సిన సినిమా అని అన్నారు.