మిస్టర్ అండ్ మిసెస్ రాజమౌళి లవ్ స్టోరీ
తాజాగా రమా ఒక ఇంటర్వ్యూలో రాజమౌళితో తన ప్రేమ మరియు పెళ్లి విషయాలను గురించి వెళ్లడించారు. రమా కి రాజమౌళితో పెళ్లి కంటే ముందే మరో వ్యక్తితో పెళ్లి అయ్యింది
By: Tupaki Desk | 27 April 2024 6:34 AM GMTఈగ, బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని పాన్ వరల్డ్ కి తీసుకు వెళ్లిన ఘనత రాజమౌళిది అనడంలో ఇసుమంత అయినా సందేహం లేదు. ఇండియన్ సినిమాకు కొత్త దారి చూపించిన ఘనుడు రాజమౌళి. ఆస్కార్ ను తెలుగు సినిమాకు తెచ్చి పెట్టిన రాజమౌళి ప్రేమ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాజమౌళి భార్య పేరు రమా అనే విషయం తెల్సిందే. అలాగే రాజమౌళి ప్రతి సినిమాకు కూడా రమా అత్యంత కీలకంగా వ్యవహరిస్తారు. కాస్ట్యూమ్స్ డిజైనింగ్ మొదలుకుని ప్రొడక్షన్ వర్క్ వరకు అనేక విషయాల్లో రమా సినిమా మేకింగ్ లో రాజమౌళికి బాసటగా ఉంటారు.
తాజాగా రమా ఒక ఇంటర్వ్యూలో రాజమౌళితో తన ప్రేమ మరియు పెళ్లి విషయాలను గురించి వెళ్లడించారు. రమా కి రాజమౌళితో పెళ్లి కంటే ముందే మరో వ్యక్తితో పెళ్లి అయ్యింది. కొన్ని కారణాల వల్ల ఆ వ్యక్తి నుంచి రమా విడి పోయారు. అప్పటికే రమా కి కార్తికేయ జన్మించాడు.
రమా చెల్లి అయిన వల్లి ని కీరవాణి పెళ్లి చేసుకున్నారు. కీరవాణి తమ్ముడు అయిన రాజమౌళికి రమాకి అప్పుడే పరిచయం అయ్యింది. ఇద్దరి మధ్య చాలా కాలం సాదారణ పరిచయాలు మరియు మాటలు మాత్రమే ఉండేవి. కానీ స్టూడెంట్ నెం.1 సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది.
రాజమౌళి కేవలం రమా ను మాత్రమే పెళ్లి చేసుకోకుండా ఆమె తనయుడు కార్తికేయను కూడా తన కొడుకుగా స్వీకరించాడు. అంతే కాకుండా రాజమౌళి మరియు రమా లు కార్తికేయ తో పాటు మరో బిడ్డ కావాలని భావించి ఒక అమ్మాయిని దదత్త తీసుకున్నారు.
ఇలాంటి దాంపత్యం ను మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. రమాకి రెండో పెళ్లి అయినా, అప్పటికే ఆమెకు కొడుకు ఉన్నా కూడా రాజమౌళి స్వీకరించిన తీరు నిజమైన ప్రేమకి సాక్ష్యం అనడంలో సందేహం లేదు. రాజమౌళి ఇంతటి విజయాలను సాధిస్తున్నారు అంటే కచ్చితంగా రమా మేడం వెనుక ఉండటమే.
ప్రతి వ్యక్తి జీవిత భాగస్వామి అర్థం చేసుకునే వారు, ప్రతి విషయంలో తోడు ఉండే వారు అయితే జీవితంలో ఎన్నో విజయాలు సొంతం చేసుకోవచ్చు అనేందుకు రాజమౌళి దంపతులు ఆదర్శంగా నిలుస్తారు. ఎంతో మందికి రమా రాజమౌళి దంపతులు ఆదర్శం.