Begin typing your search above and press return to search.

రాజా సాబ్.. ఫుల్ కమర్షియల్ నెంబర్స్!

అయితే రాజా సాబ్ మూవీకి మంచి కమర్షియల్ ఆల్బమ్ చేయబోతున్నట్లుగా తాజాగా ఓ ఈవెంట్ లో తమన్ క్లారిటీ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   24 July 2024 5:28 AM GMT
రాజా సాబ్.. ఫుల్ కమర్షియల్ నెంబర్స్!
X

డార్లింగ్ ప్రభాస్ తాజాగా కల్కి 2898ఏడీ సినిమాతో కెరీర్ లో సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మూవీ 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. లాంగ్ రన్ లో కల్కి మూవీ కలెక్షన్స్ ఏ స్థాయిలో క్లోజ్ అవుతాయి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. వరల్డ్ వైడ్ గా ఇప్పటికి కూడా డీసెంట్ కలెక్షన్స్ తో కల్కి మూవీ థియేటర్స్ లో కొనసాగుతోంది. ఇది ఇలా ఉంటే నెక్స్ట్ డార్లింగ్ ప్రభాస్ నుంచి రాబోయే సినిమా ఏంటి అంటే రాజాసాబ్ అని చెప్పాలి.

మారుతి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఈ సినిమా రెడీ అవుతోంది. ఇప్పటికే 50% సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. మాగ్జిమమ్ మూవీ షూటింగ్ మొత్తం సెట్స్ లలోనే చేయబోతున్నారంట. ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆయన నుంచి గత కొంతకాలంగా సరైన బ్లాక్ బస్టర్ సాంగ్స్ రావడంలేదనే మాట ప్రేక్షకుల నుంచి వినిపిస్తోంది.

అయితే రాజా సాబ్ మూవీకి మంచి కమర్షియల్ ఆల్బమ్ చేయబోతున్నట్లుగా తాజాగా ఓ ఈవెంట్ లో తమన్ క్లారిటీ ఇచ్చారు. డార్లింగ్ ప్రభాస్ చాలా రోజుల తర్వాత కమర్షియల్ సాంగ్స్ ఈ సినిమాలో చేస్తున్నాడని తెలియజేశారు. మంచి డాన్స్ నెంబర్స్ రాజా సాబ్ మూవీలో ఉంటాయని తమన్ చెప్పుకొచ్చారు. డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఆయన నుంచి కమర్షియల్ సాంగ్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

బాహుబలి తర్వాత కల్కి వరకు ప్రభాస్ చేసిన సినిమాలలో ఎక్కడా కూడా కమర్షియల్ సాంగ్స్ కనిపించలేదు. కల్కి మూవీలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఒక సాంగ్ లో ప్రభాస్ తో డాన్స్ చేయించాడు. ఈ సాంగ్ ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అయింది. ఈ నేపథ్యంలో మారుతి దర్శకత్వంలో రాబోయే రాజా సాబ్ సినిమాలో సాంగ్స్ కూడా ఖచ్చితంగా ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.

రాజా సాబ్ సినిమాని 2025 సంక్రాంతికి లేదంటే సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. త్వరలో ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేయాలని ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారం. మారుతి కెరియర్ లో ఫస్ట్ టైం ఒక స్టార్ హీరోని, భారీ బడ్జెట్ సినిమాని డీల్ చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు ఆయన్ని పాన్ ఇండియా డైరెక్టర్ గా నిలబెడుతుంది అనేది వేచి చూడాలి.