నాగచైతన్య-శోభిత పెళ్లిలో వీళ్లంతా అతిధులే!
దాదాపు 300-400మంది హాజరవుతారని ప్రచారంలో ఉంది. తాజాగా ఈ వివాహా వేడుకకు ఎవరెవరు? హాజరుకానున్నారనే విషయమై వార్తలు వచ్చాయి.
By: Tupaki Desk | 3 Dec 2024 4:55 PM GMTనాగ చైతన్య-శోభిత వివాహానికి సంబంధించిన హడావుడి ఇప్పటికే మొదలైంది. అన్నపూర్ణ స్టూడియో ఎంతో అందంగా ముస్తాబవుతుంది. ఇప్పటికే హల్దీ వేడుక, మంగళ స్నానాలతో సంప్రదాయ బద్దంగా మొదలైన పెళ్లి సంబరాలు ఘనంగా సాగుతున్నాయి. అలాగే శోభిత పెళ్లి కూతురు అలంకరణ లో ఆకట్టుకుంటున్నారు. ఆ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ వివాహ వేడుక అతి కొద్ది మంది సమక్షంలోనే జరుగుతుందని ఇప్పటికే వార్తలొస్తున్నాయి. దాదాపు 300-400మంది హాజరవుతారని ప్రచారంలో ఉంది. తాజాగా ఈ వివాహా వేడుకకు ఎవరెవరు? హాజరుకానున్నారనే విషయమై వార్తలు వచ్చాయి. సినీ, రాజకీయ రంగానికి సంబంధించిన పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా రానున్నట్లు తెలుస్తోంది.
ఇంకా రెబల్ స్టార్ ప్రభాస్, దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి సహా సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నట్లు తెలిసింది. ఇక నాగార్జునతో మెగాస్టార్ చిరంజీవి బాండింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు మంచి స్నేహితులు. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ అంతా తప్పక వివాహానికి హాజరయ్యే అవకాశం ఉంది.
ఇంకా పరిశ్రమ నుంచి దాదాపు చాలా మంది హాజరయ్యే అవకాశం ఉందని అక్కినేని కాంపౌండ్ వర్గాల సమాచారం. రాజకీయం, పారిశ్రామిక రంగాలకు చెందిన కీలకమైన వ్యక్తలు ఈవేడుకలో భాగమవుతారని సమాచారం. ఈ వివాహం పూర్తి హిందూ సంప్రదాయ పద్ధతిలోనే జరుగుతుంది. దాదాపు ఏడెనిమిది గంటల పాటు ఈ పెళ్లి వేడుక తంతు ఉంటుందని సమాచారం.