కష్టాలు పడ్డొడు అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వడా?
అయితే నేడు స్టార్ డైరెక్టర్ గా నీరాజనాలు అందుకుంటోన్న ఓ వ్యక్తి మాత్రం అలాంటి వాళ్లకు ఛాన్స్ ఇచ్చే టైపు కాదని ఓ నటుడి మాటల్లో బయట పడింది.
By: Tupaki Desk | 23 Dec 2024 9:30 PM GMTసినిమా ఇండస్ట్రీ కష్టాలు..కన్నీరు గురించి చెప్పాల్సిన పనిలేదు. స్టార్ డైరెక్టర్లుగా, నటులుగా ఎదిగిన వారి వెనుక ఎన్నో కష్ట..నష్టాలున్నాయి. దాదాపు 80 శాతం మంది అలా కష్టపడి ఎదిగిన వారే. అలా కష్టపడి ఎదిగితే? తన చుట్టూ ఉన్న వాళ్లకు , స్నేహితులకు అవకాశం ఇవ్వడానికి అక్కడో ఛాన్స్ ఉంటుంది. కృష్ణ వంశీ డైరెక్టర్ కాక ముందు ఎన్నో కష్టాలు పడ్డాడు. తాను డైరెక్టర్ అయిన తర్వాత ఓ పూట భోజనం పెట్టించాడు అన్న కృతజ్ఞతతో వంశీ ....బ్రహ్మాజీకి పిలిచి మరీ తన సినిమాలో అవకాశం ఇచ్చాడు. అదే సిందూరం.
ఇప్పటికీ ఆ విషయాన్ని బ్రహ్మాజీ ఎంతో గొప్ప గా చెప్పుకుంటాడు. ఒక్క పూట భోజనానికే అంత గొప్ప అవకాశం ఇచ్చాడని ఎంతో సంతోష పడతారు. పూరి జగన్నాధ్-రవితేజ కాంబినేషన్ కూడా అలాంటింది. ఇండస్ట్రీకి వచ్చి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తోన్న సమయంలో స్నేహితులయ్యారు. ప్రతిగా పూరి ...రవితేజతో సినిమాలు కూడా చేసారు. ఇలా తీస్తే ఇంస్ట్రీలో ఎన్నో కథలు బయటకు వస్తాయి. అయితే నేడు స్టార్ డైరెక్టర్ గా నీరాజనాలు అందుకుంటోన్న ఓ వ్యక్తి మాత్రం అలాంటి వాళ్లకు ఛాన్స్ ఇచ్చే టైపు కాదని ఓ నటుడి మాటల్లో బయట పడింది.
ఇండస్ట్రీలో ఓస్టార్ డైరెక్టర్-కమెడియన్ కలిసే ఎదిగారు. వాళ్లతో పాటు మరో నటుడు కూడా అదే సమయంలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు. వాళ్లిద్దరి తో అప్పటి నుంచే పరిచయం ఉంది. వాళ్లకు సమస్య వస్తే తాను కూడా తోడుగా నిలబడ్డాడు. ఫోన్లు చేసి మరీ అవసరాలు తీర్చుకున్నారు. కానీ సినిమా ఛాన్స్ ఇవ్వండి ? అని అడిగితే మాత్రం అరిచి గీ పెట్టే వరకూ తన వెంట తిప్పించుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
పేరు పెట్టి పిలిచేంత చనువు ఉంది. ఇద్దరు ఇండస్ట్రీలో తిరుగుతున్నారు. అతడు స్టార్ డైరెక్టర్ కూడా అయి పోయాడు. కానీ ఛాన్స్ అడిగితే రైట్ టైమ్ కోసం వెయిట్ చేయి అని కాలం వెళ్లదీసాడు. అలా కాళ్లు అరిగిలే అతడి చుట్టే కొన్ని సంవత్సరాలు పాటు తిరిగితే ఈ మధ్యనే ఓ రెండు సినిమాల్లో అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంత కాలం ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు అంటే? ఆ డైరెక్టర్ పై అతడేమి అభాండాలు వేయలేదు. తన సమస్యలు తనకుంటాయని, కష్టం విలువ ప్రయత్నించే వాడికి కూడా తెలియాలనే అలా చేసి ఉండొచ్చేమోననని సముదాయించారు.