స్టార్ హీరోలు 2024 ఎలా ముగిస్తున్నారంటే?
2024 ముగింపుకు ఇంకా 50 రోజులే సమయం ఉంది. కోటి ఆశలతో కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పడానికి ప్రేక్షకులంతా సిద్దమవుతున్నారు.
By: Tupaki Desk | 13 Nov 2024 9:30 PM GMT2024 ముగింపుకు ఇంకా 50 రోజులే సమయం ఉంది. కోటి ఆశలతో కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పడానికి ప్రేక్షకులంతా సిద్దమవుతున్నారు. మరి కోలీవుడ్ ఈ ఏడాదిని ఎలా ముగించబోతుంది అంటే? 2024 ప్రధమార్ధం అంటే జూన్ వరకు కేవలం 3-4 హిట్ సినిమాలు మాత్రమే అక్కడ కనిపిస్తున్నాయి. వాటిలో `మంజుమ్మల్ బోయ్స్`, `విజయ్ `గిల్లీ` రీ-రిలీజ్ చిత్రం ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయ్యాయి.
మిగతా సినిమాలేవి ఆశించిన ఫలితాలు అందించలేదు. ద్వితియార్ధంలో మాత్రం విభిన్న తరహా సినిమాలు విడుదలై బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచాయి. ట్రేడ్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ద్వితియార్ధంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన `మహారాజ` విజయంతో మోక్షం కలిగింది. ఇది స్ట్రెయిట్ తమిళ సినిమా. జూన్ 14న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది.
ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అటుపై `గరుడన్`, మరి సెల్వరాజ్ `వాజై`, `అరుళ్నిధి` యొక్క `డిమొంటే కాలనీ-2`, `లబ్బర్ పండు`, `మెయ్యళగన్` , `బ్లాక్` వంటి బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ అయి మంచి ఫలితాలు సాధించాయి. ఈ సినిమాలకు థియేటర్ ఆక్యుపెన్సీ బాగుంది. అటుపై ధనుష్ నటించిన `రాయన్`, విజయ్ `ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్`, రజనీకాంత్ ` వేట్టైయన్` వంటి సినిమాలు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా నిరుత్సాహ పరిచాయి.
ఈ మూడు సినిమాలకు ప్రేక్షకుల నుండి డివైడ్ టాక్ వచ్చింది. అయితే ఇటీవల రిలీజ్ అయిన శివ కార్తికేయన్ `అమరన్` మాత్రం బాక్సాఫీస్ ని మళ్లీ మోత మోగించింది. 250 కోట్లకు పైగా వసూళ్లను సాధించి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇది కోలీవుడ్ కి దీపావళి హిట్. మరికొన్ని గంటల్లో సూర్య నటించిన `కంగువ` భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుంది. సూర్య తొలి పాన్ ఇండియా రిలీజ్ ఇది. ఈ సినిమా సక్సెస్ తో 2024 హ్యాపి ఎండింగ్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.