Begin typing your search above and press return to search.

లైంగిక వేధింపుల‌పై స్టార్ హీరోల మౌనం దేనికి సంకేతం?

ఇన్నాళ్లు పంటికింద దాచేసిన బాధ‌నంత‌ట‌ని బ‌ట్ట‌బ‌య‌లు చేస్తున్నారు. దీంతో చాలా మంది న‌టీమ‌ణుల నుంచి బాధిత మ‌హిళ‌ల‌కు మ‌ద్ద‌తు ల‌భిస్తోంది.

By:  Tupaki Desk   |   22 Sep 2024 7:28 AM GMT
లైంగిక  వేధింపుల‌పై  స్టార్ హీరోల  మౌనం దేనికి సంకేతం?
X

మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో వెలుగులోకి వ‌చ్చిన జ‌స్టిస్ హేమ క‌మిటీ నివేదిక దేశ వ్యాప్తంగా ఎంత సంచ‌లనమైందో తెలిసిందే. బాలీవుడ్ లో మీటూ ఉద్య‌మం-త‌ను శ్రీ ద‌త్తా ఉదంతం, టాలీవుడ్ లో శ్రీరెడ్డి ఘ‌ట‌న త‌ర్వాత అత్యంత సంచ‌ల‌న‌మైన వివాదాస్ప‌ద అంశ‌మిది. దేశ వ్యాప్తంగా హేమ క‌మిటీ నివేదిక‌పై చ‌ర్చ జ‌రుగుతోంది. 290 పేజీల నివేదిక పై వాడి వేడి చ‌ర్చ సాగుతోంది.మ‌రోవైపు బాధిత మ‌హిళ‌లంతా మీడియా ముందుకొచ్చి త‌మ‌కు జ‌రిగిన అన్యాయంపై గొంతెత్తి మాట్లాడుతున్నారు. ఇన్నాళ్లు పంటికింద దాచేసిన బాధ‌నంత‌ట‌ని బ‌ట్ట‌బ‌య‌లు చేస్తున్నారు. దీంతో చాలా మంది న‌టీమ‌ణుల నుంచి బాధిత మ‌హిళ‌ల‌కు మ‌ద్ద‌తు ల‌భిస్తోంది.

సీనియ‌ర్ న‌టీమ‌ణుల నుంచి న‌వ‌తరం నటీమ‌ణులంతా అండ‌గా నిలుస్తున్నారు. కోలీవుడ్, టాలీవుడ్, శాండిల్ వుడ్, మాలీవుడ్ ఇలా అన్నిప‌రిశ్ర‌మ‌ల న‌టీమ‌ణులు ఎవ‌రి అభిప్రాయాలు వారు పంచుకుంటున్నారు.కానీ స్టార్ హీరోల నుంచి మాత్రం ఎలాంటి మ‌ద్ద‌తు ల‌భించ‌డ లేదు .అంతా మౌనంగా ఉన్నారు. మాలీవుడ్ నుంచి మోహ‌న్ లాల్, మ‌మ్ముట్టి లాంటి మ‌ద్ద‌తుగా క‌నిపించిన‌ట్లే క‌నిపించారు. కానీ ఇండ‌స్ట్రీ ప‌రువు తీయోద్దు అన్న‌ట్లే వాళ్ల వ్యాఖ్య‌లు క‌నిపించాయి. ఇక సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ని ఈ విష‌యం గురించి మీడియా అడిగితే 'నాకేం తెలియ‌దు' అని త‌ప్పించుకున్నారు.

ఇంకా క‌మ‌ల్ హాస‌న్ , విజ‌య్ ద‌ళ‌ప‌తి ఇలా పేరున్న న‌టులెవవ్వ‌రూ కూడా స్పందించ‌లేదు. టాలీవుడ్ నుంచి కూడా ఏ ఒక్క స్టార్ కూడా స్పందించ‌లేదు. బాలీవుడ్ నుంచి అమితాబచ్చ‌న్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, స‌ల్మాన్ ఖాన్ ఇలా ఎంతో మంది స్టార్లు ఉన్నారు. వాళ్లు కూడా ఎవ్వ‌రూ ఈ ఘ‌ట‌న‌పై నోరు మొదప‌లేదు. ఓ సారి హేమ‌క‌మిటీ నివేదిక‌లో ఉన్న అంశంలోకి వెళ్తే... 'కావాలనుకున్నప్పుడల్లా సె...క్స్ అందుబాటులో ఉండాలి. పని కావాలనుకుంటే, 'రాజీ పడాలి, సర్దుబాటు చేసుకోవాలి' అని కొందరు వ్యక్తులు మహిళా ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో అన్నట్లు నివేదిక వెల్లడించింది. దీనిపై రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఈ ఘ‌ట‌న‌పై ర‌చ‌యిత్రీ శుభా గుప్తా స్పందించారు.

'భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఈ తెగులు చాలా లోతుగా పాకిపోయింది' అని విమ‌ర్శించారు. 'దేశంలో వేధింపులు ఎదుర్కోని ఒక్క నటీ కనిపించదు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఫిర్యాదు చేస్తే, వాటిని పరిష్కరించేందుకు దశాబ్దాలు పడుతుంది' అన్నారు ఆమె. అలాగే బెంగాలీ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసినట్లు నటి రితాభరి చక్రవర్తి తెలిపారు. 'ఇది లైంగిక వేధింపులకు పాల్పడే మృగాల నుంచి పరిశ్రమను ప్రక్షాళన చేస్తుంది' అని ఆమె వ్యాఖ్యానించారు. అలాగే తమిళ, కన్నడ సినిమాల్లోని మహిళలూ తమ పని పరిస్థితులను మెరుగుపరచాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. అలాగే పరిశ్రమలోని పురుషుల నుంచి మద్దతు లేకపోవడం తమకు నిరాశ కలిగించిందని' దామోదరన్ అభిప్రాయ‌ప‌డ్డారు.

'అభిమానులు ఈ హీరోలను ప్రాణాలకన్నా మిన్నగా పూజిస్తారు. వాళ్లు తమ సినిమాలలోలాగే ధైర్యాన్ని ప్రదర్శిస్తారని మేము ఎదురు చూస్తున్నాం' అన్నారు. ర‌జ‌నీకాంత్ త‌న‌కు తెలియ‌ద‌న‌డం ఆశ్చ‌ర్యం వేసింద‌న్నారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై న‌టి రాధిక కౌంట‌ర్ కూడా వేసారు. 'మనలో ప్రతి ఒక్కరికీ వేధింపులు ఎదురవుతాయి. పురుషులకు దాని గురించి ఎలా తెలీకుండా ఉంటుంది? బహుశా వాళ్లు వాటిని పట్టించుకో కపోవచ్చు. వాళ్లు దానిని చూడకూడదని నిర్ణయించుకొని ఉండొచ్చు . ప్రతిసారీ తమను తాము రక్షించుకో వాల్సిన బాధ్యత మహిళలపైనే పడటం చాలా విచారకరం' అన్నారు. అలాగే బాలీవుడ్ స్టార్లు స్పందించ‌క‌పోవ‌డం అన్న‌ది ఊహించని విషయమేమీ కాదని గుప్తా అన్నారు. త‌ను శ్రీ ద‌త్తా ఉదంతా న్నిగుర్తు చేసారు. అప్పుడు ఎంత మంది బాలీవుడ్ హీరోలు ఆమెకి అండ‌గా ఉన్నారో గుర్తు చేసి విమ‌ర్శించారు.