కొడుకులు కొడితే...తండ్రులు కాలర్ ఎగరేసేలా!
టాలీవుడ్ లో కొంత మంది వారసులు కెరీర్ పరంగా చాలా వెనుకబడి ఉన్నారు. సరైన హిట్ అనే మాట వాళ్ల చెవిన పడి చాలా కాలమవుతోంది.
By: Tupaki Desk | 27 Feb 2025 2:30 PM GMTటాలీవుడ్ లో కొంత మంది వారసులు కెరీర్ పరంగా చాలా వెనుకబడి ఉన్నారు. సరైన హిట్ అనే మాట వాళ్ల చెవిన పడి చాలా కాలమవుతోంది. ఇటీవలే యువ సామ్రాట్ నాగ చైతన్య `తండేల్` తో భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. అదే సినిమాతో చైతన్య 100 కోట్ల క్లబ్ లో కి అడుగు పెట్టాడు. ఈ సినిమా విజయం విషయంలో ఓ తండ్రిగా నాగార్జున ఎంత సంతోషంగా ఉన్నారు? అన్నది ఆయన మాటల్లోనే అర్దమైంది.
సక్సెస్ మీట్ కి వచ్చి చాలా కాలమైంది? అంటూ ఎంతో ఉద్విగ్నంగా మాట్లాడారు. చైతన్య సక్సెస్ చూసి ఓ తండ్రిగా నాగార్జున ఎంతో సంతోషపడుతున్నారు. అయితే ఇలా ఎమోషన్ అవ్వాలని ఇండస్ట్రీలో చాలా మంది తండ్రులు ఆరాట పడుతున్నారు. వారసులు హిట్ కొడితే? కాలరెగరేసి కొట్టామని చెప్పాలని మనసులో ఎంతో కోరిక ఉంది. కానీ ఆ రోజు మాత్రం రావడం లేదు.మరి హిట్ కోరుకుంటున్న ఆ హీరోలెవరో ఓసారి చూస్తే సరి... మంచు విష్ణు కి హిట్ వచ్చి చాలా కాలమవుతుంది.
దీంలో చాలా సమయం తీసుకుని మరీ పాన్ ఇండియాలో `కన్నప్ప` చిత్రంలో నటించాడు. ఈ సినిమా స్వయంగా తండ్రి మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మించారు. మంచు ఫ్యామిలీ భారీ ఖర్చు చేసిన మొట్ట మొదటి చిత్రమిదే. ఈ సినిమాపై తండ్రీ కొడుకులిద్దరు చాలా ధీమాగా ఉన్నారు. పాన్ ఇండియాలో హిట్ కొట్టి తామేంటే చూపిస్తాం అన్న కాన్పిడెన్స్ కనిపిస్తుంది. కోడుకు సక్సెస్ కోసం ఓ తండ్రిగా మోహన్ బాబు ఎంతో ఆరాట పడుతున్నారు.
అటు చిన్నకుమారుడు మనోజ్ కూడా కొన్ని సినిమాలు చేస్తున్నారు. రకరకాల కారణాలతో ఇంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మనోజ్ అప్ కమింట్ రిలీజ్ లతో భారీ విజయం సాధించాలని ఆశపడుతు న్నారు. అలాగే అక్కినేని అఖిల్ కి ఇంత వరకూ సరైన బ్లాక్ బస్టర్ ఒక్కటీ లేదు. చేసిన ప్రయత్నాలేవి ఫలించడం లేదు. ఈ నేపథ్యంలో వచ్చే సినిమాతోనైనా సరైన హిట్ కొట్టాలని అక్కినేని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. తనయుడి సక్సస్ కోసం నాగార్జున కూడా అంతే ఎగ్జైట్ గా ఎదురు చూస్తున్నారు.
అలాగే అల్లు శిరీష్ హీరోగా లాంచ్ చాలా కాలమవుతుంది. కొంత కాలంగా అతడు సినిమాలకు దూరంగా ఉన్నాడు. శిరీష్ కూడా మంచి స్టార్ అవ్వాలని బన్నీ ఎంతో ఆశపడుతున్నాడు. అటు తండ్రిగా అల్లు అరవింద్ అంతకన్నా ఎక్కువగా ఆశపడుతున్నారు. ఆ రోజు ఎప్పుడు వస్తుందా? అని ఇద్దరు ఎంతో ఎదురు చూస్తున్నారు. అలాగే నిర్మాత బెల్లంకొండ వారసులు సాయి శ్రీనివాస్, గణేష్ ల సక్సెస్ కోసం ఓ తండ్రిగా సురేష్ కూడా అంతే ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇంకా ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ కాని వారంతా తమకు ఓరోజు ఉంటుందని ఎంతో ఆశతో వెయిట్ చేస్తున్నారు.