వ్యవసాయం చేసుకుంటోన్న స్టార్ డైరెక్టర్
తమిళనాడు నీలగిరి కొండల ప్రాంతంలో ఈ ప్రదేశం ఉంది. సముద్ర మట్టానికి ఆరువేల ఎత్తు అడుగుల్లో..ఊటీకి 2 కిమీల దూరంలో ఉంది.
By: Tupaki Desk | 16 Oct 2023 2:09 PM GMTసెలబ్రిటీలకు సినిమా అనేది వృత్తి అయితే వ్యాపారం ప్రవృత్తి. సినిమాల్లో కొనసాగుతున్న సమయంలోనే వ్యాపారల్లోనూ దిగ్విజయంగా ముందుకు సాగుతున్నారు. నిజానికి వ్యాపార పరంగా చదివిన చదువుకి ..వ్యాపారానికి ఎలాంటి సంబంధం ఉండదు. సినిమా రంగంలో ఎక్కువగా డాక్టర్లు..ఇంజనీర్లు..ఐఐటీ నుంచి వచ్చిన వాళ్లు ఎక్కువగా కనిపిస్తుంటారు. బాలీవుడ్ లో నితేష్ తివారీ..జితేంద్ర..అమోల్ ప్రశార్ అంతా ఐఐటీ నుంచి వచ్చిన వారే.
అలాగే మన్సూర్ ఖాన్ కూడా ఐఐటీ నుంచే దిగారు. బాంబే ఐఐటీ నుంచి వచ్చిన మన్సూర్ ఖాన్ 1988 'ఖయామత్ సే ఖయామత్' అనే సినిమాతో పరిచయం అయ్యారు. తొలి సినిమాతోనే జాతీయ అవార్డు అందుకున్నారు. సక్సెస్ తర్వాత అయిన వెంటనే సినిమాలు చేయలేదు. నాలుగేళ్లకో సినిమా చేసుకుంటూ వచ్చారు. 'జోజితో వోహి సికిందర్' తెరకెక్కించారు. ఇది ఆస్కార్ విన్నింగ్ మూవీ 'బ్రేకింగ్ అవే' చిత్రానికి రీమేక్.
ఆ తర్వాత ఆగ్యాప్ పెంచుకుంటూ సినిమాలు చేసారు. చివరిగా 2000 లో 'జోష్' సినిమా చేసారు. ఆ తర్వాత మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ హీరోగా 'జానే తు జానే నా' సినిమా నిర్మించారు. ఆ తర్వాత సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. మరి ఇప్పుడు మన్సూర్ ఖాన్ ఏం చేస్తున్నారంటే? 22 ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తున్నట్లు తెలిసింది. తమిళనాడు నీలగిరి కొండల ప్రాంతంలో ఈ ప్రదేశం ఉంది. సముద్ర మట్టానికి ఆరువేల ఎత్తు అడుగుల్లో..ఊటీకి 2 కిమీల దూరంలో ఉంది.
ఇప్పుడా పొలంలో పండ్లు...కూరగాయలు పండిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా..వ్యవసాయ జీవితం గురించి మన్సూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 'నేను దర్శకుడిని అవ్వాలనుకోలేదు. సీరియస్ గా నా ప్లానింగ్ లు ఇలాగే ఉండేవి. ఇప్పుడు నేనేం చేస్తున్నానో గతంలోనే ప్లాన్ చేసుకున్నాను. 1979 లో అమెరికా నుంచి ఇండియాకి తిరిగొచ్చాక ముంబైలో ఉండాలనుకోలేదు. సిటీలో ఉండటం నచ్చదు. మిసెస్ సీరియల్ కిల్లర్ ద్వారా నా కూతురు జైన్ పేరు సంపాదించింది. తను ముంబైలో ఉంటుంది. నా కొడుకు పబ్లూ సంగీత దర్శకుడు. అమీర్ ఖాన్ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్నాడు' అని అన్నారు.