Begin typing your search above and press return to search.

నానిని టార్గెట్ చేస్తున్న స్టార్ ఫ్యాన్స్..!

నాని దుల్కర్ పై చేసిన పాన్ ఇండియా యాక్టర్ కామెంట్స్ పై తెలుగు స్టార్ హీరోల ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

By:  Tupaki Desk   |   14 Aug 2023 10:39 AM GMT
నానిని టార్గెట్ చేస్తున్న స్టార్ ఫ్యాన్స్..!
X

దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కోత ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా న్యాచురల్ స్టార్ నాని చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో డిస్కషన్స్ కి దారి తీస్తున్నాయి. ఈవెంట్ లో భాగంగా దుల్కర్ సల్మాన్ అసలైన పాన్ ఇండియా యాక్టర్ అని అతని కోసం వివిధ భాషల్లో దర్శకులు కథలు రాస్తున్నారని అన్నారు నాని. అయితే తన అన్న ఉద్దేశం కరెక్టే కానీ తెలుగులో సినిమా చేస్తూ పాన్ ఇండియా కాదు గ్లోబల్ వైజ్ స్టార్ డం తెచ్చుకున్న స్టార్ హీరోల ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.

నాని దుల్కర్ పై చేసిన పాన్ ఇండియా యాక్టర్ కామెంట్స్ పై తెలుగు స్టార్ హీరోల ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆల్రెడీ బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కాగా పుష్ప తో అల్లు అర్జున్, ఆర్.ఆర్.ఆర్ తో ఎన్.టి.ఆర్, చరణ్ లు ఏకంగా గ్లోబల్ స్టార్స్ గా క్రేజ్ తెచ్చుకున్నారు. అలాంటి ఇండస్ట్రీలో ఒక హీరోగా ఉంటూ ఇక్కడ వారిని తక్కువ చేస్తూ దుల్కర్ ఒక్కడే పాన్ ఇండియా యాక్టర్ అనడం ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతుంది.

అంతకుముందు నాని ఎలాంటి నెగిటివిటీ లేకుండా తన సినిమాలు తాను చేసుకుంటూ వెళ్లేవాడు. ఆమధ్య సినిమాలు సినిమాల్లా చూడండి రాజకీయాలు చేయొద్దు అని నాని చేసిన కామెంట్స్ కూడా అప్పట్లో సెన్సేషనల్ గా మారాయి. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా యాక్టర్ అంటే అది దుల్కర్ సల్మాన్ మాత్రమే అంటూ మాట్లాడటం మరోసారి నానిని బుక్ అయ్యేలా చేశాయి. దీనిపై ఫైర్ అవుతున్న ఇతర స్టార్ ఫ్యాన్స్ నాని ఎలాగు పాన్ ఇండియా స్టార్ కాలేడు కాబట్టే ఇలా అన్నాడని అంటున్నారు.

అంతేకాదు నానికి ఇంత యాటిట్యూడ్ పనికిరాదని అది ఎప్పటికైనా అతని కెరీర్ ని దెబ్బ తీస్తుందని అంటున్నారు. ఏదో ఈవెంట్ కి వెళ్లామ అక్కడ నాలుగు మాటలు మాట్లాడామా అన్నట్టు కాకుండా పాన్ ఇండియా యాక్టర్ అంటే అది దుల్కర్ ఒక్కడే అంటూ నాని ప్రస్తావించడం టాలీవుడ్ స్టార్ హీరోల ఫ్యాన్స్ ని హర్ట్ చేసింది. అయితే దీనిపై నానిని అనడంలో కూడా తప్పులేదు.. దుల్కర్ పై నానికి ఉన్న అభిప్రాయాన్ని చెప్పడంలో నాని తప్పేమి లేదు. కాకపోతే మన దగ్గర ఇంతమంది పాన్ ఇండియా యాక్ట్ర్స్ ఉండగా నాని దుల్కర్ ని మాత్రమే ప్రశంసించడంపై కొంత విమర్శలు ఎదుకొంటున్నాడు.