Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: స్టార్ హీరో ముందు నిర్మాత ఉత్తుత్తేనా?

175 కోట్లు.. 200 కోట్లు.. 275 కోట్లు.. ఈ లెక్క దేనికీ? అంటే ఒక స్టార్ హీరో రెమ్యున‌రేష‌న్ పెరుగుద‌లకు సంబంధించిన లెక్క ఇది.

By:  Tupaki Desk   |   17 Sep 2024 12:30 AM GMT
టాప్ స్టోరి: స్టార్ హీరో ముందు నిర్మాత ఉత్తుత్తేనా?
X

175 కోట్లు.. 200 కోట్లు.. 275 కోట్లు.. ఈ లెక్క దేనికీ? అంటే ఒక స్టార్ హీరో రెమ్యున‌రేష‌న్ పెరుగుద‌లకు సంబంధించిన లెక్క ఇది. నిజంగా ఇది నోరెళ్ల‌బెట్టే, షాకిచ్చే రెవెన్యూ..!

అయితే అంత పెద్ద మొత్తాన్ని పారితోషికంగా చెల్లించుకునే నిర్మాత ప‌రిస్థితి ఏమిటీ? అంటే.. వీళ్ల‌కు కొన్ని లెక్క‌లు ఉన్నాయ‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల 275 కోట్ల పారితోషికం చెల్లించుకుంటున్నామ‌ని చెప్పుకుంటున్న నిర్మాత ఒక మాట అన్నారు. స్టార్ హీరో సినిమాకి శాటిలైట్, ఓటీటీ రైట్స్, రీమేక్ రైట్స్, ఆడియో రైట్స్ అంటూ అన్ని రైట్స్ గురించి నిర్మాత ఎక్కువ ఆలోచిస్తున్నాడు. వీటితో వ‌చ్చే ఆదాయంతో సంతృప్తి ప‌డితే, బ‌య్య‌ర్లు- పంపిణీ వ‌ర్గాల‌కు అమ్మేసినది తిరిగి వారికి వ‌చ్చిందా లేదా? అన్న‌ది త‌ర్వాత ఆలోచిస్తున్నాడు! స్టార్ హీరోకి ఎంత రెమ్యున‌రేష‌న్ ఇస్తారు! అన్న‌ది అన‌వ‌స‌రం అని విశ్లేషించాడు. ఇది నిజంగా షాకింగ్.

నిర్మాత‌లు కేవ‌లం ఫైనాన్షియ‌ర్లు మాత్ర‌మేనా? అనే సందేహం రేకెత్తించింది ఈ స‌మాధానం. హీరో ముఖ విలువ వ‌ల్ల‌నే మార్కెట్ అనే న‌మ్మ‌కం ప‌రిశ్ర‌మ‌లో ఉంది.. అందుకే సాంప్ర‌దాయ నిర్మాత‌లు అంతా ప‌రిశ్ర‌మ నుంచి పారిపోయారు. తెలుగులో పాపులర్ నిర్మాణ సంస్థ‌లు చాలా మూత‌ప‌డ్డాయి. వీబీ రాజేంద్ర‌ప్ర‌సాద్, వ‌డ్డే ర‌మేష్ వంటి నిర్మాత‌లు కాలం చేశాక ఆ బ్యాన‌ర్ల నుంచి వార‌సులే పుట్ట‌లేదు. ఇంకా మిగిలి ఉన్న పాపుల‌ర్ నిర్మాణ సంస్థ‌లన్నీ త‌మ సొంత హీరోల‌తోనే సినిమాలు చేస్తున్నాయి. గీతా ఆర్ట్స్, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీలో సొంత హీరోల‌తో సినిమాలు తెర‌కెక్కుతున్నాయి. వీటిలో ఇత‌ర అగ్ర హీరోల‌కు సినిమాలు ఉండ‌వు.

ఈరోజుల్లో స్టార్ హీరోల‌కు ఒక్కొక్క‌రికి వంద‌ల కోట్ల పారితోషికాలు కావాలి. ఇది టాలీవుడ్ అగ్ర బ్యాన‌ర్ల అధినేత‌ల‌ను కూడా భ‌య‌పెడుతుంది. ఇక ఇలాంటి ప‌రిస్థితి దాపురిస్తుంద‌ని, దీనిని ఖండించిన ఏకైక గురువు ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రి నారాయ‌ణ‌రావు ఇహ‌లోకం వీడారు. ఆయ‌న వెళ్లాక మారిన‌ ప‌రిస్థితిని, అదుపు త‌ప్పిన స‌న్నివేశాన్ని ప్ర‌శ్నించే వారు కూడా లేరు.

ద‌క్షిణాదికి చెందిన ఒక ప్ర‌ముఖ హీరో 275 కోట్ల పారితోషికం అందుకుంటున్నారు.. టాలీవుడ్ కి చెందిన అగ్ర హీరోలు కొంద‌రు 100 కోట్లు అంత‌కుమించిన పారితోషికం అందుకుంటున్నార‌ని టాక్ ఉంది. ఇప్పుడు మ‌న‌వాళ్ల రేంజ్ ఖాన్‌ల‌కు ఏమాత్రం త‌క్కువ కాదు. బ‌చ్చ‌న్‌లు, క‌పూర్ ల‌ను ఎప్పుడో మించిపోయారు. అయితే ఇది బ‌డ్జెట్లు అదుపు త‌ప్ప‌డానికి కార‌ణం కాదా? అని ప‌లువురు క్రిటిక్స్ ప్ర‌శ్నిస్తున్నారు. కాస్ట్ ఫెయిల్యూర్ కి కార‌ణం హీరోలు, స్టార్ డైరెక్ట‌ర్ల అదుపు త‌ప్పిన పారితోషికాలు అంటూ ప్ర‌తిసారీ ఊద‌ర‌గొడుతున్నా ప‌రిస్థితి మారుతోందా? నిజం చెప్పాలంటే స్టార్ హీరోల పారితోషికాల డిబేట్... చెట్టు ముందా? విత్తు ముందా? టైపులో ఎటూ తెగ‌నిదిగా మారింది.