Begin typing your search above and press return to search.

యంగ్ హీరోయిన్ ని డేట్ కి పిలిచిన స్టార్ హీరో..?

అదేంటంటే, ఈ మూవీ చూసిన తర్వాత రెబ్బా ని ఓ స్టార్ హీరో డేట్ కి పిలిచాడట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆమె కూడా అంగీకరించడం విశేషం.

By:  Tupaki Desk   |   22 Aug 2023 6:14 AM GMT
యంగ్ హీరోయిన్ ని డేట్ కి పిలిచిన స్టార్ హీరో..?
X

ఈ మధ్యకాలంలో చిన్న సినిమాగా వచ్చి మంచి హిట్ కొట్టినన సినిమాల్లో సామజవరగమన ఒకటి. శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్ ట్రైనర్ గా అందరినీ ఆకట్టుంది. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది మళయాళ బ్యూటీ రెబా మోనికా. నిజానికి బ్రో సినిమా ఆడిషన్స్ కోసం వచ్చిన ఈ అమ్మాయి, చివరకు ఈ సినిమాలో హీరోయిన్ గా సెలక్ట్ అయ్యింది.

ఈ మూవీ చూసిన తర్వాత రెబ్బా మోనికా కు మంచి ప్రశంసలు దక్కాయి. చాలా చక్కగా నటించింది. అయితే, ఈ బ్యూటీ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే, ఈ మూవీ చూసిన తర్వాత రెబ్బా ని ఓ స్టార్ హీరో డేట్ కి పిలిచాడట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆమె కూడా అంగీకరించడం విశేషం.

ఆ స్టార్ హీరో ఎవరు అనేది చెప్పలేదు కానీ, ఓ స్టార్ హీరో తనను డేట్ కి పిలవడం మాత్రం నిజం అని ఆమె అంగీకరించింది. ఎవరు, ఎవరినైనా డేట్ కి పిలవొచ్చు కదా, అందులో తప్పేమీ లేదు కదా అని ఆమె అభిప్రాయపడింది.అయితే, ఎవరా స్టార్ హీరో అని చాలా మంది తెలుసుకోవాలని ఉత్సాహం చూపిస్తున్నారు.

ఈ సంగతి పక్కన పెడితే, రెబా మోనికా కి డైరెక్ట్ గా తొలి తెలుగు సినిమా ఇదే. కానీ, రీమేక్ చిత్రం ద్వారా ఆమె ఆల్రెడీ అందరినీ ముందుగానే పలకరించింది. విజయ్ బిగిల్ మూవీలో రెబా నటించింది. దాంట్లో ఫుల్ బాల్ ప్లేయర్ గా, అంతేకాకుండా, యాసిడ్ దాడికి గురైన అమ్మాయిగా నటించి మెప్పించింది.

కాగా, రెబా మోనికా పేరుకు మళయాళ బ్యూటీ అయినప్పటికీ, పుట్టి పెరిగింది అంతా బెంగళూరులోనే. మొదటి సినిమా మాత్రం తన మాతృభాషలోనే చేసింది. ఫోరెన్సిక్ అనే మూవీలో నటించగా, ఆ సినిమా మంచి హిట్ అందుకుంది.