Begin typing your search above and press return to search.

హాలీవుడ్ యాక్ష‌న్ స్టార్‌తో మ‌న హీరో పోటీ

భార‌తీయ సినిమా స్థాయి నేడు హాలీవుడ్ రేంజుకు చేరుకుంద‌న‌డానికి ఇది పెద్ద ఉదాహ‌ర‌ణ.

By:  Tupaki Desk   |   19 Jan 2024 12:30 PM GMT
హాలీవుడ్ యాక్ష‌న్ స్టార్‌తో మ‌న హీరో పోటీ
X

భార‌తీయ సినిమా స్థాయి నేడు హాలీవుడ్ రేంజుకు చేరుకుంద‌న‌డానికి ఇది పెద్ద ఉదాహ‌ర‌ణ. అవును.. మ‌న స్థాయి ఇప్పుడు హాలీవుడ్ కి త‌క్కువేమీ కాదు. ఎంపిక చేసుకుంటున్న క‌థాంశాలు.. నేరేష‌న్.. యాక్ష‌న్ బ్లాక్ లు.. సంగీతం.. సినిమాటోగ్ర‌ఫీ.. రీరికార్డింగ్.. ఎడిటింగ్ ఇలా ఏ విభాగంలో చూసుకున్నా హాలీవుడ్ ని కొట్టేంత గొప్ప స్థాయి భార‌తీయ సినిమాలో క‌నిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు-హిందీ-త‌మిళ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లు భారీ చిత్రాల‌తో దేశీ సినీప‌రిశ్ర‌మ‌ను పునీతం చేస్తున్నాయి.

గ‌త ఏడాది కింగ్ ఖాన్ షారూఖ్ న‌టించిన రెండు భారీ చిత్రాలు ప‌ఠాన్, జ‌వాన్ 1000 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించాయి. దేశంలోని అర‌డ‌జ‌ను మంది స్టార్ హీరోలు న‌టించిన సినిమాలు 500 కోట్ల క్ల‌బ్ లు అందుకున్నాయి. ఇక‌పోతే బాలీవుడ్ హీరోల‌తో సంచ‌ల‌నాలు సృష్టించ‌డంలో సౌత్ ద‌ర్శ‌కులు రేసులో ముందున్నారు.

ఇప్పుడు మ‌న హీరోల యాక్ష‌న్ స్టంట్స్ కి కూడా అంత‌ర్జాతీయ స్థాయి గుర్తింపు ద‌క్కుతోంది. హాలీవుడ్ పాపుల‌ర్ యాక్ష‌న్ హీరోల‌తో ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ పోటీబ‌రిలోకి వెళుతుండ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. షారూఖ్ న‌టించిన ప‌ఠాన్- జ‌వాన్ చిత్రాలు ప్ర‌తిష్ఠాత్మ‌క అంత‌ర్జాతీయ పుర‌స్కారాల్లో పోటీప‌డుతున్నాయి. ఖాన్ న‌టించిన‌ బ్లాక్ బస్టర్లు పఠాన్, జవాన్ లు `వ‌ల్చ‌ర్ 2023 వార్షిక స్టంట్ అవార్డ్స్‌`(న్యూయార్క్ కి చెందిన పాపుల‌ర్ మ్యాగ‌జైన్ పుర‌స్కారాలు)లో జాన్ విక్ 4 - మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ వంటి భారీ చిత్రాల‌తో పోటీప‌డుతున్నాయి. 2023లో విడుదలైన జవాన్ , పఠాన్ రెండూ ప‌లు విభాగాల్లో అవార్డుల‌కు నామినేట్ అయ్యాయి.

అట్లీ తెర‌కెక్కించిన `జవాన్` ఉత్తమ వెహిక్యులర్ స్టంట్ విభాగంలో హైవే చేజ్ సీక్వెన్స్ కోసం అవార్డుల‌కు నామినేట్ అయింది. అలాగే సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన పఠాన్ ఉత్తమ ఏరియల్ స్టంట్ కేట‌గిరీలో పోటీపడుతోంది. రెండు చిత్రాలు ఉత్తమ ఓవరాల్ యాక్షన్ ఫిల్మ్ కేటగిరీలో నామినేట్ అయ్యాయి. జవాన్ చిత్రం యాక్షన్ ఫిల్మ్‌లో బెస్ట్ స్టంట్ కోసం రేసులో ఉంది.

ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క‌ అంత‌ర్జాతీయ‌ అవార్డుల్లో మిష‌న్ ఇంపాజిబుల్ లాంటి క్రేజీ సినిమాతో ప‌ఠాన్, జ‌వాన్ పోటీప‌డ‌డం ఆద్యంతం ఉత్కంఠ క‌లిగిస్తోంది. టామ్ క్రూజ్ లాంటి యాక్ష‌న్ స్టార్ తో మ‌న స్టార్ల‌ను పోల్చ‌డం స‌రికాదు కానీ షారూఖ్ సినిమా స్టంట్స్ అభిమానుల‌ను ఏ స్థాయిలో అల‌రించాయో దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు.

ఏ విభాగంలో ఏ సినిమా పోటీ బ‌రిలో?

*యాక్షన్ ఫిల్మ్‌లో బెస్ట్ స్టంట్

-ది ఈక్వలైజర్ 3 (స్టెయిన్డ్ గ్లాస్ సీలింగ్ సీన్)

-ఎక్స్ ట్రాక్ష‌న్ 2 (ది ఓపెనింగ్ ఓనెర్ )

-జవాన్ (హైవే చేజ్) (ఇండియ‌న్ మూవీ)

-జాన్ విక్: అధ్యాయం 4 (ది స్టెయిర్ ఫైట్ అండ్ ఫాల్‌)

-మిషన్ ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ వన్ (బేస్ జంప్)

*ఉత్తమ వాహన స్టంట్

ఫాస్ట్ X (రోమ్ కార్ చేజ్)

ఫెరారీ (మిల్లె మిగ్లియా రేస్)

జవాన్ (హైవే చేజ్) (ఇండియ‌న్ మూవీ)

జాన్ విక్: అధ్యాయం 4 (ది ఆర్క్ డి ట్రియోంఫ్ సీన్)

మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రెకనింగ్ పార్ట్ వన్ (రోమ్ కార్ చేజ్)

*ఉత్తమ ఏరియల్ స్టంట్

ఎక్స్ ట్రాక్ష‌న్ 2 (హెలికాప్టర్ షూట్ అవుట్)

గాడ్జిల్లా మైనస్ వన్ (గాడ్జిల్లా చుట్టూ తిరిగే విమానం)

కాందహార్ (హెలికాప్టర్ ఫైట్)

మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ వన్ (బేస్ జంప్)

పఠాన్ (జెట్-ప్యాక్ ఫైట్) (ఇండియ‌న్ మూవీ)

*బెస్ట్ ఓవరాల్ యాక్షన్ ఫిల్మ్

బాలేరినా

గై రిచీ ది క‌న్వీనెంట్

ఎక్స్ ట్రాక్ష‌న్ 2

ఫ‌స్ట్ ఆఫ్ ది కాండోర్

జవాన్ (ఇండియ‌న్ మూవీ)

జాన్ విక్: అధ్యాయం 4

మిషన్: ఇంపాజిబుల్ — డెడ్ రికనింగ్ పార్ట్ వన్

పఠాన్ (ఇండియ‌న్ మూవీ)

సైలెంట్ నైట్

షిన్ కామెన్ రైడర్