స్టార్ హీరోకి ఎయిర్ పోర్టులో అవమానం!
ఈ సందర్భంగా ఆర్నాల్డ్ చేతికి స్విస్ లగ్జరీ ఆడెమర్స్ పీగెట్ వాచీని ధరించారు.
By: Tupaki Desk | 20 Jan 2024 12:13 PM GMTహాలీవుడ్ నటుడు అర్నాల్డ్ స్వార్జ్‌నెగర్‌కు మ్యూనిచ్ ఎయిర్‌పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. నిబంధ నలకు విరుద్దంగా ప్రవర్తించారని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరి ఎందుకు ఇలా జరిగిందో తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఆర్నాల్డ్ జనవరి 17న అమెరికా నుంచి జర్మనీకి వెళ్లారు. ఈ సందర్భంగా ఆర్నాల్డ్ చేతికి స్విస్ లగ్జరీ ఆడెమర్స్ పీగెట్ వాచీని ధరించారు.
అయితే ఈ వాచ్ ధరిస్తే జర్మనీ అధికారులకు ముందుగా సమాచారం ఇవ్వాలి. కానీ ఎలాంటి సమాచారం ఆర్నాల్డ్ టీమ్ అందించలేదు. ఆస్ట్రియాలో జరిగే వరల్డ్ క్లైమేట్ సమ్మిట్‌లో ఏర్పాటు చేసిన డిన్నర్ కోసం తన వాచీని వేలం వేసేందుకు నిర్ణయించుకొన్నారు ఆర్నాల్డ్. కానీ ఈ విషయాన్ని అధికారులకు వెల్లడించ లేదు. ఇదే వివాదానికి కారణ మైంది. యూరోపియన్ యూనియన్ ఫరిది లో తయారు కానీ ప్రోడక్ట్ ని అనుమతిం చకూ డదు అనే ఓ నిబంధన అమలులో ఉంది.
దాన్ని ఆర్నాల్డ్ వాచీ రూపంలో ధరించి నిబంధన ఉల్లంఘించారు. ఈ నిబంధన పౌరులంతా పాటించా ల్సిందే. దానికి సంబంధించి ప్రత్యేకంగా టాక్స్ చెల్లించాలి. ఇవన్నీ చేయడానికి అర్నాల్డ్ అప్పటికప్పుడు సిద్దపడ్డారు. కానీ అక్కడా ఆర్నాల్డ్ సహనాన్ని క్రెడిట్ కార్డు మిషన్ పరీక్షించింది. ఆర్నాల్డ్ క్రెడిట్ కార్డు అందించగా అది మోరాయించింది. దీంతో గంట సేపు ఆలస్యం అయింది.
దాంతో ఆర్నాల్డ్ దగ్గరలో ఉన్న ఏటీఎం మిషన్ కి వెళ్లి డబ్బు విత్ డ్రా చేసుకుని వచ్చి చెల్లించినట్లు తెలు స్తోంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట ఆసక్తికరంగా మారింది. వాచీ కోసం వెయిట్ చేయించడం ఏంటి? అని అంతా ఆశ్చర్యపోతున్నారు.