Begin typing your search above and press return to search.

ఆ స్టార్ హీరో సినిమాపై బ‌డ్జెట్ కోత భారీగానా!?

రిస్క్ తీసుకోవ‌డం అన్న‌ది అంత వీజీ కాదు. ఎంతో న‌మ్మ‌కం ఉంటే త‌ప్ప‌! రిస్క్ ని ట‌చ్ చేయ‌కూడ‌దు

By:  Tupaki Desk   |   18 April 2024 8:22 AM GMT
ఆ స్టార్ హీరో సినిమాపై బ‌డ్జెట్ కోత భారీగానా!?
X

రిస్క్ తీసుకోవ‌డం అన్న‌ది అంత వీజీ కాదు. ఎంతో న‌మ్మ‌కం ఉంటే త‌ప్ప‌! రిస్క్ ని ట‌చ్ చేయ‌కూడ‌దు. అందుకే ఇప్పుడా స్టార్ హీరో సినిమా విష‌య‌లో ఓ బ‌డా నిర్మాణ సంస్థ వెన‌క్కి త‌గ్గిన విష‌యంలో ఆల‌స్యంగా వెలుగులోకి వ‌స్తోంది. రిస్క్ తీసుకోవ‌డం కంటే అత‌డితో సేఫ్ జోన్ లోనే సినిమా చేయాల‌నే నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే ఆ మ‌ధ్య ఓ స్టార్ హీరో తో ఓ బ‌డా బ్యాన‌ర్ భారీ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేసింది. సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా మొద‌లైంది. కంటెంట్ పై న‌మ్మ‌కంతో నిర్మాత‌లు డేర్ గా ఎన్నికోట్లు అయినా పెట్టొచ్చు అన్న న‌మ్మ‌కంతో ముందుకు క‌దిలారు.

కానీ ఇప్పుడా న‌మ్మ‌కాన్ని కోల్పోయారు. ఆ హీరోత‌ల‌పై అన్ని కోట్లు పెట్ట‌డం అవ‌స‌ర‌మా? అని ఆలోచ‌న‌తో వెంట‌నే దాన్ని ఆమోద‌యోగ్యంలోకి తెచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఆ హీరో న‌టించిన సినిమాలు వ‌రుస‌గా బాక్సాఫీస్ వ‌ద్ద ఫెయిల‌వ్వ‌డంతో మార్కెట్ కూడా ప‌డిపోయింది. 50 కోట్లు తేవ‌డం కూడా క‌ష్టంగా మారింది. ఓమూడు సినిమాల విష‌యంలో ఇది రుజువు అవ్వ‌డంతో స‌ద‌రు నిర్మాత‌లు వెంట‌నే అలెర్ట్ అయ్యారు. దీంతో హీరో పారితోషికం త‌గ్గించుకోవ‌డానికి ముందుకొచ్చాడు. నాకంత ఇవ్వొద్దు. తోచినంత ఇవ్వండి అని హీరో-నిర్మాత మ‌ధ్య చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయి.

దీంతో దానికి సంబంధించి కొత్త ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. అదే భేటీలో సినిమా బ‌డ్జెట్ కూడా ముందు అనుకున్నంత ఉండ‌దు....మార్కెట్ ని బేస్ చేసుకునే పెడ‌తామ‌ని హీరోతో క‌రాఖండీగా చెప్పేసి ఒప్పించినట్లు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌స్తోంది. చేసేదేం లేక హీరో కూడా మీ ఇష్టం అన్నారుట‌. ముందు అనుకున్న బ‌డ్జెట్ కంటే అర‌వంతు కోత ప‌డిన‌ట్లు స‌మాచారం. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అంటే ఎలా లేద‌న్నా త‌క్కువ‌లో త‌క్కువ వంద‌కోట్లు అవుతుంది. సాధార‌ణ చిత్రాల‌కే 50-70 కోట్లు ఖ‌ర్చు అవుతుంది.

పాన్ ఇండియా కాబ‌ట్టి వంద కోట్లు వేసుకున్నా ఇప్పుడా బ‌డ్జెట్ 50 కోట్ల‌కు వ‌చ్చిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు నిపుణులు. దీంతో కొత్త సందేహాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. బ‌డ్జెట్ కోత ప‌డిన నేప‌థ్యంలో ఇప్పుడ‌ది పాన్ ఇండియా సినిమా అవుతుందా? లేక లోక‌ల్ మార్కెట్ ని బేస్ చేసుకునే తీస్తారా? అన్న సందేహం తెర‌పైకి వ‌స్తుంది. ఆ మ‌ధ్య కొన్ని సినిమాలు ముందుగా పాన్ ఇండియా సినిమా అని ప్ర‌క‌టించినా ఔట్ పుట్ చూసుకుని రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డేస‌రికి లోక‌ల్ మార్కెట్ కే ప‌రిమితం చేసారు. మ‌రి ఆ వార‌సుడి సినిమా విష‌యంలో ఏం జ‌రుగుతుందో చూడాలి.