బెట్టింగ్ యాప్ స్కామ్‌లో 34 మంది బాలీవుడ్ స్టార్లు?
సెప్టెంబర్ 2022లో దుబాయ్‌లో జరిగిన పెళ్లి వేడుకకు హాజరైన 34 మంది బాలీవుడ్ ప్రముఖుల జాబితాపై మీడియాలో కథనాలొస్తున్నాయి.
By: Tupaki Desk | 7 Oct 2023 4:17 AM GMTమహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్‌తో ముడిపడి ఉన్న ఈవెంట్‌కు హాజరైనందుకు బాలీవుడ్ తారలు సంజయ్ దత్, సోనూ సూద్, ఉర్వశి రౌతేలా, స్నేహా ఉల్లాల్ సహా పలువురు ED పరిశీలనలో ఉన్నారని సమాచారం.
మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్‌కు లింక్ ఉన్న భారీ ఈవెంట్‌కు హాజరైనందుకు డజన్ల కొద్దీ సెలబ్రిటీలు ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) రాడార్ కింద ఉన్నారు. సెప్టెంబర్ 2022లో దుబాయ్‌లో జరిగిన పెళ్లి వేడుకకు హాజరైన 34 మంది బాలీవుడ్ ప్రముఖుల జాబితాపై మీడియాలో కథనాలొస్తున్నాయి. ప్రమోటర్లను ఆకర్షించడం, బెట్టింగ్‌ను ప్రోత్సహించే మహాదేవ్ యాప్‌కు చట్టబద్ధత కల్పించడం కోసం ఈ ఈవెంట్‌ను నిర్వహించినట్లు సోర్సెస్ చెబుతున్నాయి.
ED స్కానర్‌లో ఉన్న ప్రముఖుల జాబితాను పాపులర్ రిపబ్లిక్ పోర్టల్ వెల్లడించింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. 1 రాఫ్తార్, 2 ఎమ్మెల్సీ దీప్తి సాధ్వని, 3 సునీల్ శెట్టి, 4 సోనూ సూద్, 5 సంజయ్ దత్, 6 హార్డీ సంధు, 7 సునీల్ గ్రోవర్, 8 సోనాక్షి సిన్హా, 9 రష్మిక మంధాన, 10 సారా అలీ ఖాన్, 11 గురు రంధవా, 12 సుఖ్విందర్ సింగ్, 13 టైగర్ ష్రాఫ్, 14 కపిల్ శర్మ, 15 నుష్రత్ బరుచా, 16 DJ చేతలు, 17 మలైకా అరోరా, 18 నోరా ఫతేహి, 19 అమిత్ త్రివేది, 20 మౌని రాయ్, 21 ఆఫ్తాబ్ శివదాసాని, 22 సోఫీ చౌదరి, 23 డైసీ షా, 24 ఊర్వశి రౌతేలా, 25 నర్గీస్ ఫక్రీ, 26 నేహా శర్మ, 27 ఇషితా రాజ్, 28 షమితా శెట్టి, 29 ప్రీతి జింగానియా, 30 స్నేహ ఉల్లాల్, 31 సోనాలి సెహగల్, 32 ఇషితా దత్తా, 33 ఎల్నాజ్, 34 గిరోగియా ఆండ్రియాని (అర్బాజ్ ఖాన్ స్నేహితురాలు)
యాప్‌ను ప్రమోట్ చేశారనే ఆరోపణలపై నటులు రణ్‌బీర్ కపూర్, హీనా ఖాన్, హుమా ఖురేషి, కమెడియన్ కపిల్ శర్మలకు ఈడీ ఇప్పటికే సమన్లు జారీ చేసింది. ముఖ్యంగా మహదేవ్ యాప్ ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రకర్ వివాహానికి హాజరైనందుకు పైన పేర్కొన్న జాబితాలోని కొంతమంది ప్రముఖులు కూడా పరిశీలనలో ఉన్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో శుక్లా పెళ్లి జరగగా ఈ ఈవెంట్ కోసం రూ.260 కోట్ల నగదు ఖర్చు చేసినట్లు సమాచారం. ఈవెంట్ కి హాజరైన సెలబ్రిటీలకు పెద్ద మొత్తంలో నగదు (క్యాష్ రూపంలో) చెల్లింపు జరిగినట్లు తెలిసింది. దీంతో హవాలా కోణంపై కూడా విచారణ జరుగుతోంది. చంద్రకర్ తన భాగస్వామి రవి ఉప్పల్‌తో కలిసి నేపాల్, నెదర్లాండ్స్, యుఎఇ, శ్రీలంకలోని కాల్ సెంటర్‌ల ద్వారా బెట్టింగ్ వ్యాపారాన్ని నడుపుతున్నాడు. దుబాయ్ కేంద్రంగా ఈ దందా సాగుతోంది. టెన్నిస్, బ్యాడ్మింటన్, పేకాట, క్రికెట్, కార్డ్ గేమ్‌లపై అక్రమ బెట్టింగ్‌లకు వేదికల్ని అతడు రన్ చేస్తున్నారు.
మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ కేసులో రణబీర్, శ్రద్ధా కపూర్‌కు ఇప్పటికే ఈడీ సమన్లు జారీ చేసింది. అదే సమయంలో రణబీర్ కపూర్ రాయ్‌పూర్‌లోని ఏజెన్సీ ప్రాంతీయ కార్యాలయంలో ED ముందు హాజరు కావడానికి రెండు వారాల గడువును కోరారు. కపిల్ శర్మ, హుమా ఖురేషి కూడా తమ ప్రదర్శనకు సంబంధించి పొడిగింపు కోసం అభ్యర్థించారు.