Begin typing your search above and press return to search.

కీరవాణి ఎంత మంచివారంటే..

బ్రాండ్ వేల్యూ ప్రకారం చూసుకున్న భారీ రెమ్యునరేషన్ తీసుకోవడానికి కీరవాణికి పూర్తి స్థాయి అర్హుడు.

By:  Tupaki Desk   |   12 Aug 2024 4:12 AM GMT
కీరవాణి ఎంత మంచివారంటే..
X

ఆస్కార్ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండియా నుంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో ఏఆర్ రెహమాన్, ఎం.ఎం.కీరవాణి మాత్రమే కనిపిస్తారు. కీరవాణి అయితే ఇండియన్ సినిమాగా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటకి బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకున్నారు. ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత కీరవాణి ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.

సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు. ఆస్కార్ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత కూడా కీరవాణి మరల చిన్న సినిమాలు చేశారు. సుమ లీడ్ రోల్ లో తెరకెక్కిన జయమ్మ పంచాయితీకి కీరవాణి సంగీతం అందించారు. తరువాత లారెన్స్ చంద్రముఖి 2, కింగ్ నాగార్జున నా సామి రంగా, దిల్ రాజు బ్యానర్ లో లవ్ మీ సినిమాలకి మ్యూజిక్ అందించారు.

ఆర్ఆర్ఆర్ తో పోల్చుకుంటే బడ్జెట్ పరంగా కొన్ని చిన్న సినిమాలున్నాయి. సాదారణంగా ఆస్కార్ రేంజ్ లో హిట్ పడినప్పుడు ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా కాస్త పెద్ద సినిమాలే ఎక్కువగా చేయాలని అనుకుంటాడు. కానీ ఆయన మాత్రం అలా ఆలోచించడం లేదు. RRR కు భారీగా రెమ్యునరేషన్ తీసుకున్న కీరవాణి పలు సినిమాలకి తక్కువ రెమ్యునరేషన్ లోనే సంగీతం అందించారు. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ అన్ని సినిమాలకి ఒకే తరహాలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తారు. అయితే కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు.

అతను సంగీతం అందించే సినిమా కచ్చితంగా ఎంతో కొంత పబ్లిక్ అటెన్షన్ కి గ్రాబ్ చేస్తుంది. బ్రాండ్ వేల్యూ ప్రకారం చూసుకున్న భారీ రెమ్యునరేషన్ తీసుకోవడానికి కీరవాణికి పూర్తి స్థాయి అర్హుడు. అయిన కానీ సినిమా రేంజ్ బట్టి మాత్రమే ఆయన రెమ్యునరేషన్ తీసుకోవడం విశేషం. తద్వారా మినిమమ్, లోబడ్జెట్ సినిమాలు చేసే దర్శకులకి కూడా కీరవాణి అందుబాటులో ఉంటున్నారనే మాట వినిపిస్తోంది.

ప్రస్తుతం కీరవాణి పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లుకి మ్యూజిక్ అందిస్తున్నారు. అలాగే రాజమౌళి, మహేష్ బాబు పాన్ వరల్డ్ సినిమాకి కూడా ఆయనే సంగీతం సమకూర్చుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు వైవిఎస్ చౌదరి హరికృష్ణ మనవడుతో చేయబోయే కొత్త సినిమాకి కీరవాణి మ్యూజిక్ అందించబోతున్నారు. వైవిఎస్ మొదటి సినిమా శ్రీ సీతారాముల కళ్యాణం చూతుము రారండికి కీరవాణి మ్యూజిక్ అందించారు.

తరువాత సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరో, సీతయ్య సినిమాలకి కీరవాణినే సంగీతం సమకూర్చారు. ఈ నాలుగు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఈ కారణంగానే వైవిఎస్ చౌదరి ఫామ్ లో లేకపోయినా కూడా కీరవాణి తక్కువ రెమ్యునరేషన్ తోనే మ్యూజిక్ అందించడానికి ఒప్పుకున్నారంట.

అతనితో అనుబంధం కొద్ది వైవిఎస్ చౌదరి అడగగానే మ్యూజిక్ చేయడానికి కీరవాణి యాక్సప్ట్ చేసారంట. హరికృష్ణ మనవడు సినిమా కాబట్టి కచ్చితంగా కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ ఈ చిత్రానికి బలంగా ఉంటుందని చెప్పొచ్చు. ఏదేమైనా పెద్ద సంగీత దర్శకుడు అనే బ్రాండ్ ఇమేజ్ పనికి అడ్డు పడకూడదని తనకు నచ్చిన సినిమాలకు వర్క్ చేసుకుంటూ వెళుతున్నారు. దీన్ని బట్టి ఆయన ఎంత మంచివారో అర్థం చేసుకోవచ్చు.