Begin typing your search above and press return to search.

17 ఏళ్ల కెరీర్ ప‌థంలో అద్భుతాలు చేసిన స్టార్లు

ఆ ఇద్ద‌రు స్టార్లు మ‌రెవ‌రో కాదు.. బాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు ర‌ణ‌బీర్ క‌పూర్.. మేటి క‌థానాయిక దీపిక ప‌దుకొణే గురించే ఈ వివ‌రం.

By:  Tupaki Desk   |   9 Nov 2024 8:30 PM GMT
17 ఏళ్ల కెరీర్ ప‌థంలో అద్భుతాలు చేసిన స్టార్లు
X

ప‌రిశ్ర‌మ‌లో అగ్ర‌తార‌లుగా వెలుగుతున్న ఇద్ద‌రు స్టార్లు (న‌టుడు, నటి) వారి తొలి చిత్ర ప‌రిచ‌యం ఎంతో గ‌మ్మ‌త్త‌యిన‌ది.. ఒక‌రు న‌ట‌వార‌సులుగా తెరంగేట్రం చేస్తే, ఆరంభ చిత్రం డిజాస్ట‌ర్... మ‌రొక‌రు విభిన్న రంగం నుంచి ప‌రిశ్ర‌మ‌కు విచ్చేయ‌గా, అద్బుత‌మైన బ్లాక్ బ‌స్ట‌ర్ ద‌క్కించుకున్నారు. ఆ ఇద్ద‌రికీ అగ్ర ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేసే అవ‌కాశం ఆరంభ‌మే ల‌భించింది. ఆ త‌ర్వాత ఎవ‌రికి వారు కెరీర్ ని మ‌లుచుకున్న తీరు అసాధార‌ణం. ఆ ఇద్ద‌రు స్టార్లు మ‌రెవ‌రో కాదు.. బాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు ర‌ణ‌బీర్ క‌పూర్.. మేటి క‌థానాయిక దీపిక ప‌దుకొణే గురించే ఈ వివ‌రం.

దీపికా పదుకొణె 'ఓం శాంతి ఓం' 9 నవంబర్ 2007న బాక్సాఫీస్ వద్ద రణబీర్ కపూర్ తొలి చిత్రం 'సావరియా'తో ఢీకొంది. ఫరా ఖాన్ దర్శకత్వం వహించిన ఓం శాంతి ఓం బంప‌ర్ హిట్టు. కానీ సంజయ్ లీలా భ‌న్సాలీ రొమాంటిక్ డ్రామా 'సావారియా' డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఓం శాంతి ఓం ప్రపంచవ్యాప్తంగా రూ.152 కోట్లు వసూలు చేయ‌గా, సావరియా కేవ‌లం 40 కోట్ల రూపాయలను ఆర్జించింది. ఈ రెండు చిత్రాలు విడుదలై నేటికి 17 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో భారతీయ సినిమా అతిపెద్ద బాక్సాఫీస్ క్లాష్‌ల‌లో ఒకటిగా ఆ సంద‌ర్భం ఎలా నిలిచిందో గుర్తుచేసుకుంటున్నారు.

షారుఖ్ ఖాన్ - దీపికా పదుకొనేల చిత్రం 'ఓం శాంతి ఓం'... రణబీర్ - సోనమ్ కపూర్‌ల 'సావారియా' అప్ప‌ట్లో ఎంపిక చేసుకున్న తారాగ‌ణం, డైరెక్ట‌ర్స్ ఫ్యాక్ట‌ర్ తో గొప్ప‌గా చ‌ర్చ‌ల్లో నిలిచాయి. భ‌న్సాలీ సావారియా ఫ్యోడర్ దోస్తోవ్స్కీ 1848 చిన్న కథ 'వైట్ నైట్స్' ఆధారంగా రూపొందింది. రిషి కపూర్ - నీతూ కపూర్‌ల‌ కుమారుడు రణబీర్ అరంగేట్రం కావ‌డంతో ప్ర‌త్యేకంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. అప్ప‌టికే క్రేజ్ ఉన్న‌ దీపిక మొదటి హిందీ మూవీగా 'ఓం శాంతి ఓం' కూడా షారూఖ్ ఫ్యాక్ట‌ర్ తో అంతే దృష్టిని ఆక‌ర్షించింది. ఈ చిత్రం అత్యధిక వసూళ్లు చేసిన బాలీవుడ్ చిత్రంగా నిలిచింది. 40 కోట్ల బ‌డ్జెట్ తో రూపొందించిన ఓం శాంతి ఓం 152 కోట్లు వ‌సూలు చేయ‌గా, 2007లో అత్యధిక వసూళ్లు చేసిన హిందీ చిత్రంగా రికార్డుల‌కెక్కింది. సావారియా అందుకు విరుద్ధ‌మైన ఫ‌లితం అందుకుంది. ఈ సినిమా క‌థ‌, క‌థ‌నాల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. కానీ సౌండ్‌ట్రాక్, ప్రొడక్షన్ డిజైన్, కళాత్మక దృష్టి కోణంలో గొప్ప ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఇటీవ‌ల దీపిక ప‌దుకొణే న‌టించిన క‌ల్కి 2989 ఏడి పాన్ ఇండియా హిట్ సాధించింది. ఇప్పుడు రోహిత్ శెట్టి సింగం ఎగైన్ తోను మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది ఈ బ్యూటీ. బాలీవుడ్ లో దీపిక అగ్ర క‌థానాయిక‌గా త‌న హోదాను నిలబెట్టుకుంది. బ్ర‌హ్మాస్త్ర‌, యానిమ‌ల్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో ర‌ణ‌బీర్ క‌పూర్ హ‌వా కూడా అసాధార‌ణంగా ఉంది.