Begin typing your search above and press return to search.

పీవీ సింధు పెళ్లికి హాజరైన స్టార్స్ వీళ్లే

ఇండియన్‌ బ్యాడ్మింటన్‌ స్టార్ పీవీ సింధు వివాహం అత్యంత వైభవంగా జరిగింది. రాజస్థాన్‌లో ఇటీవల జరిగిన వివాహ వేడుక ఫోటోలు వైరల్‌ అయ్యాయి.

By:  Tupaki Desk   |   25 Dec 2024 6:19 AM GMT
పీవీ సింధు పెళ్లికి హాజరైన స్టార్స్ వీళ్లే
X

ఇండియన్‌ బ్యాడ్మింటన్‌ స్టార్ పీవీ సింధు వివాహం అత్యంత వైభవంగా జరిగింది. రాజస్థాన్‌లో ఇటీవల జరిగిన వివాహ వేడుక ఫోటోలు వైరల్‌ అయ్యాయి. మూడు రోజుల పాటు అక్కడ పెళ్లి తంతు జరిగింది. డెస్టినేషన్ వెడ్డింగ్‌ సందడి ముగిసింది. అక్కడ నుంచి వచ్చిన వెంటనే హైదరాబాద్‌లో పీవీ సింధు పెళ్లి రిసెప్షన్‌ వేడుక జరిగింది. సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది ప్రముఖులు రిసెప్షన్‌లో పాల్గొన్నారు. ఇండస్ట్రీ వర్గాల వారితో ఆమెకు ఉన్న సన్నిహిత సంబంధం కారణంగా చాలా మంది ఈ వేడుకలో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ముఖ్యంగా పీవీ సింధు పెళ్లి రిసెప్షన్‌లో మెగాస్టార్‌ చిరంజీవి పాల్గొన్నారు. సింపుల్‌ అండ్ స్వీట్‌ లుక్‌లో చిరంజీవి ఈ రిసెప్షన్‌లో పాల్గొన్నారు. టీ షర్ట్‌ ధరించిన చిరంజీవి లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కొత్త దంపతులను ఆశీర్వదించిన చిరంజీవి సింధు కుటుంబ సభ్యులను నవ్వుతూ పలకరించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నా చిరంజీవి ఈ రిసెప్షన్‌కు హాజరు అయ్యారు. పీవీ సింధు మెగా ఫ్యామిలీకి చాలా సన్నిహితురాలిగా పేరు ఉన్న విషయం తెల్సిందే. అందుకే ఆమె వివాహ రిసెప్షన్‌లో చిరంజీవి బిజీ షెడ్యూల్‌లోనూ పాల్గొని తన శుభాకాంక్షలు అందించారు.

సింధు రిసెప్షన్‌లో టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున సైతం పాల్గొన్నారు. అక్కినేని ఫ్యామిలీకి సైతం పీవీ సింధు సన్నిహితురాలిగా ఉంటుంది. ఆమె యొక్క పలు కార్యక్రమాలు, ఆమె ఇండస్ట్రీ రిలేషన్స్‌లో ఎక్కువగా అక్కినేని ఫ్యామిలీకి చెందిన వారు ఉంటారని అంటారు. పీవీ సింధు దంపతులను ఆశీర్వదించేందుకు గాను నాగార్జున వచ్చారు. నాగ్‌ సైతం సింపుల్‌ అండ్ సూపర్‌ ఔట్‌ ఫిట్‌లో ఈ కార్యక్రమంలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. కోలీవుడ్‌ సూపర్ స్టార్ అజిత్‌ కుమార్‌ మొత్తం ఫ్యామిలీతో సింధు రిసెప్షన్‌కి హాజరు అయ్యారు. అజిత్‌ ఫ్యామిలీ రిసెప్షన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అజిత్ క్లీన్‌ షేవ్‌ తో కనిపించారు. ఎప్పటిలాగే తెల్లటి జుట్టుతో ఆయన స్టైల్‌గా ఉన్నారు.

ఇంకా మెగా ఇంటి కోడలు ఉపాసన సైతం ఈ రిసెప్షన్‌లో పాల్గొన్నారు. హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ రిసెప్షన్‌లో పాల్గొంది. సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో పాటు రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రిసెప్షన్‌లో పీవీ సింధు హీరోయిన్స్‌ కంటే ఎక్కువగా మెరిసి పోతూ అందంగా కనిపించారు. ఆమె ఔట్‌ ఫిట్‌ బాగుంది అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి పీవీ సింధు దంపతుల పెళ్లి, రిసెప్షన్‌ ఫోటోలు, వీడియోలతో గత వారం రోజులుగా తెగ హడావిడి సోషల్‌ మీడియాలో కనిపిస్తుంది. ఈ రిసెప్షన్‌ తర్వాత ఈ హడావిడి తగ్గేనా చూడాలి.