Begin typing your search above and press return to search.

ఆస్టార్ హీరోలు...స్టార్ భామ‌లు అంతా ఒక్క‌టే గ్యాంగ్!

పుర్రికో బుద్ది ...జిహ్వ‌కో రుచి అన్న‌ట్లు! సెల‌బ్రిటీల ఆహార నియ‌మాలు కొంద‌రు ఎంతో క‌ఠినంగా పాటిస్తుటారు.

By:  Tupaki Desk   |   23 Sep 2024 1:30 AM GMT
ఆస్టార్ హీరోలు...స్టార్ భామ‌లు అంతా ఒక్క‌టే గ్యాంగ్!
X

పుర్రికో బుద్ది ...జిహ్వ‌కో రుచి అన్న‌ట్లు! సెల‌బ్రిటీల ఆహార నియ‌మాలు కొంద‌రు ఎంతో క‌ఠినంగా పాటిస్తుటారు. చాలా ప‌రిమితంగానే ఆహారం తీసుకుంటారు. అందులోనూ ప్ర‌త్యేకంగా వెజిటేరియ‌న్స్ ఎక్కువ‌గా ఉంటారు. అలా సౌత్ నుంచి ప్యూర్ వెజ్ టేరియ‌న్స్ ఎవ‌రు? అంటే కొంద‌రున్నారు. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఒకప్పుడు ముక్క లేనిదే ముద్ద గిగేది కాదు. అందులోనూ ఆయ‌న న‌టుడు కాక ముందు రోజు రెండు పూట‌లు ముక్క భోజ‌నం చేసేవారు .

న‌టుడైన త‌ర్వాత చాలా కాలం పాటు అది కొన‌సాగింది. కానీ కాల‌క్ర‌మంలో ఆయ‌న‌లో ఆధ్మాత్మిక ప‌రివ‌ర్త‌న ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ఈ క్ర‌మంలోనే నాన్ వెజ్ మానేసి ప్యూర్ వెజిటేరియ‌న్ గా మారియారు. కొనేళ్ల‌గా ర‌జ‌నీ కేవ‌లం శాఖాహారం మాత్ర‌మే తీసుకుంటున్నారు. ఇక ధ‌నుష్ చిన్న‌ప్ప‌టి నుంచి వెజిటే రియ‌న్. ఇటీవ‌లే హైద‌రాబాద్ వ‌చ్చిన స‌మ‌యంలో ధమ్ బిర్యానీ రుచి గురించ అడిగితే నేను క‌క్కాముక్క గాడ్నికాదు..ప్యూర్ వెజ్ అంటూ డిజ‌ప్పాయింట్ చేసారు.

అలాగే న‌టుడు మాధ‌వ‌న్ కూడా వెజిటేరియ‌న్. చిన్న‌నాటి నుంచి శాఖాహార‌మే తీసుకుంటున్నారు. నాన్ వెజ్ అనే స్మెల్ కూడా ఆయ‌న‌కు ప‌డ‌దు. అలాగే సూర్య కూడా శాఖాహార‌మే తీసుకుంటారు. నాన్ వెజ్ అల‌వాటు లేద‌ని ఓ సంద‌ర్భంలో చెప్పారు. క‌మ‌ల్ హాస‌న్ కూడా వెజిటేరియ‌న్ కే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తారు.

ఇక హీరోయిన్ల‌లో చాలా మంది వెజిటేర‌య‌న్స్ క‌నిపిస్తారు. త్రిష కి చికెన్..మ‌ట‌న్ జోలికి వెళ్ల‌దు. కొంత కాలం ఎగ్ తీసుకునేది. కానీ ఇప్పుడు ఎగ్ కూడా తీసుకోవ‌డం లేదు. ఇక కాజ‌ల్ అగ‌ర్వాల్ చిన్న నాటి నుంచి వెజిటేరియ‌న్. నాన్ వెజ్ వాస‌న కూడా ప‌డ‌దంటోంది. శ్రియ‌, స‌మంత‌, త‌మ‌న్నా కూడా పూర్తిగా వెజ్ ఆహార ప‌దార్ధాలే తీసుకుంటున్నారు. ఇక టాలీవుడ్ హీరోలు అంతా దాదాపు నాన్ వెజ్ తినేవారే. కానీ చాలా ప‌రిమితంగా తీసుకుంటారు.