Begin typing your search above and press return to search.

స్టార్‌ సిస్టర్స్ రిలేషన్‌ బ్రేకప్‌ స్టోరీ!

వీరిద్దరు కలిసి ఒక సినిమాలో నటించినా కూడా ఆ సమయంలో మాట్లాడుకోలేదు.

By:  Tupaki Desk   |   24 April 2024 7:44 AM GMT
స్టార్‌ సిస్టర్స్ రిలేషన్‌ బ్రేకప్‌ స్టోరీ!
X

బాలీవుడ్‌ ప్రేక్షకులకు సుపరిచితం అయిన రాణి ముఖర్జీ మరియు కాజోల్‌ లు వరుసగా అక్కా చెల్లి అవుతారు. ఇద్దరి మధ్య బంధుత్వం ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు. గతంలో వీరి ఫ్యామిలీల మధ్య విభేదాలు ఉండేవి. వీరిద్దరు కలిసి ఒక సినిమాలో నటించినా కూడా ఆ సమయంలో మాట్లాడుకోలేదు.

ఇటీవల రాణి ముఖర్జీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాజోల్‌ ఫ్యామిలీతో ఉన్న విభేదాల గురించి స్పందించింది. ప్రస్తుతం అంతా బాగానే ఉన్నా గతంలో మా ఇద్దరి ఫ్యామిలీస్ మధ్య విభేదాలు ఉండేవి. ఏ ఫ్యామిలీలో అయినా గొడవలు అనేవి సహజం. కానీ మా ఫ్యామిలీస్ మధ్య గొడవలు ఏ కారణం లేకుండానే వచ్చాయి అంది.

ఎలాంటి గొడవ లేకుండానే, కారణం లేకుండానే మా ఫ్యామిలీస్ రెండు విడి పోయాయి. కేవలం అపార్థం వల్ల మేము చాలా కాలం ఒకరికి ఒకరం దూరంగా ఉన్నాం. కానీ ఇప్పుడ ఆ అపార్థాలు తొలగి పోయాయి. ఇప్పుడు మా రెండు ఫ్యామిలీలు కలిసి ఉన్నాయి. అన్ని ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కలుస్తున్నాం.

చిన్నప్పటి నుంచి కాజోల్‌ ఫ్యామిలీతో మా ఫ్యామిలీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాజోల్‌ కంటే ఆమె సోదరి తనిషా ముఖర్జీ నాకు క్లోజ్‌. చిన్నప్పుడు అందరం కలిసి ఆడుకునేవాళ్లం. నేను తనీషా ఒక పార్టీ కాగా, కాజోల్‌ నా సోదరుడు ఒక పార్టీగా ఆటలు ఆడుకునేవాళ్లం అంది.