స్టార్స్ ఓకే కుర్రాళ్లు అలా ఎందుకు ట్రై చేయట్లేదు..!
ఆ సినిమాలో పెద్దోడు వెంకటేష్ చిన్నోడుగా మహేష్ ఇద్దరు తమ ఇమేజ్ ని పక్కన పెట్టి తమ పాత్రలతో అదరగొట్టారు.
By: Tupaki Desk | 30 Jan 2024 9:30 AM GMTబ్లాక్ అండ్ వైట్ కాలంలో స్టార్ ఇమేజ్ గురించి అంతగా పట్టుకునే వారు కాదు. అందుకే ఆ టైం లో ప్రయోగాత్మక సినిమాలు ఎక్కువ వచ్చాయి. వాటితో పాటుగా మల్టీస్టారర్ సినిమాలు కూడా చేసే వారు. అయితే కాలం మారే కొద్దీ స్టార్ ఇమేజ్.. హీరోలను ఆరాధ్య దైవాలుగా చూస్తుండే సరికి వారు కూడా వాటికి తగినట్టుగానే సినిమాలు చేస్తున్నారు. ఈ టైం లో ఇద్దరు స్టార్స్ కలిసి సినిమా చేయడం అంటే అదో పెద్ద రిస్క్ అనే పరిస్థితి వచ్చింది. అయినా కూడా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో ఆ ప్రయత్నం చేశారు. ఆ సినిమాలో పెద్దోడు వెంకటేష్ చిన్నోడుగా మహేష్ ఇద్దరు తమ ఇమేజ్ ని పక్కన పెట్టి తమ పాత్రలతో అదరగొట్టారు.
టాలీవుడ్ లో చాలా కాలం తర్వాత వచ్చిన మల్టీస్టారర్ అది. ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో ఆర్.ఆర్.ఆర్ సినిమా వచ్చింది. టాలీవుడ్ ఇద్దరు స్టార్స్ రాం చరణ్, ఎన్.టి.ఆర్ ఇద్దరు కలిసి సినిమా చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ మెగా నందమూరి కాంబోని రాజమౌళి ఎలా తీస్తాడా అని ఫ్యాన్స్ అందరు ఈగర్ గా ఎదురు చూడగా దానికి తగినట్టుగానే ఆర్.ఆర్.ఆర్ అదరగొట్టేసింది.
అయితే స్టార్స్ తో మల్టీస్టారర్ అంటే అది కుదరని పని. ఎందుకంటే వాళ్లిద్దరు తమ సోలో సినిమాలు పక్కన పెట్టి ఈ సినిమా చేయాలి. అనుకున్న డేట్స్ ఇవ్వాలి ఇద్దరి పాత్రలు సరిగా కుదరాలి. ఇలా అన్నిసార్లు కుదురుతుందని చెప్పలేం. అయితే స్టార్స్ ఎలాగు ఈ ప్రయత్నాలను రెగ్యులర్ గా చేయట్లేదు కాబట్టి యువ హీరోలు ఈ మల్టీస్టారర్స్ చేస్తే బాగుంటుందని సినీ ప్రేక్షకులు అనుకుంటున్నారు.
టైర్ 2 హీరోలైనా సరే ఈ మల్టీస్టారర్ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించాలని ఆడియన్స్ కోరుతున్నారు. ఎలాగు వారి కాంబినేషన్ కూడా స్క్రీన్ పై అదిరిపోతుంది కాబట్టి ఇద్దరు హీరోలు కలిసి సినిమా చేస్తే ఆ సినిమా తప్పనిసరిగా ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పరచుకుంటుంది. యువ హీరోలు యూత్ తో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోలైన విజయ్ దేవరకొండ, రాం, విశ్వక్ సేన్, నిఖిల్, నాని, రవితేజ ఇలా వీరు మల్టీస్టారర్ సినిమా చేస్తే బాగుంటుందని ఆడియన్స్ అంటున్నారు.
వీరు చేసే మల్టీస్టారర్ సినిమాలకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. మరి ఈ హీరోలు మల్టీస్టారర్స్ మీద దృష్టి పెడితే బాగుంటుంది. ప్రేక్షకులను తమ సినిమాలతో మెప్పించడమే వారి టార్గెట్ కాబట్టి అదేదో ఒకటి రెండు సార్లు సరైన కథతో మల్టీస్టారర్ ప్రయత్నాలు కూడా చేస్తే ఇంకాస్త బాగుంటుందని ఆడియన్స్ భావిస్తున్నారు.