Begin typing your search above and press return to search.

మామ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి సాయిధ‌ర‌మ్ కానుక‌

ఈరోజు పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఐకానిక్ స్టార్ వార్స్ లెగో మిలీనియం ఫాల్కన్‌ను బహుమతిగా ఇచ్చారు

By:  Tupaki Desk   |   16 Jun 2024 8:14 AM GMT
మామ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి సాయిధ‌ర‌మ్ కానుక‌
X

నటుడు-రాజకీయ నాయ‌కుడు పవన్ కళ్యాణ్ ఇటీవలి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో అఖండ విజయం సాధించి వంద శాతం విజేత‌గా నిరూపించుకుని ఉప ముఖ్యమంత్రిగా ప్రతిష్టాత్మకమైన ప‌ద‌విని చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. సీఎంగా చంద్ర‌బాబు, ఉప ముఖ్య‌మంత్రిగా ప‌వ‌న్ ప్ర‌మాణ స్వీకారాలు చేసారు. ఈ చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి స‌తీమ‌ణి శ్రీ‌మ‌తి సురేఖ.. కోడలు ఉపాస‌న క‌లిసి విలాసవంతమైన మాంట్‌బ్లాంక్ పెన్నును జ‌న‌సేనాని ప‌వ‌న్‌కి బహుకరించారు. దీని విలువ రూ. 2.5 లక్షలు. ప‌వ‌న్ పై వ‌దిన‌మ్మ ప్రేమాభిమానాలు ప్ర‌జ‌ల‌ హృద‌యాల‌ను తాకాయి.

ఈరోజు పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఐకానిక్ స్టార్ వార్స్ లెగో మిలీనియం ఫాల్కన్‌ను బహుమతిగా ఇచ్చారు. దీని విలువ రూ. 1.2 లక్షలు. హృద‌యాన్ని క‌దిలించే ఒక అందమైన‌ నోట్ రాసిన‌ సాయి ధరమ్ తేజ్ త‌న ప్రేమ‌ను ఇలా వ్యక్తపరిచాడు. నా ప్రియమైన జేడీ మాస్టర్ & డిప్యూటీ సీఎంకు..నాకు స్టార్ వార్స్ అండ్ లెగోను పరిచయం చేసిన వ్యక్తి. ఇప్పుడు చివరగా నా చిన్ననాటి రోజులను తిరిగి పొందేందుకు మామ‌లోని చిన్నారి కోసం బహుమతిని ఇచ్చే అవకాశం నాకు లభించింది`` అని లేఖ‌లో రాసారు.

న‌టుడిగా కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్న హరి హర వీర మల్లు, ఓజీ విడుద‌ల‌కు రావాల్సి ఉంది. త‌దుప‌రి ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రీక‌ర‌ణ‌కు ప‌వ‌న్ హాజ‌ర‌వుతారు. పెండింగ్ చిత్రీకరణ షెడ్యూల్‌లు తిరిగి ప్రారంభమవుతాయి. మ‌రోవైపు సాయిధ‌ర‌మ్ సినిమాల‌కు చిన్న‌పాటి గ్యాప్ తీసుకున్న సంగ‌తి తెలిసిందే. విరూపాక్ష‌, బ్రో త‌ర్వాత అత‌డు న‌టించే ప్రాజెక్టుకు సంబంధించిన వివ‌రాలేవీ ఇంకా బ‌య‌ట‌ప‌కు రాలేదు.