కుబేర వెనుక ఇంత కథ ఉందా?
కానీ 'కుబేర' టైటిల్ వెనుక చాలా కథే ఉంది. కుబేరుడు అంటే కోటీశ్వరుడు. ఏడుకోవడలవాడికే అప్పులి చ్చిన వారిగా కుబేరని చెబుతారు. ఇక్కడ అందం అనే పదంతో సంబంధం లేదు.
By: Tupaki Desk | 10 March 2024 7:19 AM GMTధనుష్ కథానాయకుడిగా శేఖర్ కమ్ముల ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే 'కుబేర' అనేది చిత్ర టైటిల్ గానూ ప్రకటించారు. ఈ సందర్భంగా ధనుష్ బిచ్చగాడి లుక్ రివీల్ చేసారు. అయితే అక్కడ టైటిల్ కి- ధనుష్ లుక్ కి ఏ మాత్రం సంబంధం లేదు. దీంతో కమ్ములా ఏం చెప్పబోతున్నాడు? అసలు కథ ఏంటి? టైటిల్ కి ఆ పాత్రకి ఎలా జస్ట్ ఫై అవుతుందం టూ రకరకాల విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి.
కానీ 'కుబేర' టైటిల్ వెనుక చాలా కథే ఉంది. కుబేరుడు అంటే కోటీశ్వరుడు. ఏడుకోవడలవాడికే అప్పులి చ్చిన వారిగా కుబేరని చెబుతారు. ఇక్కడ అందం అనే పదంతో సంబంధం లేదు. అయితే ఈ పాత్ర కోసం శేఖర్ కమ్ములా కుబేరుడి పూర్వ జన్మ అయిన గుణనిధి ఆధారంగా చేసుకున్నట్లు కనిపిస్తుంది. పురాణంలో సూత మహర్షి చెప్పిన దాని ప్రకారం బ్రాహ్మ ణ వంశానికి చెందిన గణనిధి వ్యసనాలు..దొంగతనాలు బానిసై సులభమైన డబ్బు సంపాదన మార్గంలో వెళ్తాడు.
తండ్రికి నిజం తెలిశాక గుణనిధి కట్టుబట్టలతో పారిపోయి ఒక శివాలయంలో తల దాచుకుంటాడు. అక్కడ జాగారం చేసిన భక్తులకు పుణ్యం దక్కే పని చేసాక కాలుజారీ నంది తల తగిలి అక్కడే చనిపోతాడు. ఆ ఫలితంగా తర్వాత జన్మలో కుబేరుడిగా పుడతాడు. ఇది కృతయుగంలో కనిపించే కథ. కుబేరుడు అంటే శివభక్తుడు. తన తపస్సుకు మెచ్చే గరళకంఠుడు మంచి వరాలిస్తాడు. శేఖర్ కమ్ములా కేబేర కథ వెనుక ఈ చరిత్ర అంతా ఉందని అనిపిస్తుంది.
ధనుష్ పాత్రని చాలా ఎనాలసిస్ చేసి రాసాడని చెప్పొచ్చు. ఆ పాత్రని..కథని ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ కి లింక్ చేస్తూ రాసిన స్టోరీ అనిపిస్తుంది. నాగార్జున...ధనుష్ ని వెంటాడే ఈడీ అధికారిగా కనిపిస్తా డన్నది మరో సమాచారం. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాల్సి ఉంది. శేఖర్ కమ్ములా ఎలాంటి కథ తీసుకున్నా అందులో లోతైన విశ్లేషణ ఉంటుంది. అయితే కుబేర కథ కోసం మరింత గ్రౌండ్ వర్క్ చేసినట్లు కనిపిస్తుంది. తన మార్క్ ని పక్కనబెట్టి చేస్తోన్న చిత్రమిది. మరి ఈ గ్యాంగ్ స్టర్ స్టోరీ ప్రత్యేకత ఏంటి? అన్నది రిలీజ్ తర్వాత తెలుస్తుంది.