Begin typing your search above and press return to search.

ఫ్యామిలీలో ఆరుగురిని చంపిన NIFT లెక్చ‌ర‌ర్ స్టోరి

ఛేదించడానికి ఇంకా చాలా రహస్యాలు మిగిలి ఉన్నాయని .. జోలీలో ఇంకా చాలా దాగి ఉందని ట్రైలర్ లో హింట్ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   14 Dec 2023 8:53 AM GMT
ఫ్యామిలీలో ఆరుగురిని చంపిన NIFT లెక్చ‌ర‌ర్ స్టోరి
X

కేరళ‌లో ఒకే కుటుంబంలోని ఆరుగురి మిస్టీరియ‌స్ మ‌ర‌ణాలు సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. కుటుంబీకుల‌ ఊచకోతపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీని రూపొందించింది. `కరీ అండ్ సైనైడ్: ది జాలీ జోసెఫ్` పేరుతో రూపొందించిన‌ డాక్యుమెంటరీ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ డాక్యుమెంటరీ డిసెంబర్ 22న విడుదల కానుంది.

14 ఏళ్లలో ఆరు హత్యలు చేసిన నిందితురాలైన నిఫ్ట్ (ఎన్.ఐ.ఎఫ్‌.టి) లెక్చ‌ర‌ర్ జాలీ జోసెఫ్ జీవితం ఆధారంగా ఈ డాక్యుమెంటరీ తెరకెక్కింది. ఛేదించడానికి ఇంకా చాలా రహస్యాలు మిగిలి ఉన్నాయని .. జోలీలో ఇంకా చాలా దాగి ఉందని ట్రైలర్ లో హింట్ ఇచ్చారు. ట్రైల‌ర్ ఆద్యంతం గ‌గుర్పొడిచే ఎలిమెంట్స్ ని చూపించారు. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీని ఛేధించేందుకు పోలీసుల విచార‌ణ ఎలా సాగిందో ట్రైల‌ర్ లో క‌నిపించింది.

ఈ డాక్యుమెంటరీకి జాతీయ అవార్డు గ్రహీత క్రిస్టో టోమీ దర్శకత్వం వహించారు. 2002 నుంచి 2016 మధ్య కాలంలో ఎలాంటి పరిస్థితుల్లో ఆరుగురు చనిపోయారు? అన్న‌ది మూవీ కాన్సెప్ట్. ఒకే కుటుంబానికి చెందిన‌ పొన్నమట్టం టామ్ థామస్, భార్య అన్నమ్మ మాథ్యూ, కుమారుడు రాయ్ థామస్, అన్నమ్మ సోదరుడు మాథ్యూ మంచడియిల్, టామ్ థామస్ సోదరుడి కుమారుడు షాజు భార్య సిలి, కుమార్తె ఆల్ఫైన్ మరణించారు. రాయ్ థామస్ భార్య జాలీ జోసెఫ్ ఈ ఆరు హత్యలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ హ‌త్య‌ల వెన‌క మిస్ట‌రీని ఈ డాక్యు సిరీస్ లో చూపిస్తున్నారు. కూర‌లో సైనైడ్ క‌లిపి హ‌త్య‌లు చేసి, ఆపై గుండె పోటుతో మ‌ర‌ణించార‌ని చిత్రించిన హంత‌కురాలి దారుణాల‌ను ఈ సిరీస్ లో ఆవిష్క‌రిస్తున్నారు.