బోరింగ్ కథలకు టాటా!.. శ్రీవిష్ణు SWAG కథ ఇదే
బోరింగ్ కథలకు టాటా చెబుతూ! సరికొత్త పంథాలో అచ్చ తెలుగు సినిమా #SWAG శ్వాగణిక వంశానికి స్వాగతం అంటూ గ్లింప్స్ ను షేర్ చేశారు.
By: Tupaki Desk | 29 Feb 2024 7:12 AM GMTడిఫరెంట్ కథలు ఎంచుకుంటూ టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు హిట్లు కొడుతున్నారు. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. గతేడాది సామజవరగమన మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కుర్ర హీరో.. త్వరలోనే ఓం భీమ్ బుష్ అంటూ రాబోతున్నారు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే.. నిన్న కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. రాజా రాజా చోర డైరెక్టర్ హసిత్ గోలి తో మరోసారి శ్రీవిష్ణు సినిమా చేయబోతున్నారు.
వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న రెండో సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక నేడు శ్రీవిష్ణు పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. దాంతోపాటు టైటిల్ అనౌన్స్మెంట్ గ్లింప్స్ ను రిలీజ్ చేసి బర్త్ డే విషెస్ తెలిపారు. బోరింగ్ కథలకు టాటా చెబుతూ! సరికొత్త పంథాలో అచ్చ తెలుగు సినిమా #SWAG శ్వాగణిక వంశానికి స్వాగతం అంటూ గ్లింప్స్ ను షేర్ చేశారు.
మంచి సినిమాలు ఏం లేవు బోరు కొడుతుంది అంటూ ఓ చిన్నారి డైలాగ్ తో గ్లింప్స్ మొదలైంది. మరేం చూస్తావ్ సినిమాల్లో కథలేగా అంటూ ఓ వ్యక్తి (కమెడియన్ సునీల్ వాయిస్) ప్రశ్నించి.. తాను ఓ కథ చెప్తా అంటాడు. వెంటనే చిన్నారి.. నీకు అమ్మకే కథే చెప్పడం రాదు.. నాకేం చెప్తావ్ అంటాడు. టీవీ చూసుకుంటా అంటూ ఆన్ చేస్తాడు. టీవీలో జంతువుల యానిమేషన్ తో ఎపిసోడ్ వస్తుంటుంది. అందులో కోతి ఓ కథ రూపంలో తనకు వంశానికి ఉందని చెబుతుంది.
ఆ పేరు ఏంటనే అడగ్గా.. స్వాగ్ అని కోతి చెబుతుంది. వెంటనే జంతువులంతా స్వాగ్ స్వాగ్ అంటారు. చివరకు మరో కోతి.. ఇద మన కథేనని అడగ్గా.. మనకెందుకు కథలు అంటూ మరో కోతి చెబుతుంది. వెంటనే ఈ కథ మాదని హీరో వాయిస్ వస్తుంది. మగవాడి వంశాన్ని నిలబెట్టిన స్వాగణిక వంశానిది అంటూ హీరో చెబుతాడు. చివరకు స్వాగ్ అంటూ టైటిల్ రివీల్ అవుతోంది. ప్రస్తుతం ఈ టైటిల్ అనౌన్స్మెంట్ గ్లింప్స్ వైరల్ గా మారింది.
ఈ మూవీతో శ్రీవిష్ణు మరో హిట్ కొట్టడం పక్కా అని నెటిజన్లు కామెంట్లు పెడతున్నారు. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ లోడింగ్ అంటూ గ్లింప్స్ షేర్ చేస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. వేద రామన్ శంకరన్ సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే మిగతా వివరాలను వెల్లడిస్తామని చెప్పారు మేకర్స్. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.