Begin typing your search above and press return to search.

ఎంపీలో తిరిగిన ఆత్మ ముంబై కొచ్చింది!

మొద‌టి షెడ్యూల్ చందేరి లో పూర్తిచేసుకుంది. ఇందులో శ్ర‌ద్దా క‌పూర్ పై కీల‌క‌మైన స‌న్నివేశాలు చిత్రీక‌రించారు.

By:  Tupaki Desk   |   24 July 2023 11:30 PM GMT
ఎంపీలో తిరిగిన ఆత్మ ముంబై కొచ్చింది!
X

నిన్న మొన్న‌టివ‌ర‌కూ మ‌ధ్య‌ప్ర‌దేశ్ చందేరి ప‌రిస‌ర ప్రాంతాల్లో ఆ ఆత్మ సంచ‌రించింది. క‌న‌బ‌డిన వారిని త‌న‌లో లీనం చేసుకుంది. కామ కోరిక‌ల‌తో ర‌గిలిపోయే వారిని ఆ ఆత్మ ఓ చూపు చూసింది. ఇప్పుడు అదే ఆత్మ ముంబైకి షిప్ట్ అయింది. బీ అలెర్ట్ ముంబై అంటూ సంచ‌రించ‌డానికి రెడీ అయింది.

ఇంత‌కీ ఏంటి ఆత్మ స్టోరీ అనుకుంటున్నారా? అయితే వివ‌రాలోల‌కి వెళ్లాల్సిందే. శ్ర‌ద్దా క‌పూర్..రాజ్ క‌మార్ రావ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో స్త్రీ కి సీక్వెల్ గా స్త్రీ-2 తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

మొద‌టి షెడ్యూల్ చందేరి లో పూర్తిచేసుకుంది. ఇందులో శ్ర‌ద్దా క‌పూర్ పై కీల‌క‌మైన స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. రెండవ షెడ్యూల్ ముంబైలో ప్లాన్ చేస్తున్నారు. ఇది లాంగ్ షెడ్యూల్ అని స‌మాచారం. నెల రోజుల పాటు ముంబైలో నే షూటింగ్ జ‌రుగుతుంద‌ని తెలిసింది. ఇక ఇదే నెల‌లో టీజ‌ర్ కూడా రిలీజ్ చేస్తున్న‌ట్లు యూనిట్ ప్ర‌క‌టించింది. రిలీజ్ ని కూడా వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారుట‌.

నేరుగా సోష‌ల్ మీడియాలో కాకుండా ఓ పెద్ద స్క్రీన్ లో డార్క్ మోడ్ ఎఫెక్ట్ ఉన్న థియేట‌ర్లో రిలీజ్ చేయాల ని భావిస్తున్నారుట‌. అందుకోసం ప్ర‌త్యేకంగా కొంత మంది ప్రేక్ష‌కుల్ని యూనిట్ సెల‌క్ట్ చేస్తుందిట‌. వాళ్ల ఆధ్వ‌ర్యంలోనే ఆ ఈవెంట్ ని నిర్వ‌హించాల‌ని చూస్తున్నారుట‌. యూనిట్ టీజ‌ర్ నే ఇలా ప్లాన్ చేస్తుందంటే?ట్రైల‌ర్ మ‌రింత ప్ర‌తిష్టాత్మ‌కంగా లాంచ్ చేసే అవ‌కాశం ఉంది.

ఈ చిత్రాన్ని అన్ని ప‌నులు పూర్తిచేసి వ‌చ్చే ఏడాది ఆగ‌స్టులో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. అమ‌ర్ కౌశిక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న చిత్రాన్ని దినేష్ విజ‌న్ నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం శ్ర‌ద్దాక‌పూర్ దృష్టంతా ఈ సినిమాపైనే ఉంది.

ఆమె మెయిన్ లీడ్ కావ‌డంతో ఎక్కువ రోజులు కాల్షీట్లు కేటాయించింది. ఈ నేప‌థ్యంలో ఇత‌ర సినిమాల‌కు డేట్లు కేటాయించ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో కొత్త అవ‌కాశాలు చేజారిపోతున్నాయని తెలుస్తోంది.