Begin typing your search above and press return to search.

డైరెక్ట్ గా పెద్ద రికార్డులనే బ్లాస్ట్ చేస్తోన్న స్త్రీ దెయ్యం

శ్రద్ధా కపూర్ లీడ్ రోల్ లో నటించిన బాలీవుడ్ మూవీ స్త్రీ2 వరల్డ్ వైడ్ గా సూపర్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

By:  Tupaki Desk   |   28 Aug 2024 10:07 AM GMT
డైరెక్ట్ గా పెద్ద రికార్డులనే బ్లాస్ట్ చేస్తోన్న స్త్రీ దెయ్యం
X

శ్రద్ధా కపూర్ లీడ్ రోల్ లో నటించిన బాలీవుడ్ మూవీ స్త్రీ2 వరల్డ్ వైడ్ గా సూపర్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా ఈ ఏడాది హిందీలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా టాప్ లో నిలిచింది. కల్కి 2898ఏడీ హిందీ కలెక్షన్స్ రికార్డ్ ని ఎనిమిది రోజుల్లోనే బ్రేక్ చేసింది. మూడో వారంలోకి అడుగు పెడుతోన్న స్త్రీ మూవీ వరల్డ్ వైడ్ గా 600 కోట్ల కలెక్షన్స్ ని కేవలం 13 రోజుల్లోనే అందుకుంది. దీనిని బట్టి ఈ చిత్రానికి ఎలాంటి ఆదరణ వస్తుందో అర్ధం చేసుకోవచ్చు.

బలమైన కంటెంట్, అంతకుమించి మంచి వినోదం సినిమాలో ఉంటే ప్రేక్షకులు ఎల్లప్పుడూ ఆదరిస్తారని స్త్రీ2 మూవీ మరోసారి ప్రూవ్ చేసింది. గతంలో వచ్చిన స్త్రీ మూవీ వరల్డ్ వైడ్ గా 181 కోట్ల కలెక్షన్స్ ని అందుకుంటే దానికి సీక్వెల్ గా వచ్చిన స్త్రీ2 ఊహకి అందని స్థాయిలో కలెక్షన్స్ ప్రభంజనం సృష్టిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా నార్త్ ఇండియా మార్కెట్ లో కూడా అత్యధిక కలెక్షన్స్ అందుకునే చిత్రంగా అవతరించే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది.

హిందీ బెల్ట్ లో అత్యధిక వసూళ్లు అందుకున్న సినిమాల జాబితా చూసుకుంటే టాప్ 1లో షారుఖ్ ఖాన్ జవాన్ ఉంది. ఈ సినిమా 565 కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది. టాప్ 2లో ఉన్న పఠాన్ 525 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. మూడో స్థానంలో బాహుబలి 2 చిత్రం 511 కోట్ల కలెక్షన్స్ తో నిలిచింది. నాలుగో స్థానంలో 495 కోట్లతో రణబీర్ కపూర్ యానిమల్ ఉంది. ఐదో స్థానంలో ఉన్న కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ 435 కోట్లతో కలెక్షన్స్ సాధించింది.

ఇప్పటికే స్త్రీ మూవీ హిందీ బెల్ట్ లో 415 కోట్ల కలెక్షన్స్ ని 13 రోజుల్లో కలెక్ట్ చేసింది. కేజీఎఫ్ చాప్టర్2, యానిమల్, బాహుబలి 2 రికార్డ్ లని అయితే స్త్రీ మూవీ బ్రేక్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మూడో వారంలో కూడా నిలకడగా కలెక్షన్స్ అందుకొని వీకెండ్ లో మంచి వసూళ్లు సాధిస్తే షారుఖ్ ఖాన్ పఠాన్ కలెక్షన్స్ ని క్రాస్ చేస్తుందని భావిస్తున్నారు. జవాన్ మూవీ కలెక్షన్స్ ని అందుకోవాలంటే కనీసం నెల రోజుల పాటు నిలకడగా కలెక్షన్స్ రావాల్సి ఉంటుంది.

అయితే అదంతా ఈజీ కాకపోవచ్చని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఇక ఓవరాల్ గా ఈ మూవీ 750 కోట్లకి పైగా కలెక్షన్స్ ని అందుకునే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే బాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న చిత్రాల జాబితాలో జవాన్, పఠాన్, యానిమల్ తర్వాత స్థానాలలో స్త్రీ2 చిత్రం నిలిచే ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నారు. కేవలం 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి ఎవ్వరి అంచనాలకి అందకుండా అద్భుతమైన ప్రేక్షకాదరణతో థియేటర్స్ లో పరుగులు పెడుతోంది.