Begin typing your search above and press return to search.

త‌మ‌న్నా కావాలా వైబ్స్ మ‌ళ్లీ మ‌ళ్లీ

మిల్కీ బ్యూటీ మూవ్స్.. త‌న గ‌త‌ బ్లాక్‌బస్టర్ పాట 'కావాలా'ని గుర్తుకు తెస్తున్నాయి. ట్రైలర్‌లో తమన్నా స‌ర్‌ప్రైజ్ ట్విస్ట్ ఉత్కంఠ క‌లిగించింది.

By:  Tupaki Desk   |   19 July 2024 4:30 PM GMT
త‌మ‌న్నా కావాలా వైబ్స్ మ‌ళ్లీ మ‌ళ్లీ
X

రాజ్‌కుమార్ రావ్ - శ్రద్ధా కపూర్ నటించిన స్ట్రీ 2 ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. హారర్ కామెడీ జాన‌ర్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ స్త్రీకి సీక్వెల్ ఇది. పార్ట్ 2 రాక కోసం ప్రతి ఒక్కరూ చాలా ఉత్సాహంగా వేచి చూస్తున్నారు. ట్రైల‌ర్ లో మొండెం లేని భూతం రాజ్‌కుమార్ రావుని ఎందుకు వెంబ‌డించింది? అన్న‌ది తెర‌పైనే చూడాలి. 'భూత‌ప్రేత‌ స్నేహితురాలు'గా శ్రద్ధ క‌పూర్ ఈ చిత్రంలో న‌టించింది. ఆరంభం ఎంత స‌ర‌దాగా ఉంటుందో జీవితంలో టెర్ర‌ర్ అదే రేంజులో ప్ర‌వేశిస్తుంది. భూతంతో స్నేహం ఏ దిశ‌గా దారి తీసింది? అన్నది తెలియాలంటే ఆగ‌స్టు 15 వ‌ర‌కూ ఆగాల్సిందే.

స్ట్రీ 2 ట్రైలర్‌లో శ్ర‌ద్ధా క‌పూర్ అంద‌చందాలు మాత్ర‌మే కాదు.. తమన్నా భాటియా వేడెక్కించే హొయ‌లు కూడా ప్రత్యేకంగా ఆక‌ర్షించాయి. ట్రయిలర్ చివరలో త‌మ‌న్నా పెప్పీ నంబర్ లో ఎంతో రొమాంటిక్ గా క‌నిపించింది. ఆకుపచ్చ రంగు బ్రాలెట్ - స్కర్ట్‌తో ఆకర్షణీయంగా కనిపించింది. తమన్నా యూనిక్ మూవ్స్‌తో స్క్రీన్ పై మంట‌లు పెట్ట‌డం ఖాయ‌మ‌ని భ‌రోసానిచ్చింది. మిల్కీ బ్యూటీ మూవ్స్.. త‌న గ‌త‌ బ్లాక్‌బస్టర్ పాట 'కావాలా'ని గుర్తుకు తెస్తున్నాయి. ట్రైలర్‌లో తమన్నా స‌ర్‌ప్రైజ్ ట్విస్ట్ ఉత్కంఠ క‌లిగించింది. మిల్కీ ఐటెమ్ నంబర్ యూత్ కి స్పెష‌ల్ ట్రీట్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

స్ట్రీ 2018లో విడుదలైంది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద వాణిజ్యపరంగా విజయం సాధించింది. మిలేగీ మిలేగీ .. ఆవో కభీ హవేలీ పే ర్యాగింగ్ చార్ట్‌బస్టర్‌లుగా మారడంతో ఈ చిత్రం సంగీతం కూడా చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ఇందులో ప్ర‌త్యేక పాట క‌మారియాలో నోరా ఫతేహి డ్యాన్స్ ప్ర‌ద‌ర్శ‌నను ప్రేక్షకులు ఎప్ప‌టికీ ప్రేమగా గుర్తుంచుకుంటారు.

ఇప్పుడు స్త్రీ 2 చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్నారు. దినేష్ విజన్ మాడాక్ ఫిల్మ్స్ - జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. స్త్రీ, రూహి, భేదియా చిత్రాల శ్రేణిలో అదే నిర్మాత‌ రూపొందించిన‌ హార‌ర్-కామెడీ విశ్వంలో ఒక భాగం. స్ట్రీ 2 చిత్రం 15 ఆగస్ట్ 2024న థియేటర్లలో విడుదల కానుంది.