ఘట్టమనేని రమేష్ బాబు నటవారసుడు బరిలోకి
సూపర్ స్టార్ల కుటుంబం నుంచి ఇప్పుడు సినీరంగ ప్రవేశం చేస్తున్న జయకృష్ణ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇది మైండ్ బ్లాక్ చేస్తోంది.
By: Tupaki Desk | 19 Aug 2024 11:47 AM GMTఘట్టమనేని కుటుంబం నుంచి ఒక హీరో సినీపరిశ్రమకు పరిచయం అవుతున్నాడు అంటే అభిమానుల్లో చాలా అంచనాలుంటాయి. సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా మహేష్ బాబు తన తండ్రి లెగసీని విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. స్టార్ డమ్ అనే పదానికి నేడు మహేష్ ఒక నిర్వచనం. మునుముందు పాన్ ఇండియన్ స్టార్ డమ్ కి సింబాలిక్ గా మారుతున్నాడు.
ఇలాంటి సమయంలో ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో హీరో బరిలోకి వస్తే అతడు మహేష్ తర్వాతి తరంలో లెగసీని ముందుకు నడిపించాల్సి ఉంటుంది. అయితే కృష్ణ- మహేష్ అంతటి అందగాళ్లు రావాలి కదా? మళ్లీ మహేష్ వారసుడు గౌతమ్ కృష్ణ ఘట్టమనేని బరిలో దిగితే కానీ ఆ బ్లాంక్ స్పేస్ అలానే ఉండిపోతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుంచి ఒక ప్రామిస్సింగ్ లుక్ ఉన్న కుర్రాడు బరిలో దిగుతుండడం ఆసక్తిని కలిగిస్తోంది.
సూపర్ స్టార్ల కుటుంబం నుంచి ఇప్పుడు సినీరంగ ప్రవేశం చేస్తున్న జయకృష్ణ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇది మైండ్ బ్లాక్ చేస్తోంది. అతడి డేగ కళ్లు, షార్ప్ నోస్ చూడగానే సూపర్ స్టార్ కృష్ణ గుర్తుకు వస్తున్నారు. చురుకైన హావభావాలు అతడిలో ఉన్నాయి. ఇంకా నూనూగు మీసాల టీనేజీ కుర్రాడు కనుక ఆ లేత వయసును ఈ ఫోటోషూట్ దాచలేకపోయింది. ఆరంభం తన వయసుకు తగ్గ పాత్రలను ఎంపిక చేసుకుని ఈ నూనూగు మీసాల యువహీరో ముందుకు సాగుతాడని భావిస్తున్నారు. తాజాగా వెలువడిన అధికారిక ప్రకటన సారాంశం ఇలా ఉంది.
''జయ కృష్ణ ఘట్టమనేని తన సినీ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నారు. అతడి లేటెస్ట్ ఫోటో షూట్ .. ఎదురు చూస్తున్న అభిమానుల కోసం.. యువకుడు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాడు... ఊజింగ్ స్వాగ్...!'' అంటూ అతడి లుక్ ని టీమ్ పరిచయం చేసింది. జయకృష్ణ నటించే తొలి సినిమా వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ప్రస్తుతానికి అతడి రూపం అందరి హృదయాల్లోకి దూసుకెళ్లింది. జయకృష్ణ హీరో మెటీరియల్ అంటూ ప్రశంసిస్తున్నారు. తన లుక్ కి తగ్గట్టే మంచి ప్రేమకథల్ని ఎంపిక చేసుకుని ముందుకు సాగుతాడని అంచనా వేస్తున్నారు.
మహేష్ బాబు అన్నయ్య, దివంగత రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ. ఈ యంగ్ బోయ్ సినీరంగ ప్రవేశంపై కొంత కాలంగా టాక్ వినిపిస్తూనే ఉంది. నిజానికి రమేష్ బాబు కూడా నటుడు అన్న విషయం తెలిసినదే. 1980-1990లలో కథానాయకుడిగా రెండు సినిమాలు చేసారు. అయితే ఆయన కాలక్రమంలో నటనకు దూరమయ్యాడు. రమేష్ బాబు పద్మాలయా స్టూడియోస్ ప్రొడక్షన్ హౌస్ ని చూసుకున్నారు. ఫిల్మ్ ప్రొడక్షన్స్, సినిమా స్టూడియోలను నిర్వహించారు. తెరపై యాక్టివ్‌గా లేకపోయినా ఇండస్ట్రీతో ఎప్పుడూ ఇన్వాల్వ్ అయ్యేవారు. అతడికి ఇద్దరు పిల్లలు (కుమారుడు కుమార్తె) ఉన్నారు. భార్య పేరు మృధుల.
రమేశ్‌బాబు మరణించిన సమయంలోనే వారసుడు జయకృష్ణను ప్రపంచం చూసింది. జయకృష్ణ తన తండ్రి, బాబాయ్ మహేష్ బాబు లాగా చక్కని ఒడ్డు పొడుగుతో ఛరిష్మాటిక్ గా కనిపించాడు. మంచి లుక్ ఉన్న యువకుడు. అతడు USA లో నటనా కోర్సును అభ్యసించాడని.. తన విద్యను పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్ కి తిరిగి వచ్చాడని కూడా తెలిసింది.