పొట్టి నిక్కరులో జివ్వుమనిపించిన మ్యాడం!
తాజాగా అమ్మడు నిక్కరులో సెగలు పుట్టించే పని పెట్టుకుంది. ఇదిగో ఇక్కడిలా బ్లూ డెనిమ్ జీన్స్ పై మ్యాచింగ్ వైంట్ అండ్ షర్ట్ ధరించింది.
By: Tupaki Desk | 5 Aug 2024 2:31 PM GMTఫ్యాషన్ వరల్డ్ లో ముంబై బ్యూటీ పూజాహెగ్డే ఓ స్పెషలిస్ట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అమ్మడి ఎంపికలు అమెలో బ్యూటీని అంతకంతకు హైలైట్ చేస్తుంటాయి. కటౌట్ కి తగ్గట్టు సొగసరి ఎంపిక చేసుకునే దుస్తులే అందాన్ని రెట్టింపు చేస్తుంటాయి. హైట్..వెయిట్ కి తగ్గట్టు అలంకరణ విషయంలో ఎంతో శ్రద్ద తీసుకుంటుంది. డిజైనర్ దుస్తులైనా...సంప్రదాయ వస్త్రాలైనా బుట్ట బొమ్మ ధరించిందంటే ఆ దుస్తులకే వన్నె వచ్చేస్తుంది.
తాజాగా అమ్మడు నిక్కరులో సెగలు పుట్టించే పని పెట్టుకుంది. ఇదిగో ఇక్కడిలా బ్లూ డెనిమ్ జీన్స్ పై మ్యాచింగ్ వైంట్ అండ్ షర్ట్ ధరించింది. తలపై హ్యాట్ పెట్టుకుంది. చంకలో డ్రెస్ ని మ్యాచ్ చేస్తూ గ్రీన్ కలర్ హ్యాండ్ బ్యాంగ్ చూడొచ్చు. బ్యాక్ గ్రౌండ్ సైతం బ్యూటీని మరింత అందంగా ప్రొజెక్ట్ చేస్తుంది. పాత భవంతి ప్రధాన ద్వారం గ్రీన్ కలర్. ఆ పక్కనే ముళ్లతో కూడిన పచ్చని అడవి మొక్కలు.
అదే స్పాట్ లో అమ్మడు స్టాండింగ్ పొజిషన్ లో వివిధ భంగిమల్లో కెమెరాకి ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మ్యాడం జీన్స్ లుక్ కి నెటి జనులంతా ఫిదా అవుతున్నారు. అమ్మడి అందాన్ని పొగిడేస్తూ లుక్స్ గార్జియస్, బ్యూటీ కూల్ లుక్ అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
ఇక పూజా కెరీర సంగతి చూస్తే..టాలీవుడ్ నుంచి ఎంత సాలిడ్ గా వెళ్లిందో? అంతే సాలిడ్ గా అమ్మడు సౌత్ లో కంబ్యాక్ అవుతోన్న విషయం తెలిసిందే. యువ సామ్రాట్ నాగచైతన్య సరసన ఓ కొత్త సినిమాకి ఇటీవలే సంతకం చేసింది. అతి త్వరలోనే ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. అలాగే కోలీవుడ్ లో సూర్య 44వ చిత్రంలోనూ పూజ అవకాశం అందుకుంది. ఇలా వరుసగా రెండు సినిమాల్లో ఛాన్సులు అందుకోవడం అన్నది చాలా ఈజీగానే జరిగింది.