Begin typing your search above and press return to search.

టీవీ న‌టితో శుభ్‌మాన్ పెళ్లి.. అదీ సంగ‌తి?

తన ఇన్‌స్టాలో (ఇప్పుడు తొలగించబడింది) రిద్ధిమ‌ పండిట్ ఇలా పేర్కొంది.

By:  Tupaki Desk   |   1 Jun 2024 10:03 AM GMT
టీవీ న‌టితో శుభ్‌మాన్ పెళ్లి.. అదీ సంగ‌తి?
X

తన ఇన్‌స్టాలో (ఇప్పుడు తొలగించబడింది) రిద్ధిమ‌ పండిట్ ఇలా పేర్కొంది. ``జర్నలిస్టుల నుండి చాలా కాల్స్ వ‌స్తుంటే నేను మేల్కొన్నాను. ఇలా ఎప్పుడూ జరగలేదు. చాలా మంది నా షాదీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు.. కానీ ఎవరిని పెళ్లాడుతాను? లేదు .. ఏం జరగడం లేదు. కుచ్ హోగా తో మెయిన్ బటా దుగీ సామ్నే సే (నా జీవితంలో అలాంటిదేమైనా జరిగితే నేనే దానిని చెబుతాను).. అని తెలిపింది.

ఇది ఎవరో ఊహించిన‌ట్టుగా ఉంది. నాకు వ్యక్తిగతంగా శుభమాన్ గిల్ గురించి అస‌లేమీ తెలియదు. ఇది హాస్యాస్పదంగా ఉంది! అని రిద్ధిమ పేర్కొంది. అయితే ఈ పుకార్ నేప‌థ్యంలో త‌న‌ను ఫోన్ చేసి అడిగేవాళ్లే కాదు... అభినందన సందేశాలతో ముంచెత్తేవాళ్లు ఎక్కువ‌య్యార‌ని చెబుతోంది. నాకు అభినందన సందేశాలు రావడం చూసి వాటిని తిరస్క‌రించ‌లేక విసిగిపోయాను అని రిద్ధిమ వెల్ల‌డించింది. అందుకే నేను సోషల్ మీడియాలో క్లారిఫై చేయాలని నిర్ణయించుకున్నాను! అని వివరించింది.

నేను ఒంటరిగా ఉన్నాను..పెళ్లి చేసుకుని ఏదో ఒక రోజు స్థిరపడాలనుకుంటున్నాను.. ఈలోగానే న‌న్ను ఇలా భ‌య‌పెట్టొద్దు! అని వేడుకుంది రిద్ధిమ‌. రిద్ధిమ‌ భారతీయ టెలివిజన్ ప‌రిశ్ర‌మ‌లో ప్రముఖ వ్యక్తి. బహు హుమారీ రజనీ కాంత్ చిత్రంలో తన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్‌లో `ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 9` వంటి రియాలిటీ షోలలో కూడా కనిపించింది. ఆమె `హమ్ - ఐయామ్ బిసి అస్`, `హైవాన్: ది మాన్‌స్టర్` వంటి షోలలో కూడా అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో ఆక‌ట్టుకుంది.