Begin typing your search above and press return to search.

సుబ్రహ్మణ్యుడి ఆగమనం.. వేరే లెవల్

యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ గుణ 369 సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న వీరు.. ఇప్పుడు భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.

By:  Tupaki Desk   |   31 Aug 2024 7:22 AM GMT
సుబ్రహ్మణ్యుడి ఆగమనం.. వేరే లెవల్
X

టాలీవుడ్ ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, ఫిల్మ్ మేకర్ పి.రవిశంకర్.. తన కుమారుడు అద్వయ్ ను హీరోగా పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. సుబ్రహ్మణ్య టైటిల్ తో తెరకెక్కుతున్న ఆ సినిమాను ఎస్‌ జీ మూవీ క్రియేషన్స్ బ్యానర్‌ పై తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ గుణ 369 సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న వీరు.. ఇప్పుడు భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.


సోషియో ఫాంటసీ అడ్వెంచరెస్ జానర్‌ లో వస్తున్న సుబ్రహ్మణ్య మూవీని ప్రవీణ కడియాల, రామలక్ష్మి సమర్పిస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్.. మంచి రెస్పాన్స్ అందుకుంది. సినిమాలో డివోషనల్ ఎలిమెంట్స్ ఫుల్ గా ఉన్నాయని అప్పుడే క్లారిటీ వచ్చేసింది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంతోపాటు నెమలిని చూస్తే అర్థం అయిపోయింది. అద్వయ్ స్టైలిష్, డైనమిక్‌ గా కనిపించారు.

తాజాగా మేకర్స్ మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ప్రీ లుక్ పోస్టర్ ను షేర్ చేశారు. ఫాంటసీ, మిస్టరీ, మేజిక్ వరల్డ్.. ప్రతి అడుగు కొత్త రహస్యాన్ని కలిగి ఉంటుందని పోస్ట్ చేశారు. ఆడియన్స్ కు సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది పోస్టర్. చేతిలో కాగడా పట్టుకుని.. ప్రవేశ ద్వారం వద్ద నిల్చుని అద్వయ్ కనిపిస్తున్నారు. అయితే లేటెస్ట్ పోస్టర్ ద్వారా మూవీలో క్వాలిటీ ఆర్ట్ వర్క్ ఉంటుందని ఈజీగా అర్థమవుతుంది. సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయని నెటిజన్లు చెబుతున్నారు.

ప్రీమియం లార్జ్ ఫార్మాట్ తోపాటు ఐమ్యాక్స్ థియేటర్లలో ప్రేక్షకులకు మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ను అందించడానికి ఈ చిత్రాన్ని భారీగా చిత్రీకరిస్తున్నారు మేకర్స్. హైఎండ్ VFXతో కూడిన ఈ గ్రాండ్ ప్రాజెక్ట్ విజువల్ అండ్ ఎమోషనల్ ట్రీట్‌ గా అలరించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకున్న మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముంబైలోని

ప్రముఖ రెడ్ చిల్లీస్ స్టూడియోలో శరవేగంగా జరుగుతున్నాయి.

ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని పలు ఫేమస్ స్టూడియోల్లో VFX & CGI వర్క్ చేస్తున్నారు మేకర్స్. కేజీఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. విఘ్నేష్ రాజ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. విజయ్ ఎం కుమార్ ఎడిటర్ గా, చార్లీ 777 ఫేమ్ ఉల్లాస్ హైదూర్ ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. సుబ్రహ్మణ్య మూవీ పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. మరి ఈ విజువల్ వండర్ ఎలా ఉంటుందో చూడాలి.