Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా ''సుబ్రహ్మణ్య''.. హై వోల్టేజ్ లుక్

అందులోనూ రవి శంకర్ మొదటిసారి దర్శకత్వం వహించడం మరింత హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   7 Sep 2024 3:46 PM GMT
పాన్ ఇండియా సుబ్రహ్మణ్య.. హై వోల్టేజ్ లుక్
X

టాలెంటెడ్ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ పి. రవిశంకర్ తన కుమారుడు అద్వయ్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న చిత్రం సుబ్రహ్మణ్య. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన అనేక రకాల విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులోనూ రవి శంకర్ మొదటిసారి దర్శకత్వం వహించడం మరింత హాట్ టాపిక్ గా మారింది.


ఈ సోషియో-ఫాంటసీ అడ్వెంచర్‌ను ఎస్‌జీ మూవీ క్రియేషన్స్ పతాకంపై తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ప్రీ లుక్‌కి మంచి స్పందన రావడంతో, వినాయక చవితి సందర్భంగా చిత్ర బృందం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించింది. ఈ పోస్టర్‌ను కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ శివ రాజ్‌కుమార్ విడుదల చేశారు.

అద్వయ్ ప్రధాన పాత్రలో సుబ్రహ్మణ్యగా కనిపిస్తున్న ఈ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పొడవైన జుట్టు, గడ్డంతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన కాస్ట్యూమ్‌లో అద్వయ్ చాలా హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నారు. అతని కళ్లలో కనిపించే తీవ్రత ఆయన పాత్ర సీరియస్‌గా ఉంటుందని సంకేతాలు ఇస్తోంది. అడవిలో మిస్టీరియస్ ప్లేస్ వద్ద, కొందరు గుండాలతో ఉన్న సన్నివేశం ఈ సినిమా కథకు సంబంధించిన సస్పెన్స్‌ను మరింత రేకెత్తిస్తోంది.

సినిమా నిర్మాణంలో ఇప్పటికే 60% షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ముంబైలోని రెడ్ చిల్లీస్ స్టూడియోలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. ప్రముఖ స్టూడియోల్లో ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లలో వీఎఫ్ఎక్స్ మరియు సీజీఐ పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి.

ఈ సినిమా సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో నిర్మించబడుతున్నట్లు మేకర్స్ తెలిపారు. రవిబస్రూర్ (కేజీఎఫ్, సలార్) సంగీతం అందిస్తుండగా, విజ్ఞేష్ రాజ్ ఛాయాగ్రహణం, విజయ్ ఎం కుమార్ ఎడిటింగ్ మరియు ఉల్లాస్ హైడూర్ ప్రొడక్షన్ డిజైన్‌ చేపట్టారు. కేవలం ఒక భాషలోనే కాకుండా తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో సుబ్రహ్మణ్య విడుదలకు సిద్దమవుతోంది.