స్కామ్ 2010 బయోపిక్.. స్నేహితుల మధ్య లొల్లి!
స్కామ్ 1992కి దర్శకత్వం వహించిన హన్సల్ మెహతా స్కామ్ 2010కి దర్శకత్వం వహిస్తారు.
By: Tupaki Desk | 19 May 2024 1:30 AM GMTరెండు రోజుల క్రితం, స్కామ్ 2010 - ది సుబ్రతా రాయ్ సాగా ప్రకటన వీడియో విడుదలైంది. సహారా ఇండియా కుంభకోణంపై చిత్రం కావడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. స్కామ్ 1992కి దర్శకత్వం వహించిన హన్సల్ మెహతా స్కామ్ 2010కి దర్శకత్వం వహిస్తారు. ఈ ప్రకటన సిరీస్ అభిమానులలో చాలా ఉత్సాహాన్ని పెంచింది.
కానీ ఇంతలోనే దీనిపై వివాదం చెలరేగింది. సందీప్ సింగ్ అనే వ్యక్తి దీనికి కారకుడు. సుబ్రతా రాయ్ జీవితంపై సినిమా తీసే హక్కులు తనకు మాత్రమే ఉన్నాయని ఆయన ప్రకటించారు. నిజానికి గతేడాది తన పుట్టినరోజున సహరశ్రీ పేరుతో సుబ్రతారాయ్ బయోపిక్‌ని సందీప్ సింగ్ ప్రకటించాడు. అందువల్ల `స్కామ్ 2010 - ది సుబ్రతా రాయ్ సాగా` ప్రకటనతో షాక్‌కు గురైన అతడు హన్సల్ మెహతా, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాత సమీర్ నాయర్ - స్ట్రీమింగ్ దిగ్గజం సోనీ LIVపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు పాపులర్ బాలీవుడ్ హంగామా తన కథనంలో ప్రచురించింది.
ప్రఖ్యాత బాలీవుడ్ హంగామాతో ప్రత్యేకంగా మాట్లాడిన సందీప్ సింగ్ చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ''దర్శకుడు హన్సల్ మెహతా నాకు మంచి స్నేహితుడు. మేమిద్దరం కలిసి అలీఘర్ (2016) సినిమాకి పనిచేశాం. అతడు నెగెటివ్ మనిషి కాబట్టి నెగెటివ్ కథలను ఎంచుకునే సత్తా అతనికి ఉంది. మేం తీయాల్సిన బయోపిక్ కథతో అతడు నెగెటివ్ సినిమా తీస్తున్నాడు. ఏదో ఒక రోజు అతడి కర్మ అతడికి ఖచ్చితంగా సమాధానం ఇస్తుంది. అతని కర్మ ఇప్పటికే నెమ్మదిగా సమాధానం ఇస్తూనే ఉంది...'' అని నర్మగర్భంగా వ్యాఖ్యానించాడు.
సందీప్ మాట్లాడుతూ, ``హన్సల్ మెహతా సహా అందరికీ ఇది తెలుసు.. నేను గత సంవత్సరం సహశ్రీని ప్రకటించాను. నేను 2019 నుండి ఈ చిత్రం కోసం పని చేస్తున్నాను. అయినప్పటికీ అతడు దీనిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లి ప్రకటన చేసాడు. మేము తీస్తున్నది కుంభకోణంతో కూడుకున్న కథతో అని అతడికి తెలుసు. అలా చేసే హక్కు అతనికి ఎవరు ఇచ్చారో నాకు తెలియదు. ఇది డబ్బు సంపాదించే రాకెట్.. అతడు స్కామ్ సిరీస్ ద్వారా దీన్ని ఖచ్చితంగా చేయాలని అనుకుంటున్నాడు. అందుకు దేవుడు అతడిని ఆశీర్వదిస్తాడు. కానీ నేను లేదా సహారా ఇండియా పరివార్ నిద్రపోవడం లేదు. మేం కోర్టుకు వెళ్తున్నాం. మేం దర్శకుడు, ప్రొడక్షన్ హౌస్, ఛానెల్‌కు వ్యతిరేకంగా వెళ్తాము. సుబ్రతా రాయ్ అధికారిక హక్కులు మా వద్ద నా బ్యానర్ లెజెండ్ స్టూడియోస్ వద్ద ఉన్నందున మేము వారి షూట్ ను ఆపడానికి ప్రయత్నిస్తాము.. అని అన్నారు.
``నేను మిస్టర్ సుబ్రతా రాయ్‌ని లంచ్‌లో కలిశాను. అతనిపై సినిమా తీయడానికి జీవితకథపై హక్కులను పొందాలనే కోరికను వ్యక్తం చేసాను. భోజనం తర్వాత నేను నా జీవితంపై సినిమా తీసే హక్కులను ఇవ్వాలని నిర్ణయించుకుంటే అది నీకే అవుతుంది`` అని మాటిచ్చారు. మీరు డబ్బు సంపాదించడానికి ఇక్కడకు రాలేదు. తప్పుడు కథనాన్ని ఇవ్వడానికి మీరు ఇక్కడకు రాలేదు .. కాబట్టి మీకే హక్కులు ఇస్తాను అని అన్నారు. నిర్మాత సందీప్ సింగ్ బయోపిక్ కోసం తన పరిశోధన గురించి మాట్లాడుతూ .. నేను తీహార్ జైలు అధికారులు, న్యాయవాదులు, కపిల్ దేవ్, అఖిలేష్ యాదవ్, వీరేంద్ర సెహ్వాగ్, పరిశ్రమలోని వారితో సహా అతడి స్నేహితులను కలిశాను. వారు అతని గురించి ఏమి చెప్పారో రికార్డ్ చేసాను. నటీనటుల ఎంపికపై కూడా పనిచేశాం. ఆ తర్వాత సుబ్రతోరాయ్ చనిపోయారు. అది మమ్మల్ని కదిలించింది. పనులు నిలిచిపోయాయి. నిన్న హన్సల్ నుంచి ప్రకటన వీడియో చూసినప్పుడు మేమంతా షాక్ కి గురయ్యాము... అని అన్నారు.
సమీర్ నాయర్ నన్ను, నా డైరెక్టర్ (సుదీప్తో సేన్)ని కొన్ని నెలల క్రితం తన కార్యాలయానికి పిలిచారు. సుబ్రతా రాయ్ జీవితంపై మాకు హక్కులు ఉన్నాయి కాబట్టి స్కామ్ తదుపరి సీజన్‌ను మాతో చేయమని ఆయన మాకు ప్రతిపాదించారు. మేము ఆఫర్‌ను తిరస్కరించాము. అతడిది స్కామ్ కథ కాదని మేం చెప్పాము. మీరు ప్రతిపాదనతో అసౌకర్యంగా ఉంటే చింతించకండి! అని అతడు చెప్పాడు. అయినా కానీ కొన్ని నెలల తర్వాత, వారు స్కామ్ 2010ని ప్రకటించడం ద్వారా మమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేశారు. మమ్మల్ని మోసం చేశారు. కానీ వారికి అతి త్వరలో మా నుండి సమాధానం వస్తుంది. వారు వెనక్కి తగ్గేలా చూస్తాము.. అంటూ హెచ్చరించారు.
హన్సల్ మెహతా- సమీర్ నాయర్ నాకు 15 సంవత్సరాలకు పైగా తెలుసు. వారు ఫోన్ చేసి, ``మేము స్కామ్ 2010తో ముందుకు వెళ్తున్నాము. అది సరేనా?`` అని అడిగారు. హక్కులు నా దగ్గర ఉన్నాయని వారికి తెలుసు అని కూడా అన్నారు. ఈ విషయం తనకు బాధ కలిగించిందని సందీప్ సింగ్ అన్నారు
కేసు ఇంకా కోర్టులో ఉండగానే..!
హన్సల్ మెహతా- అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ భారత సుప్రీంకోర్టు కంటే ఘనత వహించిన వారా? గత 10 ఏళ్లలో సుప్రీంకోర్టు కూడా తేల్చనప్పటికీ ఇది స్కామ్ అని వారు నిర్ధారించారు. కేసు ఇంకా నడుస్తోంది. అయినా పబ్లిసిటీ చేసి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ ప్రకటన చేశారు. స్నేహితులను మోసం చేయడం వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు కథలు చెప్పడం వల్ల బాలీవుడ్ విఫలమైంది! అని సందీప్ అన్నాడు. మేము తీసే సినిమా కోసం ఒక నటుడిని ఎంచుకున్నాము. సరైన సమయం వచ్చినప్పుడు అధికారికంగా ప్రకటిస్తాం. ఈలోగా హన్సల్ చీప్ పబ్లిసిటీపై పోరాడతాం. నిజానికి ఇది కఠినమైన యుద్ధం. ఇతర వ్యాపారవేత్తల వలె భారతదేశం నుండి ఎన్నడూ పారిపోని వ్యక్తి సుబ్రతోరాయ్. అందరూ ఎగిరిపోయారు కానీ అతడు అలా చేయలేదు. పట్టుబడగానే సుప్రీంకోర్టుకు వెళ్లాడు. జైలుకెళ్లి బయటకు వచ్చాడు.. అని సందీప్ సింగ్ తెలిపారు. సహారా ఇండియా గ్రూప్ భారత రైల్వేస్ తర్వాత లక్షల్లో ఉద్యోగాలిచ్చిన సంస్థ అన్నది గుర్తుంచుకోవాలని కూడా సందీప్ సింగ్ అన్నారు.