కల్కి సక్సెస్.. నెక్స్ట్ ఆ సినిమాపైనే అందరి ఫోకస్..
ఇదిలా ఉంటే ఈ కల్కి మూవీ కారణంగా ఇప్పుడు బిటౌన్ లో సూర్య చేయబోయే కర్ణ సినిమా గురించి చర్చ మొదలైంది.
By: Tupaki Desk | 28 Jun 2024 6:31 AM GMTకల్కి 2898ఏడీ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చి ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా సక్సెస్ తో మైథలాజికల్ కథలని ప్రేక్షకులు చూడటానికి ఇష్టపడుతున్నారని ప్రూవ్ అయ్యింది. పుస్తకాలలో ఉన్న కథలని వక్రీకరించకుండా అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ జోడించి తెరపై ఆవిష్కరిస్తే ఆదరించడానికి ఆడియన్స్ సిద్ధంగా ఉన్నారు. అందరికి తెలిసిన కథలే అయిన ఈ జెనరేషన్ హీరోలతో టెక్నాలజీ ఉపయోగించుకొని మైథాలజీ స్టోరీస్ చెప్పొచ్చు అని కల్కి 2898ఏడీ ప్రూవ్ చేసింది.
నాగ్ అశ్విన్ కల్కి 2898ఏడీ చిత్ర కథాంశాన్ని మైథాలజీ ఎలిమెంట్స్, క్యారెక్టర్స్ ఉపయోగించుకొని ఫ్యూచరిస్టిక్ మూవీగా ఆవిష్కరించారు. ఓ విధంగా చెప్పాలంటే కల్కి మూవీ మైథాలజీ కమ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా వచ్చింది. ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ వీకెండ్ వరకు పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ ఉండొచ్చని భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ కల్కి మూవీ కారణంగా ఇప్పుడు బిటౌన్ లో సూర్య చేయబోయే కర్ణ సినిమా గురించి చర్చ మొదలైంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా సూర్య హీరోగా కర్ణ మూవీ చేయనున్నట్లు ఎనౌన్స్ చేశారు. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని ఏకంగా 350 కోట్ల బడ్జెట్ తో నిర్మించడానికి సిద్ధమైంది. ఈ చిత్రంలో ద్రౌపది పాత్రలో జాన్వీ కపూర్ ని ఖరారు చేశారంట. అయితే ఈ సినిమాని ఎనౌన్స్ చేసి ఏడాది అవుతోన్న ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు.
కల్కి సినిమాలో కురుక్షేత్రం ఎపిసోడ్ లో ప్రభాస్ కర్ణుడి పాత్రలో కొద్దిసేపు కనిపించాడు. ఈ సీక్వెన్స్ కి పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓ విధంగా చెప్పాలంటే విజిల్స్ పడ్డాయి. దీనిని బట్టి అర్జునుడి కంటే కర్ణుడి పాత్రకి ప్రజలు ఎక్కువగా కనెక్ట్ అయ్యారని అర్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సూర్య హీరోగా రాబోయే కర్ణ సినిమాకి పబ్లిక్ నుంచి ఇంతే రెస్పాన్స్ వస్తుందని అంచనా వేస్తున్నారు.
సూర్య కంగువ మూవీతో అక్టోబర్ 10న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ తర్వాత కర్ణ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. మరి కర్ణుడి పాత్రలో సూర్య ఏ మేరకు మెప్పిస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అలాగే బాలీవుడ్ లో కూడా అశ్వత్థామ కథకు సంబంధించిన కథ చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు సరైన క్లారిటీ రాలేదు కానీ ఒక స్టార్ తోనే ఆ క్యారెక్టర్ ను ఎలివేట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.