Begin typing your search above and press return to search.

నా భ‌ర్త సినిమాలు జీర్ణించుకోలేక‌పోయాను.. సూప‌ర్‌స్టార్ వైఫ్‌..!

త‌న భ‌ర్త న‌టించిన అన్ని సినిమాల‌ను తాను మెచ్చుకోన‌ని, న‌చ్చ‌క‌పోతే న‌చ్చ‌లేద‌ని చెప్పేస్తాన‌ని వ్యాఖ్యానించారు సుచిత్ర మోహ‌న్ లాల్

By:  Tupaki Desk   |   12 Nov 2024 2:30 AM GMT
నా భ‌ర్త సినిమాలు జీర్ణించుకోలేక‌పోయాను.. సూప‌ర్‌స్టార్ వైఫ్‌..!
X

త‌న భ‌ర్త న‌టించిన అన్ని సినిమాల‌ను తాను మెచ్చుకోన‌ని, న‌చ్చ‌క‌పోతే న‌చ్చ‌లేద‌ని చెప్పేస్తాన‌ని వ్యాఖ్యానించారు సుచిత్ర మోహ‌న్ లాల్. కొన్నిటిని జీర్ణించుకోలేక‌పోయాన‌ని కూడా అన్నారు. మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్ లాల్ ప్రముఖ తమిళ ఫిలింమేక‌ర్ కె బాలాజీ కుమార్తె అయిన సుచిత్ర‌ను వివాహ‌మాడారు. ఆమె త‌న భ‌ర్త ఎంపిక‌ల‌ను స‌మీక్షిస్తారు. అత‌డు చేసే అన్ని ప‌నుల‌ను మెచ్చుకోలేన‌ని స్ప‌ష్ఠంగా అన్నారు. త‌న భ‌ర్త‌ సినిమాలు, న‌ట ప్ర‌ద‌ర్శ‌న‌లు ఎలా ఉంటాయో అభిప్రాయాలు వెల్ల‌డిస్తాన‌ని, ఈ విష‌యంలో చాలా స్ప‌ష్ఠంగా ఉంటాన‌ని సుచిత్ర‌ తెలిపారు.

``నాకు సినిమా నచ్చకపోతే న‌చ్చ‌లేద‌ని సూటిగా చెబుతాను. అతని సినిమాల్లో కొన్నిటిని నేను జీర్ణించుకోలేకపోయాను`` అని కూడా ఓ ఇంట‌ర్వ్యూలో సుచిత్ర తెలిపార‌ని మాతృభూమి క‌థ‌నంలో పేర్కొంది. ``సినిమా అనేది టీమ్ కృషి. ఫ్లాప‌వ్వాల‌ని ఎవ‌రూ ప‌ని చేయ‌రు. ఇది ఒక‌రికొక‌రు స‌హక‌రించుకునే ప్ర‌క్రియ‌. చాలా మంది కష్టానికి ఫలితం ఒక సినిమా`` అని సుచిత్ర‌ అన్నారు. తనకంటూ వ్యక్తిగత అభిప్రాయాలు ఎన్ని ఉన్నా.. ప్రతి సినిమా వెనుక సమష్టి కృషిని గౌరవిస్తానని కూడా సుచిత్ర స్పష్టం చేసారు.

మోహన్‌లాల్ 1988లో సుచిత్రను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. పెద్ద వాడు ప్రణవ్ న‌టుడు అయ్యాడు. అత‌డికి పొలం పండించ‌డం అంటే ఇష్టం. కుమార్తె విస్మయ అక‌డ‌మిక్ స్ట‌డీస్ ని కొన‌సాగిస్తున్నారు. వాలిబన్‌లో చివరిసారిగా కనిపించిన మోహన్‌లాల్ ఇప్పుడు తుడారుమ్ అనే చిత్రంలో న‌టిస్తున్నారు. ఉత్తమ మలయాళ ఫీచర్ ఫిల్మ్ `వెల్లక్క`కు దర్శకత్వం వహించిన తరుణ్ మూర్తి ఈ చిత్రానికి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. తుడారుం సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధం చేస్తున్నారు. మోహన్‌లాల్ బాలల ఫాంటసీ చిత్రం బరోజ్ నిర్మాణానంతర పనుల్లో కూడా బిజీగా ఉన్నారు. ఇది ద‌ర్శ‌కుడిగా అత‌డికి ఆరంగేట్ర చిత్రం. ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు.