భర్తను 'గే' అని పిలిచినందుకు సుచిత్ర సారీ
ఇంతలోనే ఇప్పుడు స్వలింగ సంపర్కుడిగా ముద్ర వేసినందుకు మాజీ భర్త కార్తీక్ కుమార్‌కు గాయని సుచిత్ర బహిరంగంగా క్షమాపణలు చెప్పింది.
By: Tupaki Desk | 15 Aug 2024 3:30 PM GMTగాయని సుచిత్ర వివాదాల గురించి పరిచయం అవసరం లేదు. కొన్నేళ్ల క్రితం 'సుచీ లీక్స్' పేరుతో కోలీవుడ్ సెలబ్రిటీల చీకటి కోణాలను బయటపెట్టింది. అయితే సుచిత్రకు మానసిక రుగ్మతలు ఉన్నాయంటూ ఆరోపణలు వచ్చాయి. అప్పటికే సుచిత్ర తన భర్త కార్తీక్ నుంచి దూరమైంది. అతడితో తీవ్రంగా ఘర్షణ పడింది. ఒక మీడియా ఇంటర్వ్యూలో తన మాజీ భర్త 'గే' అంటూ ఆరోపించింది. అయితే దీనిపై అతడు కోర్టుకు వెళ్లాడు. ప్రస్తుతం కోర్టుల పరిధిలో విచారణ సాగుతోంది.
ఇంతలోనే ఇప్పుడు స్వలింగ సంపర్కుడిగా ముద్ర వేసినందుకు మాజీ భర్త కార్తీక్ కుమార్‌కు గాయని సుచిత్ర బహిరంగంగా క్షమాపణలు చెప్పింది. పోలీసుల ఒత్తిడి మేరకు, ఆమె యూట్యూబ్‌లో క్షమాపణలు చెప్పింది. అతడికి ఇమెయిల్ పంపాలని యోచిస్తోంది. కెరీర్‌పై ప్రభావం చూపుతున్న ఆమె వ్యాఖ్యలపై కార్తీక్ ఇంతకుముందు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సుచిత్ర తన తప్పిదాన్ని తెలుసుకుని ఇప్పుడు క్షమాపణలు కోరింది. అతడు జీవితంలో ముందుకు సాగేందుకు రెండవ వివాహంపై దృష్టి పెట్టాలని కోరుతూ విచారం వ్యక్తం చేసింది.
సుచిత్ర తన యూట్యూబ్ ఛానెల్‌లో చెన్నై పోలీసుల నుండి నిరంతర కాల్స్ తర్వాత వీడియోను పోస్ట్ చేసింది. ఆగస్ట్ 14న సుచిత్ర తన మాజీ భాగస్వామి, హాస్యనటుడు అయిన కార్తీక్ కుమార్ కి ఇమెయిల్ ద్వారా క్షమాపణలు పంపాలని యోచిస్తున్నట్లు వెల్లడించింది. తన యూట్యూబ్ ఛానెల్‌ని నియంత్రించడానికి ఆసక్తి చూపిన పోలీసులకు సహకరించాలని తాను భావించానని సుచిత్ర వివరించింది. ఇంటర్వ్యూలలో తాను తప్పుడు వ్యాఖ్యలు చేయడంతో కార్తీక్ పట్టినంపక్కం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆమె వెల్లడించింది.
అతడి ఫిర్యాదు అనంతరం సుచిత్ర బహిరంగంగా క్షమాపణను అభ్యర్థించింది. ఇమెయిల్ ద్వారాను క్షమాపణ కోరతానని తెలిపింది. ఈ వివాదంలో గత కొన్ని వారాలుగా తనకు పోలీసుల నుంచి కాల్స్ వస్తున్నాయని, అది ఆందోళనకు గురిచేస్తోందని ఆమె వ్యాఖ్యానించింది. క్షమాపణలు చెప్పకుంటే జైలు శిక్ష తప్పదని హెచ్చరిస్తూ కేసును క్షుణ్ణంగా విచారిస్తున్నట్లు అధికారి విజయలక్ష్మి సుచిత్రకు తెలియజేశారు. తదుపరి సమస్యలను ఆపేందుకు సుచిత్ర బహిరంగ క్షమాపణలు చెప్పాలనుకుంది. కార్తీక్ కుమార్ కెరీర్‌కు హాని కలిగించినందుకు సుచిత్ర తన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేసింది. అతడి ప్రతిష్టను దెబ్బతీయాలని తాను ఎప్పుడూ అనుకోలేదని, అతడిని గౌరవప్రదమైన వ్యక్తిగా అభివర్ణిస్తూ, తన క్షమాపణ అతడి కెరీర్‌కు సహాయపడుతుందని ఆశిస్తున్నట్టు పేర్కొంది.
నేను మిమ్మల్ని స్వలింగ సంపర్కుడిగా పిలిచినందుకు క్షమించండి. మీ కెరీర్‌ను నాశనం చేయడం నాకు ఇష్టం లేదు. నిజానికి కార్తీక్ కుమార్ మంచి వ్యక్తి.. అని కితాబిచ్చింది. నా వ్యాఖ్యలు నిజంగా అతడి కెరీర్‌ను ప్రభావితం చేశాయా? అని కూడా ప్రశ్నించింది. అతడు తనపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నాడని, రెండవ వివాహంపై దృష్టి పెట్టాలని కూడా సలహా ఇచ్చింది.
కార్తీక్ కుమార్ గురించి తప్పుగా సూచిస్తూ సుచిత్ర రెండు యూట్యూబ్ ఛానెల్‌లకు ఇంటర్వ్యూలు ఇవ్వడంతో ఈ వివాదం గత మేలో మొదలైంది. ధనుష్, త్రిష, విజయ్, కమల్ హాసన్, ఆండ్రియా జెరెమియా, ఐశ్వర్య రజనీకాంత్ సహా ఇతర ప్రముఖులపైనా ఆమె ఆరోపణలు చేసింది. దీనికి ప్రతిస్పందిస్తూ కార్తీక్ కుమార్ సుచిత్రకు లీగల్ నోటీసు జారీ చేశాడు. ఆమె తన గురించి చర్చించడం మానేయాలని, తప్పుడు ప్రకటనలను ఉపసంహరించుకోవాలని నోటీసులో కార్తీక్ డిమాండ్ చేసాడు. వీడియోలను తీసివేయాలని అభ్యర్థిస్తూ పాల్గొన్న యూట్యూబ్ ఛానెల్‌లకు నోటీసులు పంపారు. సుచిత్ర- కార్తీక్ జంట 2005లో పెళ్లిచేసుకున్నారు. 2018లో విడిపోయారు.