స్టార్ హీరోయిన్ బ్రేకప్‌కి నేను కారణం కాదు!
సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింటా 'రాజకుమారుడు' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది
By: Tupaki Desk | 13 May 2024 11:24 AM GMTసొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింటా 'రాజకుమారుడు' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది. ప్రిన్స్ మహేష్ బాబుకి ఇది డెబ్యూ మూవీ. ఆ తర్వాత వెంకటేష్ తో 'ప్రేమతో రా' అనే చిత్రంలోను నటించింది. ప్రీతి అందచందాలు, నటప్రతిభకు తెలుగు యువత ఫిదా అయిపోయారు. కొన్నేళ్ల కెరీర్ తర్వాత ప్రీతి పూర్తిగా బాలీవుడ్ కే అంకితమైంది. అక్కడ స్టార్ హీరోల సరసన చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్లలో నటించింది.
కొన్నాళ్లకు విదేశీ బోయ్ ఫ్రెండ్ గూడెనఫ్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. అదంతా అటుంచితే ప్రీతి జింతా ఎఫైర్ల గురించి అప్పట్లో బోలెడంత చర్చ సాగింది. ప్రీతి గతంలో లార్స్ కెజెల్డ్ సెన్ అనే బిజినెస్ మేన్ తో ప్రేమాయణం సాగించింది. అయితే ఇంతలోనే నటి సుచిత్రా పిళ్లై కారణంగా ఈ జంట బ్రేకప్ అయిందని ప్రచారమైంది.
అయితే ఇది నిజమా? అంటే దానికి సుచిత్రా పిళ్లై తాజా ఇంటర్వ్యూలో స్పష్ఠత నిచ్చారు. 'దిల్ చాహ్తా హై'లో సైఫ్ అలీ ఖాన్ గర్ల్‌ఫ్రెండ్ పాత్రతో పాపులరైన సుచిత్రా పిళ్లై ప్రస్తుతం ది 'బ్రోకెన్ న్యూస్ 2' అనే చిత్రంలో జైదీప్ అహ్లావత్, సోనాలి బింద్రేతో కలిసి నటిస్తున్నారు. ఇటీవల తన వ్యక్తిగత జీవితంలో కొన్ని విషయాలపై అన్యాయంగా తప్పుడు ముద్ర వేయటం గురించిన అపోహలను తొలగించే ప్రయత్న చేసింది. తన ప్రస్తుత భర్త లార్స్ కెజెల్డ్సెన్తో ప్రీతి జింటా విడిపోవడానికి తాను కారణం కాదని వెల్లడించింది.
సిద్ధార్థ్ కన్నన్‌తో ఇంటర్వ్యూలో సుచిత్ర తన భర్త లార్స్ కెజెల్డ్సెన్ గతంలో ప్రీతి జింటాతో డేటింగ్ చేశాడని, అయితే వారు విడిపోవడానికి తాను అసలు కారణం కాదని పేర్కొంది. ''బాయ్‌ఫ్రెండ్ స్నాచర్'' (బోయ్ ఫ్రెండ్ ని కొట్టేసిన ఖిలాడీ) అనే భావనను కొట్టిపారేసిన సుచిత్ర ''అదంతా ఎవరో అల్లిన కథ'' అని అన్నారు. ప్రీతి .. నేను ఎప్పుడూ స్నేహితులం కాదు.. మాకు ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నందున మేము పరిచయస్తులం. అయితే లార్స్ కెజెల్డ్సెన్ ప్రీతీతో డేటింగ్ చేశాడు. ప్రీతి జింటాతో అతడు బ్రేకప్ అయిన తర్వాతే నేను అతడితో డేటింగ్ చేసాను. నేను వారి మధ్యకు రాలేదు.. వారు పూర్తిగా భిన్నమైన కారణంతో విడిపోయారు.. అని సుచిత్ర తెలిపారు.
తన విషయంలో చాలా తప్పుదారి పట్టించే ప్రచారం సాగిందని .. తాను ఇంగ్లాండ్ నుండి తిరిగి వచ్చి భారతదేశంలో స్టార్ టెలివిజన్‌తో అనుబంధం కలిగి ఉన్న ఆండ్రూ కోయిన్తో డేటింగ్ ప్రారంభించినప్పుడు తలెత్తిన వివాదాన్ని గుర్తుచేసుకుంది. మోడల్ అచ్లా సచ్దేవ్తో ఆండ్రూ విడిపోవడానికి తాను కారణమని తప్పుగా నిందించారని సుచిత్ర తెలిపింది. అచ్లా సచ్ దేవ్ తో పాటు సుచిత్ర కూడా ఇప్పుడు దానిని తలచుకుని నవ్వుకుంటున్నామని తెలిపారు.
సుచిత్రా పిళ్లై - లార్స్ కెజెల్డ్సెన్ 2005లో పెళ్లి ప్రతిజ్ఞ చేసుకున్నారు. వారి కుమార్తె అన్నీకా కెజెల్డ్సెన్కు గర్వించదగిన తల్లిదండ్రులు. ప్రీతి జింటా 2016లో జీన్ గుడ్నఫ్ను వివాహం చేసుకున్నారు. 2021లో సరోగసీ ద్వారా కవలలు జియా, జైలను స్వాగతించారు.